వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

తానా స‌భ‌ల్లో రాంమాధ‌వ్‌కు అవ‌మానం: తెలుగు స‌భ‌లా..టీడీపీ స‌మావేశ‌మా: అక్క‌డ ఏం జ‌రిగింది..!

|
Google Oneindia TeluguNews

బీజేపీ సీనియ‌ర్ నేత రాం మాధ‌వ్‌కు అవ‌మానం జ‌రిగింది. తానా ఆహ్వానం మేర‌కు అమెరికా వెళ్లిన రాం మాధ‌వ్ అక్క‌డ ప్ర‌సంగిస్తుండ‌గా కొంద‌రు అడ్డుకొని వేదిక దిగి వెళ్లిపోవాలంటూ నినాదాలు చేసారు. దీంతో..ఆయ‌న అర్దాంతంగా వేదిక దిగేసి వెళ్లిపోయారు. తానా మ‌హాస‌భ‌ల‌కు సాధారంగా బీజేపీ నేత‌ల‌ను ఆహ్వానించరు. అయితే ఈ సారి తెలుగు వ్య‌క్తిగా జాతీయ రాజ‌కీయాల్లో కీల‌క పాత్ర పోషిస్తున్న రాం మాధ‌వ్‌ను సైతం తానా స‌భ‌ల‌కు ఆహ్వానించారు. దీంతో.. హాజ‌రైన అక్క‌డ ప్ర‌ధాని గురించి మాట్లాడుతున్న స‌మ‌యంలో ఈ ప‌రిణామం చోటు చేసుకుంది. నిర‌స‌న తెలిపే వారిని నిర్వ‌హ‌కు లు సైతం నియంత్రించే ప్ర‌య‌త్నం చేయ‌క‌పోవ‌టంతో ఇది అవ‌మానంగానే ప్ర‌చారం జ‌రుగుతోంది.

రాం మాధ‌వ్ వేదిక దిగి వెళ్లాలంటూ..

రాం మాధ‌వ్ వేదిక దిగి వెళ్లాలంటూ..

తానా సంఘం ఆహ్వానం మేర‌కు వాషింగ్ట‌న్‌లో జ‌రిగిన స‌భ‌ల‌కు బీజేపీ ముఖ్య నేత రాం మాధ‌వ్ హాజ‌ర‌య్యారు. తానా స‌భ్యుల నుండి ఆహ్వానం గ‌తంలో ఎప్పుడూ రాజ‌కీయ పార్టీ నేత‌ల్లో టీడీపీకి మిన‌హా మిగిలిన పార్టీ నేత‌ల్లో చాలా త‌క్కువ మందికి మాత్ర‌మే అందేది. ఇక‌, ఇప్ప‌డు తెలుగు ప్ర‌ముఖుడిగా రాం మాధ‌వ్‌కు ఆహ్వానం వ‌చ్చింది. దీంతో,, ఆయ‌న స‌భ‌ల‌కు హాజ‌ర‌య్యారు. అందులో భాగంగా త‌న ప్ర‌సంగంలో తెలుగు వారంద‌రూ ఎక్క‌డ ఉన్నా ఐక్యంగా ఉండాలంటూ పిలుపు నిచ్చారు. ఆ త‌రువాత ప్ర‌ధాని మోదీ గురించి మాట్లాడుతూ ఆయ‌న హాయంలో దేశంలో జ‌రుగు తున్న అభివృద్దిని వివ‌రించారు. అంత‌ర్జాతీయ స్థాయిలో భార‌త దేశ ఖ్యాతి మోదీ కార‌ణంగా పెరిగిందంటూ రాం మాధ‌వ్ చెబుతున్న స‌మ‌యంలోనే కొంద‌రు అడ్డు త‌గిలారు. నిర‌స‌న వ్య‌క్తం చేసారు. కేకలు వేస్తూ.. రాంమాధవ్‌ వేదిక మీద నుంచి దిగిపోవాలంటూ నినాదాలు చేశారు. దీంతో ఆయన తన ప్రసంగాన్ని అర్ధంతరంగా ముగించి వెను దిరిగారు. ఆ స‌మ‌యంలో నిర్వాహ‌కులు సైతం చేతులెత్తేసారని స‌మాచారం.

టీడీపీ మీద అభిమానంతోనే ఇలా..

టీడీపీ మీద అభిమానంతోనే ఇలా..

