వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

'ఎన్టీఆర్ బసవతారకం, పొత్తుపై అధిష్టానానిదే నిర్ణయం, బైపోల్ ఫలితాలిలా'...

By Narsimha
|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: 2019 ఎన్నికల్లో ఏ టిడిపితో పొత్తు ఉండాలా, మరో పార్టీతో పొత్తు పెట్టుకోవాలనే విషయమై పార్టీ జాతీయ నాయకత్వానిదే తుది నిర్ణయమని మాజీ కేంద్ర మంత్రి బిజెపి సీనియర్ నాయకురాలు పురంధేశ్వరి చెప్పారు. అయితే రాష్ట్రంలో ఏ పార్టీతో పొత్తు ఉండాలనే విషయమై తమ అభిప్రాయాన్ని పార్టీ జాతీయ నాయకత్వానికి చెబుతామని ఆమె చెప్పారు.

పురంధేశ్వరీ షాక్: 'అలా అనలేదు, కేంద్రంపై ఏపీ తప్పుడు ప్రచారం''పురంధేశ్వరీ షాక్: 'అలా అనలేదు, కేంద్రంపై ఏపీ తప్పుడు ప్రచారం''

రాష్ట్రంలో చోటు చేసుకొన్న రాజకీయ పరిణామాలతో పాటు వచ్చే ఎన్నికల్లో పొత్తులు, ఎన్టీఆర్ జీవిత చరిత్రపై తీయనున్న సినిమాతో పాటు పోలవరం ప్రాజెక్టు నిర్మాణం గురించి పురంధేశ్వరి తన అభిప్రాయాలను వెల్లడించారు.

ఓ తెలుగు టీవి ఛానల్ పురంధేశ్వరిని ఆదివారం నాడు ఇంటర్వ్యూ చేశారు. ఈ ఇంటర్వ్యూలో ఆమె పలు విషయాలపై తన అభిప్రాయాలను నిర్మోహమాటంగా వెల్లడించారు.

పొత్తులపై బిజెపి అధిష్టానిదే తుది నిర్ణయం

పొత్తులపై బిజెపి అధిష్టానిదే తుది నిర్ణయం

2019 ఎన్నికల్లో ఏపీ రాష్ట్రంలో ఏ పార్టీతో పొత్తు ఉంటుందనే బిజెపి జాతీయ నాయకత్వానిదేనని మాజీ కేంద్ర మంత్రి పురంధేశ్వరి చెప్పారు. టిడిపితో పొత్తు కొనసాగించాలో, పవన్‌కళ్యాణ్‌తో చర్చించాలన్నా, వైసీపీతో పొత్తు పెట్టుకోవాలన్నా బిజెపి జాతీయ నాయకత్వానిదే తుది నిర్ణయమని పురంధేశ్వరి అభిప్రాయపడ్డారు. అయితే రాష్ట్రంలో నెలకొన్న పరిస్థితులపై బిజెపి జాతీయ నాయకత్వానికి సమాచారాన్ని ఇవ్వనున్నట్టు పురంధేశ్వరి ప్రకటించారు

