• search
  • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

చిరంజీవితో ట‌చ్‌లో జాతీయ నేత‌లు : బీజేపీలోకి మాజీ సీఎం కిర‌ణ్‌: కేంద్ర మంత్రి ప‌ద‌వి ద‌క్కేదెవ‌రికి

|

మెగాస్టార్ చిరంజీవి బీజేపీ జాతీయ నేత‌ల‌తో ట‌చ్‌లో ఉన్నారు. ఆయ‌న్ను ఎలాగైనా ఒప్పించేందుకు క‌మ‌ల నాధులు ప్ర‌య‌త్నాలు చేస్తూనే ఉన్నారా. ప‌రోక్షంగా అవున‌నే సంకేతాలు ఇస్తారు బీజేపీ నేత‌లు. అదే స‌మ‌యంలో మాజీ సీఎం కిర‌ణ్ కుమార్ రెడ్డి బీజేపీలో చేర‌టం దాదాపు ఖాయ‌మ‌ని తెలుస్తోంది. మ‌రి కొంత మంది ముఖ్య‌నేత‌లను సైతం బీజేపీ లోకి తీసుకెళ్లే ప్ర‌య‌త్నాల‌ను వేగ‌వంతం చేసారు. త్వ‌ర‌లోనే ఏపీకీ కేంద్ర మంత్రి ప‌ద‌వి ద‌క్కుతుంద‌ని చెబుతున్నారు. దీంతో..ఎవ‌రికి ద‌క్కుతుంద‌నేది ఇప్పుడు చ‌ర్చ మొద‌లైంది. సామాజిక వ‌ర్గాల ఆధారంగా రాజ‌కీయం జరిగే ఏపీలో ఏ వ‌ర్గానికి మంత్రి ప‌ద‌వి ఇస్తార‌నేది ఇప్పుడు హాట్ టాపిక్.

చిరంజీవితో ట‌చ్‌లో బీజేపీ అగ్ర‌నేత‌లు..!

చిరంజీవితో ట‌చ్‌లో బీజేపీ అగ్ర‌నేత‌లు..!

కొద్ది కాలంగా చిరంజీవి బీజేపీలో చేరుతార‌నే ప్ర‌చారం జ‌రుగుతూనే ఉంది. ఒక సంద‌ర్భంలో చిరంజీవి దీనిని ఖండించా రు. అయినా..బీజేపీ నేత‌లు మాత్రం చిరంజీవిని వ‌ద‌ల‌టం లేదు. త‌మ వంతు ప్ర‌య‌త్నాలు కొన‌సాగిస్తూనే ఉన్నారు. ఈ క్ర‌మంలోనే బీజేపీ ఎమ్మెల్సీ మాధ‌వ్ కీల‌క వ్యాఖ్య‌లు చేసారు. బీజేపీ అగ్ర నేత‌లు చిరంజీవితో ట‌చ్‌లో ఉన్నారేమో అం టూ ప‌రోక్షంగా బీజేపీ చేస్తున్న ప్ర‌య‌త్నాల‌ను బ‌య‌ట పెట్టారు. ఏపీలో టీడీపీ ప‌రాజ‌యం త‌రువాత త‌మ‌కు రాజ‌కీయంగా అవకాశం ఉంద‌ని భావిస్తున్న బీజేపీ..ఇప్పుడు స‌రైన జ‌నాక‌ర్ష‌ణ క‌లిగిన నేతకు ఏపీ బాధ్య‌త‌లు అప్ప‌గిస్తే..తాము మ‌రింత సులువుగా బ‌ల ప‌డ‌తామ‌నే సంకేతాలు ఇస్తున్నారు. దీని కోసం కొంత కాలంగా చిరంజీవితో రాయ‌బారాలు సాగిస్తున్నారు. కానీ., ప్ర‌జారాజ్యం ఆ త‌రువాత కాంగ్రెస్‌లో జ‌రిగిన ప‌రిణామాల‌తో కాంగ్రెస్‌లోనే ఉంటున్నా..రాజ‌కీయల‌కు పూర్తిగా దూర మ‌య్యారు. సినిమాల మీదే దృష్టి సారించారు. ఇక‌, ఇప్పుడు మాధ‌వ్ చేసిన వ్యాఖ్య‌ల‌తో చిరంజీవిని ఎలాగైనా ఒప్పించే విధంగా బీజేపీ అగ్ర నేత‌లు ప్ర‌య‌త్నాలు చేస్తున్న‌ట్లుగా స్ప‌ష్టం అవుతోంది.

కిర‌ణ్ ఎంట్రీ ఖార‌రైన‌ట్లేనా..

కిర‌ణ్ ఎంట్రీ ఖార‌రైన‌ట్లేనా..

