వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

టీడీపీ ఎంపీల ఫిరాయింపుకు బీజేపీ కొత్త భాష్యం! ఆ నలుగురు అందుకే చేరారట

|
Google Oneindia TeluguNews

టిడిపి రాజ్యసభ ఎంపీలు పార్టీని వీడి బీజేపీ పంచన చేరిన వార్త మొత్తం తెలుగు రాష్ట్రాలను కదిలించింది. అంతే కాదు కేంద్రంలో సరికొత్త రాజకీయ సమీకరణాలకు కారణంగా మారింది . ఇక టీడీపీ ఎంపీల పార్టీ మార్పుపై బీజేపీ నేత జీవీఎల్ నరసింహారావు స్పందించారు .పార్టీ మార్పు పై ఆయన మాట్లాడుతూ ఇప్పుడు చాలా మంది చూపు బీజేపీపై ఉందని చెప్పారు.

పవన్ కు షాకిచ్చి జనసేనను వీడనున్న మరోనేత .. తిరిగి సొంతగూటికి చేరే ఛాన్స్పవన్ కు షాకిచ్చి జనసేనను వీడనున్న మరోనేత .. తిరిగి సొంతగూటికి చేరే ఛాన్స్

టీడీపీనే కాదు ఇతర పార్టీల నేతలు చాలా మందే టచ్ లో ఉన్నారన్న జీవీఎల్

టీడీపీనే కాదు ఇతర పార్టీల నేతలు చాలా మందే టచ్ లో ఉన్నారన్న జీవీఎల్


ఇతర పార్టీలకు చెందిన చాలా మంది నేతలు తమ పార్టీ నేతలతో టచ్‌లో ఉన్నారని, వారి పేర్లు బయటపెట్టబోమని పేర్కొన్నారు జీవీఎల్ . బీజేపీ నాయకత్వం, నరేంద్రమోదీ పాలన పట్ల నమ్మకం ఉండబట్టే అనేకమంది బీజేపీ వైపు మొగ్గు చూపిస్తున్నారని ఆయన వివరించారు.అంతే కానీ ఎలాంటి జిమ్మిక్కులు తాము చెయ్యలేదని, అలాంటి అవసరం కూడా బీజేపీకి లేదన్నారు. ఇది తాము చేసిన ఆపరేషన్ ఆకర్ష కాదని, నరేంద్రమోదీకి ప్రజల్లో ఉన్న ఆదరణ కారణంగా, మోడీపై నమ్మకంతోనే పలు పార్టీలకు చెందిన నేతలు బీజేపీ వైపు చూస్తున్నారని ఆయన స్పష్టం చేశారు.

పార్టీ మార్పుకు ఎలాంటి ఆపరేషన్ ఆకర్ష్ లు లేవు .. మోడీ చరిష్మా చూసే ఆకర్షణ

పార్టీ మార్పుకు ఎలాంటి ఆపరేషన్ ఆకర్ష్ లు లేవు .. మోడీ చరిష్మా చూసే ఆకర్షణ

భారతీయ జనతాపార్టీని బలోపేతం చేయడానికి ఇతర పార్టీల నాయకులను కూడా పార్టీలోకి ఆహ్వానిస్తామని గతంలో చెప్పిన విషయాన్ని జీవీఎల్ గుర్తు చేశారు. ఇక తెలుగుదేశం పార్టీని వీడిన టిడిపి నాయకులపై స్పందించిన బిజెపి రాజ్యసభ ఎంపి జివిఎల్ నరసింహారావు, "మేము టిడిపి ఎంపిలపై ఎలాంటి జిమ్మిక్కులు చెయ్యలేదని . వాస్తవానికి, ప్రధానమంత్రి నరేంద్ర మోడీ చరిష్మా వారిని ఆకర్షించే బిజెపితో కలిసి నడవటానికి వచ్చారని పేర్కొన్నారు . నరేంద్ర మోడీ చరిష్మా చూసే పార్టీ మారుతున్నారని జీవీఎల్ పేర్కొన్నారు.

భవిష్యత్ అంతా బీజేపీదే .. ఇది ఆరంభం మాత్రమే

భవిష్యత్ అంతా బీజేపీదే .. ఇది ఆరంభం మాత్రమే

సార్వత్రిక ఎన్నికలకు ముందే మేము పలు ప్రాంతీయ పార్టీల నాయకులలో బీజేపీ పట్ల ఆకర్షితులైన ఈ ధోరణిని చూశాము, కాబట్టి మాకు ఇది కొత్తేమీ కాదన్నారు జీవీఎల్ . అయినప్పటికీ, భవిష్యత్తులో చాలా మంది నాయకులు మా వద్దకు వస్తారని ఆయన పేర్కొన్నారు. ఇది ఆరంభం మాత్రమేనని బీజేపీలోకి వలసలు కొనసాగుతాయని ఆయన పేర్కొన్నారు. నలుగురు ఎంపీలు సిఎం రమేష్, సుజనా చౌదరి, టిజి వెంకటేష్, గరికపాటి రామ్మోహన్ రావులు మోడీ, అమిత్ షాలను ఢిల్లీలో అనధికారికంగా కలుసుకున్నారని, ఇక మోడీ బిజెపిలో చేరడానికి అధికారికంగా తమ అంగీకారం తెలియజేశారని జీవీఎల్ పేర్కొన్నారు.

English summary
The news of TDP Rajya Sabha MPs leaving the party shook the entire Telugu states and every minute there is a new development in the New Delhi. While this is happening at one end, BJP is claiming that it did not to any 'Operation Akarsh' on TDP MPs.Reacting on TDP leaders leaving the party, BJP Rajya Sabha MP GVL Narasimha Rao said, "We did not do any sort of gimmicks or 'Operation Akarsh' on TDP MPs. In fact, it is Prime Minister Narendra Modi's charisma that is attracting them to walk with BJP. We have seen this trend before the general elections also, so for us it is nothing new. Still, many leaders will come to us in the future and you will see it happening continuously."We hear that the four MPs i.e, CM Ramesh, Sujana Chowdary, TG Venkatesh and Garikapati Rammohan Rao have had an informal meeting Modi and Amit Shah in Delhi and formally gave their consent to join the BJP.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X