India
  • search
  • Live TV
విజయవాడ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

సీఎం జగన్ పై నడ్డా విసుర్లు - మన పోరాటం ప్రాంతీయ పార్టీలతోనే : ప్రతీ ఇంటిపై జెండా ఎగరాలి..!!

|
Google Oneindia TeluguNews

బీజేపీ జాతీయాధ్యక్షుడు జేపీ నడ్డా ఏపీ ముఖ్యమంత్రి జగన్.. వైసీపీ పైన వ్యాఖ్యలు చేసారు. ఏపీలో వైసీపీ..టీడీపీ తో పాటుగా తెలంగాణలోని టీఆర్ఎస్ కుటుంబ పార్టీలని వ్యాఖ్యానించారు. ప్రధాని మోదీ తీసుకొచ్చిన ఆయుష్మాన్ భారత్ స్కీంను జగన్ బాబు ఆరోగ్యశ్రీ పేరుతో మార్చేసారని చెప్పుకొచ్చారు. ఆరోగ్య శ్రీ రాష్ట్రానికే పరిమితమని..ఆయుష్మాన్ భారత్ ఎక్కడైనా వినిగియోగించుకోవచ్చని వివరించారు. ఇక, జాతీయ పార్టీగా దేశంలో ఉన్నది బీజేపీ ఒక్కటేనని చెప్పారు. కాంగ్రెస్ పార్టీలో ఇండియన్ లేదని...నేషనల్ అసలేదని..కాంగ్రెస్ వారికి వర్తించందంటూ వ్యాఖ్యానించారు.

ఏపీలో వచ్చే ఎన్నికల్లో సత్తా చాటేలా

ఏపీలో వచ్చే ఎన్నికల్లో సత్తా చాటేలా

లండన్ లో కూర్చొని దేశానికి సంబంధించిన స్టేట్ మెంట్స్ ఇస్తారంటూ..అది అన్నా - చెల్లెల్ల పార్టీగా అభివర్ణించారు. బీజేపీ ఇప్పుడు పోరాటం చేస్తుంది ప్రాంతీయ పార్టీలతోనేనని నడ్డా స్పష్టం చేసారు. ఏపీలో 46 వేల పోలింగ్ కేంద్రాలు ఉన్నాయని.. రాజకీయాల్లో మార్పు కోసం అందరం కలిసి పని చేద్దామని నడ్డా పిలుపునిచ్చారు.

8569 శక్తి కేంద్రాలు ఏపీలో ఉన్నాయి. 6 నుంచి ఏడు వేల మంది ఉన్నారని.. నాలుగు నుంచి అయిదు పోలింగ్ బూతులు పర్యవేక్షించాలని సూచించారు. రానున్న రెండు నెలల్లో శక్తి కేంద్రాల్లో నియామకాలు పూర్తి చేసుకోవాలన్నారు. పోలింగ్ బూత్ లు కేంద్రంగా అన్ని వర్గాల వారిని పార్టీతో మమేకం చేయాలని నిర్దేవించారు. బూతు కమిటీల నియామకం త్వరిత గతిన అందిరీ భాగస్వాములను చేస్తూ..అన్ని వర్గాలకు అవకాశం కల్పిస్తూ పూర్తి చేయాలన్నారు.

వైసీపీ..టీఆర్ఎస్..టీడీపీ కుటుంబ పార్టీలే

వైసీపీ..టీఆర్ఎస్..టీడీపీ కుటుంబ పార్టీలే

కేంద్రం అమలు చేస్తున్న పథకాలు పేదలకు అందుతుందా లేదా చూడాలని స్పష్టం చేసారు. ఏపీ కోసం ప్రధాని మోదీ ఏం చేసారనే అంశం పైన పుస్తకం ప్రచురించామని..దీనిని ప్రతీ ఇంటికి అందించాలని సూచించారు. ఇదే తాను ఇస్తున్న రూట్ మ్యాప్ అని చెబుతూ.. దీనిని పక్కాగా అమలు చేస్తే రానున్న రోజుల్లో ఏపీలో పార్టీకి ఉజ్వల భవిష్యత్ ఖాయమని నడ్డా చెప్పుకొచ్చారు.

ప్రతీ నెలా చివరి ఆదివారం ప్రదాని మన్ కీ బాత్.. ప్రతీ బూత్ లో ఆ ప్రసంగాన్ని కార్యకర్తలతో కలిసి వినాలని కోరారు. ప్రతీ ఇంటికి వెళ్లి.. మోదీ ప్రభుత్వం ఏం మేలు చేసిందో వివరించి..వారిని ఒప్పించి.. వెళ్లిన ప్రతీ ఇంటికి బీజేపీ స్టిక్కర్ అంటించాలని సూచించారు. ప్రతీ బీజేపీ కార్యకర్త ఇంటి పై బీజేపీ జెండా ఎగరాలని నడ్డా స్పష్టం చేసారు. ఏ పార్టీకి లేని నాయకతవం.. కార్యకర్తలు బీజేపీకి ఉన్నారని చెప్పారు.

మరోసారి బీజేపీకే అధికారం.. రాష్ట్రంలోనూ

మరోసారి బీజేపీకే అధికారం.. రాష్ట్రంలోనూ

మరోసారి కేంద్రంలో అధికారం ఖాయమన్నారు. రాష్ట్రంలో అధికారం కోసం ప్రయత్నం చేయాలని పిలుపునిచ్చారు. ప్రధాని మోదీ రాజకీయాల్లో సంస్కరణలు మోదీ తీసుకొచ్చారన్నారు. అవినీతి..వారసత్వ..కుటుంబ రాజకీయాలకు చమరగీతం పాడారని నడ్డా చెప్పుకొచ్చారు. దేశం కరోనా వ్యాక్సిన్ ను అభ్యర్దించే పరిస్థితి నుంచి విదేశాలకు ఉచితంగా అందించే స్థాయికి చేరిందన్నారు.

ఇప్పటి వరకు 48 దేశాలకు ఉచితంగా వ్యాక్సిన్ అందించిన ఘనత మోదీ ప్రభుత్వానికి దక్కుతుందని నడ్డా చెప్పారు. బీజేపీ రాకీయ ప్రస్థానం ఉమ్మడి ఏపి హన్మకొండ నుంచి ప్రారంభమైందని... బీజేపీకి ఎంతో మంది నేతలను ఏపీ అందించిందని నడ్డా పేర్కొన్నారు. ఆత్మకూరులో బీజేపీ అభ్యర్ధిని గెలిపించుకోవాలని పిలుపునిచ్చారు.

English summary
BJP flag should fly on every house said its party national president JP Nadda who is on a visit to AP.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X