• search
 • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

చంద్రబాబుకి టెన్షన్ తగ్గించిన బీజేపీ .. పార్టీ ఫిరాయించే వారిలో వారు లేరని క్లారిటీ

|

ఆంధ్రప్రదేశ్ బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ టీడీపీ రిలీఫ్ అయ్యే న్యూస్ చెప్పారు. ఒక పక్క పార్టీ ఫిరాయింపుల విషయంలో టెన్షన్ పడుతున్న టీడీపీ కి కాస్త ఊరటనిచ్చే వార్త చెప్పారు . నిన్నటి దాకా టీడీపీ ఖాళీ అవుతుందని, ఏపీలో వైసీపీ కి ప్రత్యామ్నాయ రాజకీయ పార్టీ భవిష్యత్ లో బీజేపీనేనని చెప్పిన కన్నా లక్ష్మీ నారాయణ సడన్ గా షాకింగ్ న్యూస్ చెప్పారు .

అసెంబ్లీలో మాటల యుద్దం.. గత ప్రభుత్వం పోలవరం అంచనాలు పెంచిందన్న వైసీపి..! తిప్పికొట్టిన బాబు..!!

  2024లో ఏపీలో బీజేపీ అధికారం చేపడుతుంది...
  టీడీపీ నుండి మాకు టచ్లో ఎవరున్నారంటే అంటూ తేల్చేసిన కన్నా లక్ష్మీ నారాయణ

  టీడీపీ నుండి మాకు టచ్లో ఎవరున్నారంటే అంటూ తేల్చేసిన కన్నా లక్ష్మీ నారాయణ

  టీడీపీకి చెందిన ఎమ్మెల్యేలు మాతో టచ్‌లో లేరని.. మాజీ మంత్రులు, మాజీ ఎమ్మెల్యేలు మాత్రం తమతో నిరంతరం టచ్‌లో ఉంటున్నారని ఏపీ బీజేపీ అధ్యక్షుడు కన్నా లక్ష్మీ నారాయణ స్పష్టం చేశారు. సోమవారం నాడు ప్రకాశం జిల్లాలో పర్యటించిన కన్నా లక్ష్మీ నారాయణ ఏపీ ప్రభుత్వం ప్రవేశపెట్టిన సంక్షేమ కార్యక్రమాలు, బీజేపీలో నేతల చేరికల గురించి మాట్లాడారు. వైఎస్ జగన్ ప్రవేశపెట్టిన సంక్షేమ కార్యక్రమాలు చెప్తున్నది ఒకటి , ఆచరణలోకి వచ్చే సరికి పొంతన ఉండటం లేదన్నారు. టీడీపీ కంటే వైసీపీ నాయకులు ఎక్కువ అరాచకాలు చేసేందుకు ప్రయత్నిస్తున్నారని కన్నా షాకింగ్ కామెంట్స్ చేశారు.

  వైసీపీ పై ఫైర్ అయిన బీజేపీ రాష్ట్రాధ్యక్షుడు కన్నా లక్ష్మీ నారాయణ

  వైసీపీ పై ఫైర్ అయిన బీజేపీ రాష్ట్రాధ్యక్షుడు కన్నా లక్ష్మీ నారాయణ

  గతంలో తెలుగుదేశం పార్టీ కూడా ఇలాంటి అరాచకాలకే పాల్పడిందని పేర్కొన్న కన్నా ఇప్పుడు వైసీపీ కూడా అదేబాటలో పయనిస్తోందని మండిపాటుకు గురయ్యారు . పద్దతి మార్చుకోకపోతే టీడీపీకి పట్టిన గతే పడుతోందని కన్నా హెచ్చరించారు. ఇక రాష్ట్రంలో గతంలో ఎప్పుడూ లేనంతగా వైసీపీ అరాచకాలు చేస్తుందని కన్నా మండిపడ్డారు . ఢిల్లీ నుంచి గల్లీ దాకా ఇతర పార్టీల నుంచి నాయకులు బీజేపీలోకి వలస వస్తున్నారని కన్నా తెలియజేశారు . బీజేపీలో ఎవరు చేరినా తాము స్వాగతం పలుకుతున్నట్లు తెలిపారు. అయితే ఏపీలో 2014 నాటికి బీజేపీ బలోపేతం అవుతుందని వైసీపీకి ప్రత్యామ్నాయంగా మారుతుందన్న దాంట్లో ఎలాంటి సందేహం లేదన్నారు కన్నా లక్ష్మీనారాయణ.

  ఫిరాయింపులపై కన్నా క్లారిటీ ... చంద్రబాబుకి ఊరట

  ఫిరాయింపులపై కన్నా క్లారిటీ ... చంద్రబాబుకి ఊరట

  టీడీపీ ఎమ్మెల్యేలు తమతో టచ్ లో లేరని కన్నా లక్ష్మీనారాయణ ప్రకటించడంతో టీడీపీ అధిష్టానం ముఖ్యంగా సీఎం చంద్రబాబు కాస్త టెన్షన్ నుండి రిలీఫ్ అయ్యారు, ఇప్పటికే రాజ్య సభ నుండి నలుగురు టీడీపీ ఎంపీలు పార్టీ ఫిరాయించటంతో షాక్ లో ఉన్నారు చంద్రబాబు . ఇక టీడీపీ ఎమ్మెల్యేలు, కీలక నేతలు సైతం గోడ దూకే ప్లాన్ లో ఉన్నారు. ఇక ఈ నేపధ్యంలో పార్టీని కాపాడుకోవటం చంద్రబాబుకు కత్తి మీద సాములా మారింది. ఎప్పుడు ఏ ఎమ్మెల్యే గోడదూకుతాడో, అసలు ప్రతిపక్ష హోదా ఉంటుందా లేదా అన్న సందేహం చంద్రబాబులో ఉండేది. కానీ కన్నా తాజా ప్రకటనతో చంద్రబాబు రిలీఫ్ అయ్యారు.

  English summary
  The TDP chief, especially Chandrababu, has been relieved of some tension as Laxmi Narayana announces that the TDP MLAs are not in touch with him. TDP MLAs and key leaders are also planning to jump from TDP . It was in this context that Chandrababu became tension and trying to protect the party. He felt tensed about the party MLAs and MPs defections into the party , and there was actual opposition status or not, Chandrababu. But with the latest announcement of Kanna Lakshmi Narayana , Chandrababu got relief.
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Oneindia sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Oneindia website. However, you can change your cookie settings at any time. Learn more
  X