అమరావతి వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

చంద్రబాబుకు బీజేపీ బంపర్‌ సలహా - మంచి ఛాన్స్‌ మిస్‌ కావొద్దంటూ విష్ణు ట్వీట్‌

|
Google Oneindia TeluguNews

ఏపీలో టీడీపీ హయాంలో చోటు చేసుకున్న అమరావతి భూముల దందాపై ఏసీబీ, సీఐడీ, ఈడీ దర్యాప్తు సాగుతోంది. ఇప్పుడు తాజాగా ప్రభుత్వం సీబీఐ విచారణ కూడా కోరుతోంది. అమరావతిలో విపక్ష టీడీపీ అధినేత చంద్రబాబు తాను సీఎంగా ఉండగా.. తన అనుయాయులకు భూములు కట్టబెట్టారని వైసీపీ ఎప్పటినుంచో ఆరోపిస్తోంది. ఈ నేపథ్యంలో ఈ కేసును సీబీఐకి అప్పగిస్తేనే మంచిదని మరో విపక్షం బీజేపీ అభిప్రాయపడుతోంది.

త్వరలో అమరావతిపై సంచలనాలు- టీడీపీ సీబీఐ విచారణ కోరాలి- అంబటి వ్యాఖ్యలుత్వరలో అమరావతిపై సంచలనాలు- టీడీపీ సీబీఐ విచారణ కోరాలి- అంబటి వ్యాఖ్యలు

అయితే ఈ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు తనంతట తానే సీబీఐ విచారణ కోరాలని బీజేపీ సూచించింది. చంద్రబాబు నాయుడు గారికి ఇది చక్కటి అవకాశం అని ఏపీ బీజేపీ ఉపాధ్యక్షుడు విష్ణువర్ధన్‌ రెడ్డి ట్వీట్‌ చేశారు. అమరావతి ఇన్‌సైడర్‌ ట్రేడింగ్‌లో చంద్రబాబుకు సంబంధం లేకపోతే స్వచ్ఛందంగా సీబీఐ విచారణ కోరితే బావుంటుందని ఆయన ట్వీట్‌లో పేర్కొన్నారు. ఈ కేసులో సీబీఐ విచారణ జరిగితే చంద్రబాబు కడిగిన ముత్యంలా బయటపడొచ్చని, ప్రజల్లో చంద్రబాబు మీద ఉన్న అనుమానాలు కూడా తొలగిపోతాయని విష్ణు సలహా ఇచ్చారు.

bjp suggests naidu to seek cbi inquiry on amaravati lands if he was not guilty

ఇప్పటికే అమరావతి భూసేకరణలో ఇన్‌సైడర్‌ ట్రేడింగ్ జరిగిందన్న వైసీపీ ఆరోపణలపై టీడీపీ మండిపడుతోంది. ఏడాదిన్నరగా ప్రభుత్వం అమరావతిలో ఇన్‌సైడర్‌ ట్రేడింగ్‌ను నిరూపించలేకపోయిందని టీడీపీ నేతలు ఆరోపిస్తున్నారు. ప్రభుత్వం ప్రజా సమస్యలను పక్కదారి పట్టించేందుకే మరోసారి ఈ వ్యవహారాన్ని తెరపైకి తెస్తోందని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇలాంటి తరుణంలో తోటి విపక్ష పార్టీ బీజేపీ కూడా చంద్రబాబు స్వచ్చందంగా సీబీఐ విచారణ కోరాలని సలహా ఇవ్వడంపై టీడీపీ నేతలు మండిపడుతున్నారు.

Recommended Video

Rains In AP : AP లో భారీ వర్షాలు.. మరో 3 రోజులు ఇంతే ! || Oneindia Telugu

English summary
andhra pradesh bjp vice president vishnu vardhan reddy suggests opposition leader chandrababu naidu to seek cbi inquiry voluntarily if he had not guilty in this issue.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X