వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

'ఇక సమరమే?: మనల్నే విలన్ చేస్తాడా?.. బాబు 'కొమ్ములు విరిచేద్దాం', ఇదీ వ్యూహం..

|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో మునుపెన్నడూ లేనంత గందరగోళ పరిస్థితి నెలకొంది. ఇచ్చామని కేంద్రం.. ఇవ్వలేదని రాష్ట్ర ప్రభుత్వం.. ఒకరిపై ఒకరు దుమ్మెత్తి పోసుకుంటున్నారు. తెగదెంపులకైనా సిద్దమేనన్న సంకేతాలు ఓవైపు.. సామరస్యంగా పరిష్కరించుకుందామన్న మాటలు మరోవైపు.. ఈ రెండు పార్టీల మధ్యలో ప్రజలు మాత్రం కచ్చితంగా నలిగిపోతున్నారనే చెప్పాలి.

Recommended Video

BJP Ready To End Alliance With TDP

ఇదంతా పక్కనపెడితే, మొత్తం వ్యవహారంలో కేవలం బీజేపీ వల్లే ఏపీ తీవ్రంగా నష్టపోయిందంటూ టీడీపీ ఆరోపిస్తున్న సంగతి తెలిసిందే. అటు ప్రజలు కూడా బీజేపీనే దోషిగా చూసే పరిస్థితి ఏర్పడింది. దీంతో చంద్రబాబుతో ఇంకా సఖ్యత దేనికి?.. తాడో పేడో తేల్చుకోవాల్సిందేనని బీజేపీ నేతలు సైతం అగ్గి మీద గుగ్గిలం అవుతున్నారు.

హోదా లేకపోతేనేమి!.. ఇవన్నీ చేయట్లేదా?, అసలా నిధులేం చేశారో చెప్పండి: సోము వీర్రాజుహోదా లేకపోతేనేమి!.. ఇవన్నీ చేయట్లేదా?, అసలా నిధులేం చేశారో చెప్పండి: సోము వీర్రాజు

ఇంకా చూస్తూ కూర్చుందామా!:

ఇంకా చూస్తూ కూర్చుందామా!:

రాష్ట్రంలో బీజేపీని ఇంతలా బద్నాం చేస్తున్న సీఎం చంద్రబాబుతో ఇంకా కలిసి ప్రయాణించడం అనవసరం అనే రీతిలో పలువురు బీజేపీ నేతలు అసహనం వ్యక్తం చేస్తున్నారు.

ఆదివారం విజయవాడలో బీజేపీ రాష్ట్ర కార్యవర్గ భేటీ అధ్యక్షుడు కె.హరిబాబు నేతృత్వంలో జరిగిన సమావేశంలో చాలామంది నేతలు టీడీపీతో ఇక కలహాల కాపురం వద్దనే నిర్ణయాన్ని వెలిబుచ్చారు. జరగాల్సినంత డ్యామేజ్ జరిగిపోయిందని, ఇంకా చూస్తూ కూర్చుంటే కష్టమని అభిప్రాయపడ్డారు.

ఇదీ లెక్క.. ఇప్పుడు చెప్పండి: ఏపీకి కేంద్రం ఏం చేసిందంటారా?.. పూసగుచ్చినట్టు చెప్పిన హరిబాబుఇదీ లెక్క.. ఇప్పుడు చెప్పండి: ఏపీకి కేంద్రం ఏం చేసిందంటారా?.. పూసగుచ్చినట్టు చెప్పిన హరిబాబు

బాబును ఇలా దెబ్బకొడుతాం.

బాబును ఇలా దెబ్బకొడుతాం.

'చంద్రబాబు&కో'ను టార్గెట్ చేసేందుకు బీజేపీ నేతలు కొన్ని వ్యూహాలు కూడా సిద్దం చేసినట్టు తెలుస్తోంది. పార్టీ సమావేశంలో భాగంగా అధ్యక్షుడు హరిబాబు ముందు ఆ ప్రతిపాదనలు పెట్టారట. నిధులివ్వలేదంటూ కేంద్రంపై గగ్గోలు పెడుతున్న చంద్రబాబు.. ఇచ్చిన నిధుల్లో ఏ జిల్లాకు ఏం చేశారు? అనే లెక్కలు తీయనున్నారట.

ఏ జిల్లాకైతే కనీస నిధుల్ని వెచ్చించలేదో.. అక్కడి నుంచే చంద్రబాబుపై ఎదురుదాడి మొదలుపెట్టాలని హరిబాబుతో చెప్పారట. ఇప్పటికైనా చంద్రబాబు 'కొమ్ములు విరిచే' ప్రయత్నం చేయకపోతే పార్టీ మరింత అగాథంలో కూరుకుపోతుందని అన్నారట.

బాబు మనల్ని విలన్‌ను చేశాడు..:

బాబు మనల్ని విలన్‌ను చేశాడు..:

చంద్రబాబును నియంత్రించే ప్రయత్నం చేయకపోవడం వల్లే ఇప్పుడిలా బీజేపీ నెత్తిన ఎక్కి కూర్చున్నాడని లక్ష్మీపతి రాజా లాంటి నేతలు తీవ్ర స్థాయిలో మండిపడ్డట్టు తెలుస్తోంది. అంతేకాదు, 'నాలుగేళ్లుగా నిద్రపోతున్నారా? చంద్రబాబును అప్పుడు అదుపు చేసి ఉండాల్సింది.. కేంద్ర బడ్జెట్‌ తర్వాత ప్రజల్లో బీజేపీని ఆయన విలన్‌ను చేశారు' అని ఆగ్రహం వ్యక్తం చేశారట.

ఇంత మంటపెడితే..కూల్‌గా ఎలా? :

ఇంత మంటపెడితే..కూల్‌గా ఎలా? :

రాష్ట్రంలో పార్టీని దెబ్బతీసేలా చంద్రబాబు చాలా నష్టం చేశారని, ఇకనైనా ఎదురుదాడి వ్యూహాన్ని మొదలుపెట్టకపోతే చాలా నష్టపోతామని బీజేపీ నేతల్లో చాలామంది హరిబాబును కోరారట. హరిబాబు మాత్రం మన పార్టీ క్రమశిక్షణకు మారుపేరు అని, వాళ్లపై దాడి కన్నా మనమేం చేశామో చెబుదామని సున్నితంగా చెప్పారట.

ఓవైపు టీడీపీ అంత మంటపెడుతుంటే.. ఏమాత్రం సెగ తగలనట్టు ఇంత కూల్‌గా ఎలా మాట్లాడగలుతున్నారని హరిబాబు సైతం వారు విసుక్కున్నట్టు గుసగుసలు వినిపిస్తున్నాయి.

English summary
BJP is readying to fight with CM Chandrababu Naidu over central fund allocations. They made a plan to target AP's CM.ఓవైపు టీడీపీ అంత మంటపెడుతుంటే..
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X