కర్నూలు వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

ఏపీ వ్యాప్తంగా కొనసాగుతున్న బీజేపీ పాదయాత్రలు .. ఎందుకంటే

|
Google Oneindia TeluguNews

గాంధీ సంకల్పయాత్ర పేరుతో గాంధీ ఆదర్శాలను, ఆయన ఆచరణలను ప్రజల్లోకి తీసుకు వెళ్లడం కోసం ప్రధాని నరేంద్ర మోడీ పిలుపుమేరకు ఏపీ వ్యాప్తంగా బీజేపీ నేతలు పాదయాత్రలు చేస్తున్నారు. మహాత్మ గాంధీ జయంతి నాడు ప్రధాని నరేంద్ర మోడీ ఐన్ స్టీన్ ఛాలెంజ్ చేశారు. మహాత్మా గాంధీ సిద్ధాంతాలు భావితరాలకు గుర్తుండిపోయేలా భారత ప్రధాని చేసిన చాలెంజ్ లో భాగంగా గాంధీజీ సిద్ధాంతాలను ముందు తరాలకు తెలియజేసేలా కార్యాచరణ రూపొందించాలని బీజేపీ భావించింది .

అందులో భాగంగానే గాంధీ సంకల్ప యాత్ర నిర్వహిస్తున్నారు బిజెపి నేతలు. ఏపీలో రాష్ట్రవ్యాప్తంగా కొనసాగుతున్న గాంధీ సంకల్ప యాత్ర లో బీజేపీ రాజ్యసభ ఎంపీలు పాల్గొంటున్నారు. నేడు జగ్గయ్యపేటలో పాదయాత్రకు ఎంపీ సుజనాచౌదరి పాల్గొంటున్నారు ఎన్టీఆర్ సర్కిల్, కోదాడ రోడ్, ఎస్ఎమ్ పేట్ క్రాస్, మంగొల్లు, గోపినేని పాలెం, మక్కపేట, పెనుగంచిప్రోలు మీదుగా పాదయాత్ర సాగనుంది. గాంధీజీ సిద్ధాంతాలను ప్రజల్లోకి తీసుకెళ్లడం కోసం ఈ పాదయాత్రను నిర్వహిస్తున్నారు. గుంటూరు జిల్లా మంగళగిరిలోనూ బిజెపి ఆధ్వర్యంలో గాంధీ సంకల్ప యాత్ర నిర్వహిస్తున్నారు.

BJPs pada yathra throughout the AP .. why because

గాంధీ విగ్రహానికి నివాళులు అర్పించిన అనంతరం నేతలు యాత్ర ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో జాతీయ కార్యదర్శి సత్యమూర్తి, మాజీ మంత్రులు శనక్కాయల అరుణ, రావెల కిశోర్ బాబు పాల్గొన్నారు. బీజేపీ ముఖ్యనేత సునీల్‌ దేవధర్‌ ఆధ్వర్యంలో కడప జిల్లా పోట్లదుర్తిలో బీజేపీ సంకల్ప యాత్ర ప్రారంభం ప్రారంభించింది బీజేపీ . మరోవైపు కర్నూలు జిల్లాలో గాంధీజీ సంకల్ప యాత్రను ఏపీ బీజేపీ అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ ప్రారంభించారు. ఈ యాత్రలో ఎంపీ టీజీ వెంకటేష్‌ పాల్గొన్నారు.ఇక అంతే కాకుండా ఈ పాదయాత్ర ఎంపీ సీఎం రమేష్ ఆధ్వర్యంలో జిల్లాలో జరుగుతోంది. ప్రొద్దుటూరు, గోపవరం, కొర్రపాడు మీదుగా యాత్ర సాగనుంది. మొత్తానికి రాష్ట్ర వ్యాప్తంగా గాంధీ సంకల్పయాత్ర నిర్వహిస్తూ, గాంధీ సిద్ధాంతాలను, ఆచరణలను ప్రజల్లోకి తీసుకెళ్తున్నారు బిజెపి నాయకులు.

English summary
BJP leaders across the country are marching to Prime Minister Narendra Modi's call to bring Gandhi's ideals and his practices to the public in the name of Gandhi's Yatra. Prime Minister Narendra Modi made Einstein Challenge on Mahatma Gandhi Jayanti The BJP intends to implement Gandhiji's ideals to the earlier generations as part of the Indian Prime Minister's Challenge to make Gandhi's theories more memorable.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X