వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

చంద్రబాబుతో స్నేహం అవసరం లేదు: రాజధానిపై రాష్ట్ర ప్రభుత్వానిదే తుది నిర్ణయం: బీజేపీ నేత జీవీఎల్:..

|
Google Oneindia TeluguNews

చంద్రబాబు పైన బీజేపీ రాజ్యసభ సభ్యుడు జీవీఎల్ నరసింహారావు తీవ్ర వ్యాఖ్యలు చేసారు. తాము తప్పు చేశామని‌ చంద్రబాబు ఇప్పుడు అంటున్నారని.. ఆ రోజు ఎన్ని సార్లు చెప్పినా ఆయన చెవికెక్కలేదన్నారు. చంద్రబాబుకు సిద్ధాంతం, విధానం లేదని.. చంద్రబాబుతో స్నేహం చేయాల్సిన అవసరం తమకు లేదని జీవీఎల్ స్పష్టం చేశారు. టీడీపీ నుంచి నలుగురు రాజ్యసభ సభ్యులు బీజేపీలోకి వచ్చారని... లోక్‌సభ ఎంపీలతో తమకు అసలు అవసరమే లేదన్నారు. ఏపీ రాజధాని విషయంలో రాష్ట్ర ప్రభుత్వానికి నిర్ణయం తీసుకొనే అధికారం ఉందని..ఇందులో కేంద్రం జోక్యం చేసుకోదని స్పష్టం చేసారు. అయితే, వ్యక్తిగత ప్రయోజనాల కోసం కాకుండా..ప్రజలకు మేలు చేసే విధంగా నిర్ణయం ఉండాలని జీవీఎల్ సూచించారు. ఏపీపై దృష్టి పెట్టి అనేక‌ కార్యక్రమాలు చేపడుతున్నామన్నారు.

చంద్రబాబు అవసరం మాకు లేదు..
టీడీపీ అధినేత తాము బీజేపీకి దూరమై తప్పు చేసామంటూ చేసిన వ్యాఖ్యల పైన బీజేపీ నేతలు ఒక్కొక్కరుగా స్పందిస్తున్నారు. తాజాగా రాజ్యసభ సభ్యుడు జీవీఎల్ నరసింహారావు సైతం దీని పైన తీవ్రంగా స్పందించారు. చంద్రబాబు తప్పు చేశామంటూ ఇప్పుడు అంటున్నారని.. ఆ రోజు ఎన్ని సార్లు చెప్పినా ఆయన చెవికెక్కలేదన్నారు. చంద్రబాబుకు సిద్ధాంతం, విధానం లేదని.. చంద్రబాబుతో స్నేహం చేయాల్సిన అవసరం తమకు లేదని జీవీఎల్ స్పష్టం చేశారు. టీడీపీ నుంచి నలుగురు రాజ్యసభ సభ్యులు బీజేపీలోకి వచ్చారని... లోక్‌సభ ఎంపీలతో తమకు అసలు అవసరమే లేదన్నారు.

ఏపీలో తమంతట తామే ఒక‌ శక్తిగా ఎదగాలని చూస్తున్నామన్నారు. వచ్చే ఎన్నికలలో తమ శక్తి ఏమిటో అందరికీ తెలుస్తుందని జీవీఎల్ పేర్కొన్నారు. చంద్రబాబు ఎప్పుడూ ఒంటరిగా సీఎం కాలేదని.. బీజేపీతో పొత్తు వల్ల చంద్రబాబు రెండుసార్లు సీఎం అయ్యారన్నారు. ఏపీపై దృష్టి పెట్టి అనేక‌ కార్యక్రమాలు చేపడుతున్నామన్నారు. గతంలో ఎప్పుడూ లేని‌ విధంగా ఏపీకి అనేక సంస్థలు తెచ్చామన్నారు.

BJP Rajyasabha member clarified that BJP no need of ChandraBabu in AP politics

రాజధాని పైన రాష్ట్ర ప్రభుత్వానిదే నిర్ణయం..
రాజధాని విషయంలో రాష్ట్ర ప్రభుత్వం ప్రజల్లో ఉన్న అపోహలు తొలిగించాల్సిన అవసరం ఉందని జీవీఎల్ అభిప్రాయపడ్డారు. రాజధాని విషయంలో కేంద్రం జోక్యం చేసుకోదని..రాష్ట్ర ప్రభుత్వమే నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుందని స్పష్టం చేసారు. అదే సమయంలో సొంత ప్రయోజనాల కోసం కాకుండా.. మొత్తంగా రాష్ట్ర ప్రయోజనాలకు అనుగుణంగా రాజధాని పైన నిర్ణయం తీసుకోవాలని సూచించారు. ఇప్పటికే రాజధాని కోసం ఖర్చు చేసిన నిధుల అంశాన్ని సైతం పరిగణలోకి తీసుకోవాల్సిన అవసరం ఉందని జీవీఎల్ పేర్కొన్నారు.

దేశంలో మోదీ, షా ద్వయం కొత్త ఒరవడికి శ్రీకారం చుట్టిందన్నారు. జల్ జీవన్ మిషన్ అనే అతి పెద్ద ప్రాజెక్టు కేంద్రం ప్రారంభించబోతోందని జీవీఎల్ వెల్లడించారు. ఈ మిషన్ ద్వారా గ్రామాల్లో మౌలిక వసతులను కల్పిస్తామన్నారు. జల్ జీవన్ మిషన్ అనే అతి పెద్ద ప్రాజెక్టు కేంద్రం ప్రారంభించబోతోందని జీవీఎల్ వెల్లడించారు. ఈ మిషన్ ద్వారా గ్రామాల్లో మౌలిక వసతులను కల్పిస్తామన్నారు. అయితే, బీజేపీలోకి చేరికలు రానున్న రోజుల్లో మరింతగా పెరుగుతాయని.. మోదీ నాయకత్వం పట్ల అన్ని ప్రాంతాల్లో ఊహించని విధంగా ఆదరణ లభిస్తోందని జీవీఎల్ చెప్పుకొచ్చారు.

English summary
BJP Rajyasabha member clarified that BJP no need of Chandra Babu in AP politics.GVL says Central govt concentrated on AP development in all aspects.Shortly more programmes will be start in AP.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X