కడప వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

జగన్ కు సీఎం రమేష్ ఆత్మీయ స్వాగతం: శాలువ కప్పి.. మనసులో మాట బయట పెట్టి..!

|
Google Oneindia TeluguNews

కడప: ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పర్యటన సందర్భంగా ఓ అరుదైన సంఘటన చోటు చేసుకుంది. వైఎస్ జగన్ అంటే ఒంటికాలిపై లేచే నాయకుడిగా ముద్ర పడిన ఒకప్పటి తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకుడు, ప్రస్తుతం భారతీయ జనతా పార్టీ రాజ్యసభ సభ్యుడు సీఎం రమేష్ అనూహ్య నిర్ణయాన్ని తీసుకున్నారు. కడప జిల్లా పర్యటనకు వచ్చిన వైఎస్ జగన్ ను ఆయన కలుసుకున్నారు.జమ్మలమడుగు అసెంబ్లీ నియోజకవర్గం పరిధిలోని సున్నపురాళ్ల పల్లి వద్ద ఈ ఘటన చోటు చేసుకుంది.

Flash back 2019: గోదావరిలో లాంచీ మునక.. ప్రభుత్వ వైఫల్యానికి మచ్చుతునక!Flash back 2019: గోదావరిలో లాంచీ మునక.. ప్రభుత్వ వైఫల్యానికి మచ్చుతునక!

వైసీపీ ఎమ్మెల్యేలతో కలిసి..

వైసీపీ ఎమ్మెల్యేలతో కలిసి..


వైఎస్ జగన్ సోమవారం ఉదయం జమ్మలమడుగు సమీపంలోని సున్నపురాళ్ల పల్లి-పెద్దదండ్లూరు గ్రామాల మధ్య కడప స్టీల్ ఫ్యాక్టరీ శంకుస్థాపన చేసిన విషయం తెలిసిందే. ఈ కార్యక్రమానికి పలువురు మంత్రులు, జిల్లాకు చెందిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ లోక్ సభ, శాసన సభ్యులు పాల్గొన్నారు. బీజేపీ ఎంపీ సీఎం రమేష్ సైతం వారితో జత కలిశారు. ప్రొద్దుటూరు సమీపంలోని తన స్వగ్రామం నుంచి కారులో బయలుదేరిన ఆయన కడప స్టీల్ ఫ్యాక్టరీ శంకుస్థాపన ప్రదేశానికి చేరుకున్నారు. వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యేలు ఆయనకు సాదరంగా ఆహ్వానించారు.

ఉక్కు దీక్షను గుర్తు చేసిన వైసీపీ ఎమ్మెల్యేలు..

ఉక్కు దీక్షను గుర్తు చేసిన వైసీపీ ఎమ్మెల్యేలు..

ఈ సందర్భంగా సీఎం రమేష్.. ఎలాంటి భేషజాలు లేకుండా.. వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యేలు, ఎంపీలతో మాట్లాడటం కనిపించింది. వారందర్నీ ఆయన చిరునవ్వుతో పలకరించారు. అందరితోనూ కరచాలనం చేశారు. ఆ సమయంలో పలువురు శాసన సభ్యులు ఉక్కు దీక్ష గురించి సీఎం రమేష్ వద్ద ప్రస్తావనకు తీసుకు వచ్చారు. కడప జిల్లాలో ఉక్కు కర్మాగారాన్ని నెలకొల్పాలని డిమాండ్ చేస్తూ ఇదివరకు తెలుగుదేశంలో ఉన్న సమయంలో సీఎం రమేష్ ఉక్కు దీక్ష పేరుతో ఆరు రోజుల పాటు నిరాహార దీక్షను చేపట్టిన విషయం తెలిసిందే.

జగన్ కు శాలువా కప్పి..

జగన్ కు శాలువా కప్పి..

కొద్ది సేపటి తరువాత వైఎస్ జగన్ శంకుస్థాపన ప్రదేశానికి చేరుకున్నారు. ఈ సందర్భంగా వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యేలు, ఎంపీలు జగన్ కు పుష్పగుచ్ఛాలను అందించి, స్వాగతం పలికారు. సీఎం రమేష్ సైతం వైఎస్ జగన్ కు శాలువా కప్పారు. పుష్పగుచ్ఛాన్ని అందించి ఆత్మీయ స్వాగతం పలికారు. చిరునవ్వుతో పలకరించారు జగన్. `ఎలా ఉన్నారన్నా.. అంతా బాగుండారా?..` అని కుశల ప్రశ్నలు వేశారు. అదే చిరునవ్వుతో సీఎం రమేష్ ఆయనకు బదులిచ్చారు.

 ఉక్కు దీక్ష సఫలం చేయాలంటూ..

ఉక్కు దీక్ష సఫలం చేయాలంటూ..

ఈ సందర్భంగా సీఎం రమేష్.. ఉక్కు దీక్ష గురించి జగన్ వద్ద ప్రస్తావించారు. `మీరు నా ఉక్కు దీక్షను సఫలం చేయాలి. ఇదివరకు ఏ ప్రభుత్వం కూడా కడప స్టీల్ ప్లాంట్ గురించి పట్టించుకోలేదు. స్టీల్ ప్లాంట్ కోసం జిల్లావాసులు ఎదురు చూస్తున్నారు. మీరైనా వారి కలను నిజం చేయాలి..` అని సీఎం రమేష్ కోరారు. తప్పకుండా జిల్లావాసుల కలను నెరవేరుస్తామని, మాట ఇచ్చిన తరువాత వెనుకంజ వేయబోననే విషయం తెలుసు కదా.. అని గుర్తు చేశారు.

English summary
Bharatiya Janata Party Rajya Sabha member CM Ramesh has invited Chief Minister YS Jagan at Jammalamadugu in Kadapa district, who came for laid stone for Kadapa Steel Plant.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X