తానా నిర్వ‌హ‌కుల మీద ఒక అభిప్రాయం ఎప్ప‌టి నుండో ఉంది. ఒక సామాజిక వ‌ర్గ ఆధిపత్యం అందులో ఎక్కువ‌గా ఉంటుంద‌ని చెబుతారు. అదే విధంగా తానా ప్ర‌తినిధులు ఎక్కువ మంది టీడీపీ తో సంబంధాలు ఉన్నవారే. ఏపీలో ఎన్నిక‌ల స‌మ‌యంలో వారు టీడీపీ ఆర్దికంగా స‌హ‌కారం అందిచ‌టంతో పాటుగా పార్టీ గెలుపు కోసం కృషి చేస్తారు. ఇక‌, తానా స‌భ‌ల్లో ప్ర‌తీ సారి ఎక్కువ‌గా టీడీపీ నేత‌లే క‌నిపిస్తారు. కానీ, ఈ సారి పార్టీ అధికారం కోల్పోవ‌టంతో వారి సంఖ్య త‌క్కువ‌గా ఉంది. తాజాగా టీడీపీ నుండి బీజేపీలో చేరిన సీఎం రమేష్..మాజీ మంత్రి గంటా శ్రీనివాస్ లాంటి వారు మాత్ర‌మే ఇక్క‌డ క‌నిపించారు. ఇక‌, త‌మ సంఘం మీద ఉన్న అపోహ‌లు పోగొట్లుకోవాల‌నే ఉద్దేశంతో ఈ సారి తానా నేత‌లు జ‌న‌సేన అధినేత ప‌వన్ క‌ళ్యాణ్‌.. బిజేపీ నేత రాం మాధవ్‌ను పిలిచారు. వారివురూ హాజ‌ర‌య్యారు. అయితే, ప‌వ‌న్ మాట్లాడిన స‌మ‌యంలో ఎటువంటి అభ్యంత‌రాలు వ్య‌క్తం కాలేదు. కానీ, రాం మాధ‌వ్ ప్ర‌ధాని పేరెత్తే స‌రికి అక్క‌డ హాజ‌రైన వారికి ఆగ్ర‌హం తెప్పించింది. అయితే వారంతా టీడీపీ అభిమానులుగా చెబుతున్నారు.

 ప్ర‌వాసాంధ్రులు ఇలా చేయ‌టం పైనే..

ప్ర‌వాసాంధ్రులు ఇలా చేయ‌టం పైనే..

ఒకే దేశం.. ఒకే ప్రాంతం..ఒకే భాష ఇలా అన్ని ర‌కాలుగా క‌లిసి మెలిసి స‌భ‌లు నిర్వ‌హించుకుంటున్న స‌మ‌యంలో ఇలా ప్ర‌ధాని పేరు ఎత్త‌గానే విదేశాల్లో సైతం నిర‌స‌న‌కు దిగ‌టం టీడీపీ లైన్‌లో న‌డ‌వ‌ట‌మే అనే అభిప్రాయం బ‌లంగా వినిపిస్తోంది. ప్ర‌తీ సారి టీడీపీని అభినందించే వారే త‌మ సమావేశాల‌కు రావాల‌ని భావిస్తే ఇలా పిలిచి అవ‌మానించ టం స‌రి కాద‌నే అభిప్రాయం వ్య‌క్తం అవుతోంది. మోదీ మీద ఆగ్ర‌హం ఉన్నా..విదేశాల్లో జ‌రుగుతున్న స‌మావేశాలు జ‌రుగుతున్న స‌మ‌యంలో నిగ్ర‌హం పాటించ‌కుండా ఇలా వ్య‌వ‌హ‌రించ‌టం పైన విమ‌ర్శ‌లు వెల్లు వెత్తుతున్నాయి. క‌నీసం నిర్వ‌హ‌కులైన వారిని వారించే ప్ర‌య‌త్నం చేసి ఉండాల్సిందనే అభిప్రాయం వ్య‌క్తం అవుతోంది. ఇప్పుడు జాతీయ స్థాయిలో ఈ వ్య‌వ‌హారం చ‌ర్చ‌నీయాంశంగా మారుతోంది.

English summary
BJP Senior leader Ram Madhav insulted by some of the people who attended for TANA celebrations. At the time of Ram madhav speaking about Prime Minister Modi they given slogans against him.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X