వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

కాపు వర్గాన్ని ప్రభావితం చేసే నేతకోసం బీజేపి అన్వేషణ..! కమలం నేతలకు వజ్రాయుధంలా చిరంజీవి..!!

|
Google Oneindia TeluguNews

అమరావతి/హైదరాబాద్ : మెగాస్టార్ చిరంజీవి సైరా నర్సింహారెడ్డి తర్వాత, కొర‌టాల శివ‌ 152వ సినిమాతో బిజీగా ఉన్నారు. కానీ రాజ‌కీయంగా మాత్రం మ‌రోసారి చిరంజీవి భారతీయ జ‌నతా పార్టీలోకి చేర‌తార‌నే ఊహాగానాలు తారాస్థాయిలో వినిపిస్తున్నాయి. ఏపీలో నెల‌కొన్న ప‌రిస్థితుల‌ను త‌మ‌కు అనువుగా మ‌ల‌చుకునేందుకు బీజేపీ పావులు క‌దుపుతోంది. దీనిలో భాగంగానే బ‌ల‌మైన సామాజిక‌వ‌ర్గం, ఓటుబ్యాంకు ఉన్న కాపుల‌ను ఏక‌తాటిపైకి తీసుకువ‌చ్చేందుకు ప్రయ‌త్నిస్తోంది.

ఓటు బ్యాంకుకే ప‌రిమిత‌మైన కాపుల‌తో స‌యోద్యకు రావ‌టం ద్వారా ఒక‌సారి టీడీపీ, రెండోసారి వైసీపీ అధికారంలోకి రాగ‌లిగాయి. అదే స‌మ‌యంలో టీడీపీ బీసీల మ‌ద్దతు కోల్పోయింది. వైసీపీ రెడ్డి వ‌ర్గాన్ని దూరం చేసుకుంటుంద‌నే ఊహాగానాలున్నాయి. కరెక్టుగా ఇదే సమయంలో మంచి ఛరిష్మాతో కాపు కాపు సామాజిక వర్గాన్ని ప్రభావితం చేయగల నేతకోసం బీజేపి అన్వేషిస్తున్నట్టు తెలుస్తోంది. ఆ అన్వేషణలో చిరంజీవి అనే వజ్రాయుధం కమలం నేతల చేతికి తగిలినట్టు తెలుస్తోంది.

 కమలం పార్టీ చూపు చిరు వైపు..! అందనంత దూరంలో మెగాస్టార్..!!

కమలం పార్టీ చూపు చిరు వైపు..! అందనంత దూరంలో మెగాస్టార్..!!

కుల స‌మీక‌ర‌ణ‌లే భ‌విష్యత్‌లో ఏపీ, తెలంగాణాల్లో జ‌యాప‌జ‌యాల‌ను ప్రభావితం చేస్తాయ‌నేది గ‌త ఎన్నిక‌ల్లో అర్ధమైంది. దీనికి బీజేపీ వేసిన ఎత్తుగ‌డ ఏపీలో టీడీపీ, వైసీపీ, జ‌న‌సేన‌ల‌కు దూరంగా ఉండాల‌ని భావిస్తున్న కాపు, క‌మ్మ, రెడ్డి వ‌ర్గాల‌ను ఏక‌తాటిపైకి తీసుకురావ‌టం.. ఇప్పటికే ఏపీ రాష్ట్ర అధ్యక్షుడిగా క‌న్నా ల‌క్ష్మినారాయ‌ణ వ్యవ‌హ‌రిస్తున్నారు. ఆయ‌న రాజ‌కీయ వ్యూహాల‌కు గ్లామ‌ర్, ప్రజాకర్షణ ఉన్న మ‌రొక‌రు జ‌త‌క‌డితే తాము అనుకున్నది తేలిక‌గా సాధించ‌గ‌ల‌మ‌నేది బీజేపీ ఆలోచ‌న‌. ఇటీవ‌ల గోదావ‌రి జిల్లాలో కాపు నేత‌లు స‌మావేశం కావ‌టం.. ఇటీవ‌ల విజ‌య‌వాడ‌లో టీడీపీ అంత‌ర్గత స‌మావేశానికి కాపు నేత‌లు డుమ్మా కొట్టడాన్ని బీజేపీ త‌మ‌కు సానుకూలంగా ములుచుకోవాల‌ని పావులు కదుపుతోంది.

 ఏపిలో బలమైన కాపు వర్గం..! ప్రభావితం చేయగల నేతకోసం బీజేపి వేట..!!

ఏపిలో బలమైన కాపు వర్గం..! ప్రభావితం చేయగల నేతకోసం బీజేపి వేట..!!

