వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

జగన్‌కు బీజేపీ భారీ షాక్ -ఏపీ ఆర్థిక పరిస్థితిపై కేంద్రానికి ఎంపీ సురేశ్ ప్రభు ఫిర్యాదు -సంచలన లేఖలు

|
Google Oneindia TeluguNews

ఎన్డీఏ మిత్రులు సైతం పక్కకు తప్పుకున్నా, తానున్నానంటూ కేంద్ర సర్కారుకు అన్ని విధాలుగా మద్దతు పలుకుతోన్న ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ కు బీజేపీ భారీ షాకిచ్చింది. ఆంధ్రప్రదేశ్ నుంచి ప్రాతినిధ్యం వహిస్తోన్న బీజేపీ ఎంపీ(రాజ్యసభ) సురేశ్ ప్రభు.. రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇప్పటికే అటు ఇటుగా ఉన్న ఏపీ ఆర్థిక పరిస్థితి.. జగన్ తాజా నిర్ణయాలతో మరింతగా దిగజారే ప్రమాదం ఏర్పడిందని, ఈ వ్యవహారంపై కేంద్రం వెంటనే జోక్యం చేసుకోవాలని సురేశ్ ప్రభు కోరారు.

జగన్ గాడిదలు కాస్తున్నాడా? కేంద్రాన్ని ఒప్పించాడా? -పోలవరం ఘనత వైఎస్సార్‌దికాదు: చంద్రబాబుజగన్ గాడిదలు కాస్తున్నాడా? కేంద్రాన్ని ఒప్పించాడా? -పోలవరం ఘనత వైఎస్సార్‌దికాదు: చంద్రబాబు

నిర్మల, గోయల్‌కు లేఖలు..

నిర్మల, గోయల్‌కు లేఖలు..

జగన్ ప్రభుత్వం ఏపీలో ఆర్థిక పరిస్థితి ఆందోళనకరంగా మారిందని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌కు, వాణిజ్య శాఖ మంత్రి పీయూష్ గోయెల్‌కు బీజేపీ ఎంపీ సురేష్ ప్రభు బుధవారం లేఖలు రాశారు. ఇటీవల 56 కులాలకు ప్రత్యేక కార్పొరేషన్లు ఏర్పాటు చేసిన జగన్.. వాటి నిధులను సంక్షేమ పథకాలకు మళ్లిస్తున్నారని, ఎఫ్‌ఆర్‌బీఎం పరిధిని దాటిమరీ సంక్షేమ పథకాల కోసం ఏపీ ప్రభుత్వం అప్పులు చేస్తోందని సురేశ్ ప్రభు లేఖలో పేర్కొన్నారు. ఆంధ్రప్రదేశ్ చాంబర్స్ ఆఫ్ కామర్స్, ఇండస్ట్రీస్ డైరెక్టర్ నరేష్ కుమార్ నుంచి తనకు ఓ లేఖ తనకు వచ్చిందని, అందులోని విషయాలు నిజమని తెలిసిన తర్వాతే కేంద్రానికి లేఖ రాస్తున్నానని ఆయన చెప్పుకొచ్చారు.

బిల్లు పాసైన రోజే ఇలా..

బిల్లు పాసైన రోజే ఇలా..

2005 నాటి ఎఫ్‌ఆర్‌బీఎం చట్టంలో సవరణలు చేసే బిల్లుకు మంగళవారం అసెంబ్లీ ఆమోదం తెలిపిన కొద్ది గంటలకే బీజేపీ ఎంపీ సురేశ్ ప్రభు కేంద్రానికి లేఖ రాయడం సంచలనం రేపుతున్నది. కరోనా పరిస్థితుల నేపథ్యంలో ఎఫ్‌ఆర్‌బీఎం పరిమితులపై రాష్ట్రాలకు సడలింపు లభించడంతో.. ఇప్పటివరకూ ఉన్న 3 శాతం అప్పుల పరిమితిని 5శాతానికి పెంచుతూ ఏపీ ప్రభుత్వం చట్టంలో సవరణలు చేసింది. బిల్లు పాసైన రోజే బీజేపీ మెలిక లేఖలు రాయడం సర్వత్రా చర్చనీయాంశమైంది. అంతేకాక..

Recommended Video

Rowdy Baby Hits 1 Billion Views, Dhanush, Sai Pallavi Tweets | Oneindia Telugu
మోదీకి అత్యంత నమ్మకస్తుడే ఇలా..

మోదీకి అత్యంత నమ్మకస్తుడే ఇలా..

ఏపీ నుంచి రాజ్యసభకు ప్రాతినిధ్యం వహిస్తోన్న బీజేపీ ఎంపీ సురేశ్ ప్రభుకు ప్రధాని నరేంద్ర మోదీకి అత్యంత నమ్మకస్తుడనే పేరుంది. తొతుత శివసేనకు చెందిన సురేశ్ ను కేంద్ర కేబినెట్ లోకి తీసుకునే విషయంలో ఉద్ధవ్ తో విభేధాలు వచ్చినా, ఆయనను బీజేపీలోకి చేర్చుకుని మరీ మోదీ పదవి ఇచ్చారు. 2019 ఎన్నికల తర్వాత సమీకారణాలు మారడంతో సురేశ్ ప్రభును కేబినెట్ లోకి తీసుకోనప్పటికీ.. ప్రపంచ వేదికలైన జీ 7, జీ 20 గ్రూప్స్‌లో భారత్ కు ప్రతినిధిగా సురేష్ ప్రభును ప్రధాని మోదీ నియమించారు. మోదీ-ప్రభుల సాన్నిహిత్యం నేపథ్యంలో జగన్ సర్కారుకు వ్యతిరేకంగా కేంద్ర మంత్రులకు లేఖలు రాయడం సంచలనంగా మారింది. చివరిసారిగా సురేశ్ ప్రభు సతీసమేతంగా అమరావతిలోని జగన్ ఇంటికి వచ్చి భోజనం చేశారు. తాజా లేఖ వ్యవహారంపై వైసీపీ నేతలు స్పందించాల్సి ఉంది.

English summary
in an unprecedented move, bjp mp suresh prabhu alleges that andhra pradesh financial status is in danger. in a letter to union finance minister nirmala sitaraman on wednesday, mp urged center to take action against ap cm ys jagan. suresh prabhu also write to minister piyush goyal
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X