వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

మీ మాట నమ్మి వాజపేయి ఓడిపోయారు, నోట్లు పంచి గెలిచారు: బాబును దులిపిన వీర్రాజు

|
Google Oneindia TeluguNews

Recommended Video

బాబుకు వీర్రాజు ఊహించని షాక్! 2014లో చంద్రబాబు గెలిచేవారా ?

అమరావతి: 2014లో మీరు ఎలా అధికారంలోకి వచ్చారో తెలుసుకోవాలని బీజేపీ ఎమ్మెల్సీ సోము వీర్రాజు టీడీపీకి సూచించారు. టీడీపీ ఎమ్మెల్సీ రాజేంద్రప్రసాద్ వ్యాఖ్యలకు ఆయన కౌంటర్ ఇచ్చారు. వాస్తవాలు తెలుసుకొని మాట్లాడితే బాగుంటుందన్నారు.

కాంగ్రెస్‌తో కలిశావ్, మేం చెప్పామా, పవన్ కళ్యాణ్ వల్లే: బాబుపై వీర్రాజు సంచలనంకాంగ్రెస్‌తో కలిశావ్, మేం చెప్పామా, పవన్ కళ్యాణ్ వల్లే: బాబుపై వీర్రాజు సంచలనం

మా దయ వల్లే బీజేపీకి గత అసెంబ్లీ ఎన్నికల సమయంలో నాలుగు సీట్లు వచ్చాయని, మేం లేకుంటే అవి కూడా రాకపోయేవి అని, బీజేపీ ఏపీలో అధికారంలోకి వస్తుందనే కలలు మానుకోవాలని రాజేంద్ర ప్రసాద్ సోమవారం అన్నారు. మా దయాదాక్షిణ్యాల వల్లే ఏపీలో బీజేపీ మనుగడ సాగిస్తోందని, వీర్రాజు ఉత్తర కుమార ప్రగల్భాలు మానుకోవాలన్నారు.

చంద్రబాబు మాటలు నమ్మి వాజపేయి మోసపోయారు

చంద్రబాబు మాటలు నమ్మి వాజపేయి మోసపోయారు

దీంతో సోము వీర్రాజు మంగళవారం రెచ్చిపోయారు. చంద్రబాబు దుమ్ము దులిపారు. రాజేంద్ర ప్రసాద్ తెలుసుకొని మాట్లాడాలని హితవు పలికారు. 2004లో చంద్రబాబు మాటలు నమ్మి, ముందస్తు ఎన్నికలకు వెళ్లి వాజపేయి ఓడిపోయారని తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఆ తర్వాత ఆయన మంచానికే పరిమితమయ్యారని చెప్పారు.

 మేం అ్నని స్థానాల్లో పోటీ చేస్తే మీరు గెలిచేవారా

మేం అ్నని స్థానాల్లో పోటీ చేస్తే మీరు గెలిచేవారా

కాకినాడలో మేం (బీజేపీ) అన్ని స్థానాల్లో పోటీ చేస్తే మీరు అధికారంలోకి వచ్చే వారా అని సోము వీర్రాజు ప్రశ్నించారు. అన్ని స్థానాల్లో పోటీ చేస్తే ఒక్కో చోట 5వేల ఓట్లు దక్కించుకున్నా టీడీపీ ఓడిపోయేదన్నారు. మిత్రపక్షం కారణంగా బీజేపీ ప్రతిసారి మోసపోతోందన్నారు. కనీసం తాము తమ కార్యకర్తలకు ప్రభుత్వ పథకాలను కూడా ఇప్పించుకోలేకపోతున్నామని చెప్పారు.

బలపడుతున్న ప్రతిసారి ఉద్యమం, అడిగితే మోడీ ఫోటో

బలపడుతున్న ప్రతిసారి ఉద్యమం, అడిగితే మోడీ ఫోటో

పోలవరం, పట్టిసీమ ప్రాజెక్టులకు తాము సహకరించామని సోము వీర్రాజు చెప్పారు. మోడీ చేస్తున్న కార్యక్రమాల వల్ల మంత్రి నారా లోకేష్‌కు 20 బహుమతులు వచ్చాయని చెప్పారు. మేం అడగగా అడగగా లోకేష్ పక్కన ప్రధాని మోడీ పక్కన చిన్న ఫోటో పెట్టారన్నారు. మేం బలపడుతున్న ప్రతిసారి ఎక్కడో ఓ చోట ప్రత్యేక హోదా ఉద్యమం మొదలవుతోందని ఆవేదన వ్యక్తం చేశారు.