ఎన్టీఆర్ బసవతారకం

ఎన్టీఆర్ బసవతారకం


ఎన్టీఆర్ గురించి ప్రజలకు తెలియాల్సిన విషయాలు కొత్తగా ఏమీ లేవని పురంధేశ్వరీ అభిప్రాయపడ్డారు. ఎన్టీఆర్ జీవితం ప్రజలకు అన్నీ తెలుసునని ఆమె చెప్పారు. ఎన్టీఆర్ గురించి కొత్తగా తెలియాల్సిన విషయాలు లేవని చెప్పారు. ఎన్టీఆర్ పుట్టిన నాటి నుండి రాజకీయాల్లోకి వచ్చేవరకు చోటు చేసుకొన్న పరిస్థితులపై బాలయ్య సినిమా తీస్తున్నారని విన్నానని పురంధేశ్వరి చెప్పారు.రామ్‌గోపాల్ వర్మ తీసిన సినిమాలో ఏముంటుందో తెలియదన్నారు. ఎన్టీఆర్‌పై రాసిన పాట బాగుందన్నారు. ఎన్టీఆర్ లక్ష్మీస్ కాదు... ఎన్టీఆర్ బసవతారకమని పురంధేశ్వరి అభిప్రాయపడ్డారు. మా అమ్మ బసవ తారకమని పురంధేశ్వరీ చెప్పారు.ప్రజలకు నిష్పక్షపాతంగా వాస్తవాలు ఈ సినిమాలో తెలియాల్సిన అవసరం ఉందన్నారు. అయితే ఈ సినిమాలపై మీడియాలో వస్తున్న వార్తలు చూసి బాధేసిస్తోందన్నారు.

పోలవరం ప్రాజెక్టుకు నిధులిచ్చేందుకు కేంద్రం రెఢీ

పోలవరం ప్రాజెక్టుకు నిధులిచ్చేందుకు కేంద్రం రెఢీ


పోలవరం ప్రాజెక్టును పూర్తి చేసేందుకు కేంద్ర ప్రభుత్వం రెడీగా ఉందని పురంధేశ్వరీ అభిప్రాయపడ్డారు. కాపర్ డ్యామ్ పూర్తైనా, స్పిల్ వే పనులు పూర్తి కానందున నీళ్ళు ఇచ్చే పరిస్థితి లేదన్నారు. ఇదే విషయాన్ని తాను లేవనెత్తానని ఆమె చెప్పారు. సుమారు 58 వేల ఎకరాల భూమిని సేకరించే అవసరం ఉందని చెప్పారు. ఈ పనులు పూర్తి కాకుండా సకాలంలో ప్రాజెక్టు పనులు ఎలా పూర్తవుతాయని ఆమె ప్రశ్నించారు.

సహం చేసేందుకుకేంద్రమిలా

సహం చేసేందుకుకేంద్రమిలా

కేంద్ర ప్రభుత్వం రాష్ట్రానికి ఇచ్చిన హమీలను నెరవేర్చేందుకు అన్ని రకాల ప్రయత్నాలను చేస్తోందని పురంధేశ్వరీ చెప్పారు. కేంద్ర ప్రభుత్వం రాష్ట్రానికి సహయం చేస్తున్నా రాష్ట్రంలో మాత్రం వేరుగా ప్రచారం సాగుతోందని పురంధేశ్వరీ అభిప్రాయపడ్డారు. కేంద్రం ఉన్న స్పీడుగా రాష్ట్ర ప్రభుత్వం వ్యవహరించడం లేదని ఆమె అభిప్రాయపడ్డారు.రాష్ట్రంలో చోటుచేసుకొంటున్న పరిస్థితులను బిజెపి నాయకత్వానికి వివరిస్తున్నట్టు చెప్పారు.

ఉపఎన్నికల ఫలితాలు వేరు

ఉపఎన్నికల ఫలితాలు వేరు


ఉప ఎన్నికల ఫలితాలు, జనరల్ ఎన్నికల ఫలితాలకు ప్రాతిపదిక కాదని పురంధేశ్వరీ అభిప్రాయపడ్డారు. ఉప ఎన్నికలు ఒకే అసెంబ్లీ నియోజకవర్గంలో జరిగితే ఆ నియోజకవర్గంపై కేంద్రీకరణ ఎక్కువగా ఉంటుంది. అయితే జనరల్ ఎన్నికల్లో కూడ ఇదే రకమైన ఫలితాలు వస్తాయని చెప్పలేమన్నారు. ఉప ఎన్నికల ఫలితాలు జనరల్ ఎన్నికల ఎన్నికల ఫలితాలకు ప్రాతిపదిక కావన్నారు.

English summary
Bjp national leadership will decide on alliance in 2019 election said former union minister Purandeshwari. Telugu news channel interviewed purandeshwari on Sunday.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X