కానీ.. ఇది జ‌న‌సేన‌కు అనువైన వాతావ‌ర‌ణ‌మంటూ ప్రచారం సాగుతోంది. తాజాగా వంగవీటి రాధా జ‌న‌సేన‌లోకి చేర‌టాన్ని జ‌న‌సైనికులు కొంత‌మేర మాత్రమే స్వాగ‌తిస్తున్నారు. టీడీపీ, వైసీపీల్లో ఇమ‌డ‌లేక‌.. అవినీతి ముద్రప‌డిన నేత‌ల‌కు జ‌న‌సేన స్వాగ‌తం ప‌లికితే మున్ముందు రాజ‌కీయంగా అవ‌మానం ఎదుర్కోవాల్సి ఉంటుంద‌నే అబిప్రాయం వారి నుంచి వ్యక్తమ‌వుతోంది. అందుకే కేంద్రంలో మోదీ హ‌వా ఉంది. టీడీపీ పై వ్యతిరేక‌త ఉంది. ఇటువంటి స‌మ‌యంలో రాజ‌కీయం స‌రిగ్గా ప్రయోగిస్తే.. ప్రత్యర్థిపై విజ‌యం.. క‌మ‌లం పాగా వేయ‌గ‌లుతుంద‌నేది అమిత్‌షా వ్యూహ‌మ‌ట‌. దీనికి మెగాస్టార్ స‌రైన నాయ‌కుడిగా అదిష్టానం బావిస్తున్నట్టు తెలుస్తోంది.

 చిరుతో మంతనాలు జరిపే దిశగా బీజేపి..!మెగాస్టార్ మనసులో ఏముందో..!!

చిరుతో మంతనాలు జరిపే దిశగా బీజేపి..!మెగాస్టార్ మనసులో ఏముందో..!!

అయితే.. దీనికి మెగాస్టార్ ఎంత‌వ‌ర‌కూ ఆమోదం చెబుతార‌నేది ప్రశ్నార్ధకంగా మారింది. పీఆర్‌పీ ప‌రాజ‌యం.. రాజ‌కీయ చతురత‌.. అక్కడ నెగ్గేందుకు అవ‌స‌ర‌మైన అనుభ‌వంతోపాటు.. అవ‌లక్షణాలు లేక‌పోవ‌టం, నమ్ముకున్న నేతలు పార్టీ కార్యాలయాల్లోనే ప్రెస్ మీట్ లు పెట్టి పార్టీని నిందించడం, చిరంజీవికి లేని అవలక్షణాలను ఆపాదించడవ వంటివి కూడా మెగాస్టార్‌కు రాజ‌కీయాల‌పై అనాస‌క్తత‌ను పెంచాయి. కేంద్రమంత్రిగా ప‌నిచేసిన చిరు త‌న‌కంటూ ఇమేజ్‌ను ఏర్పర‌చుకున్నా ప్రత్యర్థుల ఆరోప‌ణ‌లు ప్రజ‌ల్లోకి వెళ్లాయి. పార్టీను అమ్ముకున్నాడ‌ని, టికెట్లు విక్రయించార‌నే అప‌వాదును మూట‌గ‌ట్టుకున్నాడ‌ు. పైగా ఇప్పుడు జ‌న‌సేన‌తో త‌మ్ముడు ప‌వ‌న్ కూడా బ‌రిలో ఉన్నాడు.

 మెగాస్టార్ మ‌ళ్లీ జెండా ప‌డ‌తారా..! బీజేపి అందుకు రెడ్ కార్పెట్ వేస్తుందా..!!

మెగాస్టార్ మ‌ళ్లీ జెండా ప‌డ‌తారా..! బీజేపి అందుకు రెడ్ కార్పెట్ వేస్తుందా..!!

ఒక‌వేళ మ‌రోసారి రాజకీయ మెగా మైక్ ప‌ట్టుకోవాల్సి వ‌స్తే.. త‌మ్ముడిని కూడా విమ‌ర్శించాల్సి వ‌స్తోంది. పొలిటీషియ‌న్‌గా ఎమోష‌న్‌ను దూరం పెట్టాల్సి ఉంటుంది. ఇటువంటి కీల‌క‌మైన సందిగ్ద స‌మ‌యంలో చిరంజీవి రాజ‌కీయాల్లోకి రాడంటూ అభిమానులు చెబుతున్నారు. ఒక‌వేళ అన్నయ్య వ‌స్తే.. పీఆర్‌పీలో వెన్నంటి నిలిచిన‌ట్టుగానే ఉంటామంటూ ఫ్యాన్స్ తెగేసి చెబుతున్నారు. అన్నీ అనుకూలించి చిరంజీవి రాజకీయ జెండా పట్టుకోవాలన్నా ఇంకా రెండు మూడేళ్ల సమయం పడుతుందనే చర్చ జరుగుతోంది. చేతిలో సినిమాలు పూర్తి చేసిన తర్వాత మెగాస్టార్ భవిశ్యత్ కార్యాచరణ ప్రకటించే అవకాశాలు కనిపిస్తున్నాయి.

English summary
There is speculation that Chiranjeevi will join the Bharatiya Janata Party politically. The BJP is moving to adapt to the conditions in the AP. As part of this, a strong social class is trying to unify the kapu vote bank.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X