 ముందస్తుకు వెళ్లడం వల్లే ఓడిపోయాం

ముందస్తుకు వెళ్లడం వల్లే ఓడిపోయాం

మీతో కలిసి పోటీ చేయడం వల్లే 2004లో ఓడిపోయామని సోము వీర్రాజు చెప్పారు. అప్పుడు ముందస్తు ఎన్నికలకు వెళ్లి తప్పు చేశామని, దీంతో పదేళ్ల కాంగ్రెస్ పాలనలో దేశం నష్టపోయిందన్నారు. తాను ఏదో అంటే తనపై రాజేంద్రప్రసాద్ మాట్లాడారని, వాటిపై తాను స్పందించనని చెప్పారు. అయితే ఆయన 1990లలో జరిగి నాటి నుంచి నేటి వరకు తవ్వి టిడిపికి కౌంటర్ ఇచ్చారు.

ఇదీ మా సత్తా

ఇదీ మా సత్తా

తాము పార్టీలను చీల్చి అధికారం చేపట్టమని సోము వీర్రాజు చెప్పారు. వాజపేయి హయాంలో తాము అందుకే ఎన్నికలకు వెళ్లామని గుర్తు చేశారు. నాటి నుంచి నేటి వరకు ఎన్నో జరిగాయని, ఇవన్ని ఎంతో ముఖ్యమైన విషయాలు అని చెప్పారు. 1999లో తాము తెలంగాణ టీడీపీ నేతలు మద్దతు ఇస్తామని చెప్పినా తీసుకోలేదని చెప్పారు. అప్పుడు కలిసి పోటీ చేసి 7 లోకసభ స్థానాలు, 12 అసెంబ్లీ సీట్లు గెలిచామని చెప్పారు.

 కానీ ఆ తర్వాత చంద్రబాబు ఇలా అన్నారు

కానీ ఆ తర్వాత చంద్రబాబు ఇలా అన్నారు

1999 నుంచి 2004 వరకు చంద్రబాబు చెప్పిన దానిని వాజపేయి గౌరవించారని సోము వీర్రాజు చెప్పారు. కానీ 2003లో దురదృష్టవశాత్తు ప్రమాదం జరిగిందని, ఎన్నికలు జరిగాయన్నారు. చంద్రబాబు చెప్పిన మాట విని ముందస్తు ఎన్నికలకు వెళ్లి ఓడిపోయామన్నారు. కానీ ఆ తర్వాత బీజేపీతో పొత్తు చారిత్రాత్మక తప్పిదం అని చంద్రబాబు చెప్పారని, అయినా తాము మళ్లీ పొత్తు పెట్టుకుంటామంటే సరేనన్నామని చెప్పారు. 2009లో చంద్రబాబు ఎందుకు గెలవలేదన్నారు.

బ్లాక్ మెయిల్ చేస్తున్నారా అన్నారు

బ్లాక్ మెయిల్ చేస్తున్నారా అన్నారు

ఓ ఎన్నికల సమయంలో తాము అన్ని స్థానాల్లో పోటీ చేస్తామంటో ఓ టీడీపీ మద్దతుదారు.. అన్ని స్థానాల్లో పోటీ చేస్తారా, మీకు అంత ఉందా అన్నారని, అప్పుడు తాను మేం యాభై స్థానాల్లో పోటీ చేస్తే 5వేల ఓట్లు వస్తాయని, అప్పుడు మీరు ఓడిపోతారని చెప్పానని, అయితే బ్లాక్ మెయిల్ చేస్తున్నారా అని అడిగారని వ్యాఖ్యానించారు. కానీ మేం బ్లాక్ మెయిల్ చేయదల్చుకోలేదన్నారు.

నోట్లు రద్దు చేసి మేం గెలిస్తే నోట్లు పంచి మీరు గెలుస్తున్నారు

నోట్లు రద్దు చేసి మేం గెలిస్తే నోట్లు పంచి మీరు గెలుస్తున్నారు

నోట్లు రద్దు చేసి మేం నెగ్గుతుంటే, వాళ్లు నోట్లు పంచి నెగ్గుతున్నారని సోము వీర్రాజు టీడీపీపై తీవ్ర ఆరోపణలు చేశారు. ఈ సందర్భంగా నంద్యాల ఉప ఎన్నికలను ప్రస్తావించారు. ఈ రాష్ట్రంలో ముగ్గురు మోడీ, పవన్ కళ్యాణ్, చంద్రబాబు కలిసి తిరిగితే ప్రతిపక్షం కంటే రెండు శాతం ఎక్కువ వచ్చిందన్నారు. కానీ గుజరాత్‌లో ఇప్పటికీ మాకు ఒంటరిగా 9 శాతం ఎక్కువగా వచ్చిందన్నారు.

English summary
BJP MLC Somu Veerraju on Tuesday fired at Telugu Desam Party and Chandrababu Naidu for TDP leader Rajendraprasad comments.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X