మాజీ ముఖ్య‌మంత్రి కిరణ్ కుమార్ రెడ్డి బీజేపీలో చేర‌టం ఖాయ‌మైంద‌ని ఆ పార్టీ రాష్ట్ర నేత‌లు చెబుతున్నారు. 2014 లో రాష్ట్ర విభ‌జ‌న స‌మ‌యంలో స‌మైక్య వాది ఛాంపియ‌న్‌గా అవ‌తరించేందుకు కిర‌ణ్ విశ్వ ప్ర‌య‌త్నాలు చేసారు. తా ను చివ‌రి బాల్‌తో రాష్ట్ర విభ‌జ‌న అపుతానంటూ ఊద‌ర‌గొట్టారు. కానీ, విభ‌జ‌న పూర్త‌యింది. కిర‌ణ్ కాంగ్రెస్‌ను వీడారు. ఆ స‌మ‌యంలో స‌మైక్యాంధ్ర పార్టీని స్థాపించి..2014 ఎన్నిక‌ల్లో ప‌రోక్షంగా టీడీపీకి స‌హ‌క‌రించారు. అప్ప‌టి నుండి మౌనంగా ఉంటున్న కిర‌న్ గ‌త ఏడాది రాహుల్ స‌మ‌క్షంలో తిరిగి కాంగ్రెస్‌లో చేరారు. అయితే, ఆ స‌మ‌యంలో రాష్ట్ర కాంగ్రెస్ నేతల నుండి వ‌చ్చిన స‌హాయ నిరాక‌ర‌ణ‌..అంత‌ర్గ‌తంగా విభేదించ‌టంతో ఎన్నిక‌ల స‌మ‌యంలోనూ రాజ‌కీయాల‌కు దూరంగా ఉన్నారు. ఆయ‌న సోద‌రుడు కిషోర్ టీడీపీలో చేరి పీలేరు నుండి పోటీ చేసి ఓడిపోయారు. కాంగ్రెస్‌లో రీ ఎం ట్రీకి ముందు కిర‌ణ్ బీజేపీలో చేరుతార‌నే ప్ర‌చారం సాగినా..ఆయ‌న కాంగ్రెస్ వైపే మొగ్గు చూపారు. ఇప్పుడు మాత్రం కిర‌ణ్ బీజేపీలో చేరుతున్నార‌ని రాష్ట్ర నేత‌లు గ‌ట్టిగా చెబుతున్నారు. అందుకు మూహూర్తం సైతం చెప్పేస్తున్నారు. మ‌రి..కిర‌ణ్ దీని పైన ఎలా స్పందిస్తారో చూడాలి.

మంత్రి ప‌ద‌వి ద‌క్కేదెవ‌రికి..

మంత్రి ప‌ద‌వి ద‌క్కేదెవ‌రికి..

కేంద్ర ప్ర‌భుత్వంలో ఏపీ నుండి ఎవ‌రికీ మంత్రి ప‌ద‌వి లేదు. ఏపీ నుండి బీజేపీ ఎంపీలు ఎవ‌రూ గెల‌వ‌క‌పోవ‌టం.. ఏపీ లో ఏ పార్టీతోనూ పొత్తు లేక‌పోవ‌టంతో ఎవ‌రికీ మంత్రి ప‌ద‌వి ద‌క్క‌లేదు. అయితే, భ‌విష్య‌త్‌లో తాము ఏపీలో ఎద‌గాల‌నే ఉత్సుక‌త‌తో ఉన్న బీజేపీ ఏపీకి కేంద్ర మంత్రి ప‌ద‌వి ఇవ్వాల‌ని భావిస్తోంది. ప్ర‌స్తుతం బీజేపీ రాష్ట్ర అధ్య‌క్షుడిగా ఉన్న క‌న్నాకు రాజ్య‌స‌భ ఎంపీగా అవ‌కాశం ఇచ్చి ఆయ‌న‌ను కేంద్ర మంత్రిని చేస్తార‌నే ప్ర‌చారం సాగుతోంది. అయితే, ఏపీలో సామాజిక స‌మీక‌ర‌ణాల‌ను దృష్టిలో పెట్టుకొని నిర్ణ‌యాలు తీసుకోవాల్సి ఉండ‌టంతో..బీసీ వ‌ర్గానికి చెందిన నేత‌కు ఏపీ నుండి కేంద్ర ప్ర‌భుత్వంలో మంత్రిగా చేస్తార‌నేది మ‌రో వాద‌న‌. ఈ ప‌రిస్థితుల్లో కొత్త‌గా బీజేపీలో చేరే వారు..లేదా బీసీ వ‌ర్గాల‌కు ప్రాతినిధ్యం వ‌హిస్త‌న్న ఓ కీల‌క నేత పేరు ప్ర‌చారంలో ఉంది. అదే స‌మ‌యంలో కాపు వ‌ర్గానికే మంత్రి ప‌ద‌వి ఇవ్వాల‌ని..దీని ద్వారా టీడీపీ..వైసీపీకి వ్య‌తిరేకం వ‌ర్గాల‌ను త‌మ వైపు తిప్పుకోవ‌టం సులువుగా ఉంటుందంటూ బీజేపీ నేత‌లు విశ్లేషిస్తున్నారు.

English summary
BJP Strategically moving their political steps in AP. BJP leaders seriously concentrated on new joining's in Party. Special focus on Chiranjeevi..Kiran Kumar Reddy.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X