• search
 • Live TV
అమరావతి వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  

వైసీపీ 41- టీడీపీ 52- 2019 రిపీట్- కేంద్రం జోక్యం చేసుకుంటుందా ?

|

ఏపీలో 2019 ముందు నాటి పరిస్ధితులు రిపీటయ్యేలా కనిపిస్తున్నాయి. గతంలో కేంద్ర ప్రభుత్వం నుంచి టీడీపీ తప్పుకున్నాక... చంద్రబాబు సర్కార్ ను వైసీపీ, బీజేపీ కలిసి టీడీపీని టార్గెట్ చేసేవి. ఇప్పుడు అదే బీజేపీ, టీడీపీతో కలిసి వైసీపీ ప్రభుత్వాన్ని టార్గెట్ చేస్తోంది. అప్పటికీ, ఇప్పటికీ సమస్య మాత్రం మారలేదు. దీంతో బీజేపీ ఇద్దరినీ కలిపి టార్గెట్ చేసే పనిలో పడింది. చివరికి కేంద్రం జోక్యం కూడా కోరబోతోంది. అదే జరిగితే చంద్రబాబు హయాం నాటి పరిస్ధితుల్ని జగన్ కూడా ఎదుర్కోవాల్సి వస్తుందా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.

 చంద్రబాబు హయాంలో...

చంద్రబాబు హయాంలో...

గతంలో ఏపీలో టీడీపీ ప్రభుత్వంతో కొన్నాళ్లు సవ్యంగానే సాగిన బీజేపీ బంధం ప్రత్యేక హోదాపై వైసీపీ పోరుతో తెగిపోయింది. ఆ తర్వాత కేంద్రం నుంచి తప్పుకున్న టీడీపీ, ఆ తర్వాత ఎన్డీయేకు కూడా గుడ్ బై చెప్పేసింది.. అంతటితో ఆగకుండా ఎన్డీయే సర్కార్ పై ధర్మపోరాటానికి దిగింది. దీంతో టీడీపీని కౌంటర్ చేసేందుకు బీజేపీ నేతలు చంద్రబాబు ప్రభుత్వ విధానాలతో పాటు అప్పట్లో జరిగిన ఓ కీలక వ్యవహారాన్ని కూడా తెరపైకి తెచ్చారు. దీంతో చంద్రబాబు ప్రభుత్వం తీవ్రంగా ఇరుకునపడింది. మరోవైపు వైసీపీ కూడా జత కలవడంతో బీజేపీ ఆరోపణలు టీడీపీ సర్కార్ ను ఉక్కిరిబిక్కిరి చేశాయి.

జగన్ హయాంలో

జగన్ హయాంలో

విచిత్రంగా జగన్ సర్కార్ అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా అదే సీన్ రిపీట్ అయింది. గత టీడీపీ ప్రభుత్వంలో చేసినంత కాకపోయినా భారీ మొత్తంలోనే ఈ వ్యవహారం సాగింది. దీంతో ఈసారి తొలుత టీడీపీ వైసీపీ సర్కార్ ను టార్గెట్ చేసింది. ఆ తర్వాత బీజేపీ కూడా ఇప్పుడు దాన్ని అందుకుంది. అంతే కాదు గత టీడీపీ సర్కారుతో పాటు ప్రస్తుత వైసీపీ సర్కార్ ను కూడా టార్గెట్ చేస్తూ ఆరోపణలు గుప్పిస్తోంది. దీంతో బీజేపీకి కౌంటర్ ఇవ్వలేక వైసీపీ, టీడీపీ ఇరుకునపడుతున్నాయి. చాలా కాలం తర్వాత ఏపీలో అధికార, విపక్షాల్ని ఒకే అస్త్రంతో టార్గెట్ చేసేందుకు బీజేపీకి కూడా మంచి అవకాశం లభించింది.

టీడీపీ 52-వైసీపీ 41

టీడీపీ 52-వైసీపీ 41

టీడీపీ హయాంలో భారీ ఎత్తున పర్సనల్ డిపాజిట్ (పీడీ) ఖాతాలు తెరిచి అప్పటి చంద్రబాబు ప్రభుత్వం రూ.52 వేల కోట్లను వాటికి మళ్లించి ఖర్చు చేసింది. ఇప్పుడు వైసీపీ ప్రభుత్వం కూడా అదే స్ధాయిలో పీడీ ఖాతాలు తెరిచి రూ.41 వేల కోట్లను ఖర్చు చేసింది. అప్పట్లో పీఏసీ ఈ విషయాన్ని తెరపైకి తీసుకురాగా... బీజేపీ చంద్రబాబు ప్రభుత్వాన్ని టార్గెట్ చేయగా..ఇప్పుడు కూడా పీఏసీ ఛైర్మన్ పయ్యావుల ఈ విషయాన్ని తెరపైకి తెచ్చారు. బీజేపీ మాత్రం ఇద్దరినీ టార్గెట్ చేయడం మొదలుపెట్టేసింది. ఏపీ ఫైనాన్షియల్ కోడ్ కు వ్యతిరేకంగా ఈ వ్యవహారం సాగిందని పయ్యావుల ఆరోపిస్తుండగా.. అప్పట్లో టీడీపీ చేసిందీ అదేనని బీజేపీ నేతలు గుర్తుచేస్తున్నారు.

 2019 సీన్ రిపీట్ అవుతుందా ?

2019 సీన్ రిపీట్ అవుతుందా ?

2019లో అప్పటి టీడీపీ ప్రభుత్వం పెద్ద ఎత్తున పీడీ ఖాతాలు తెరిచి నిధుల్ని మళ్లించిన వ్యవహారం కేంద్రం దృష్టికి వెళ్లింది. అసలే కేంద్రం నుంచి టీడీపీ తప్పుకోవడంతో ఈ మొత్తాల్ని ఉద్దేశపూర్వకంగా మళ్లించడం ద్వారా టీడీపీ సర్కార్ అవినీతికి పాల్పడిందని ప్రధానితో సహా కేంద్రమంత్రులూ ఆరోపించారు. ఇప్పుడు వైసీపీ ప్రభుత్వంలో పీడీ ఖాతాల ద్వారా సాగిన మళ్లింపుల విషయంలోనూ బీజేపీ ఎంపీ జీవీఎల్ నర్సింహారావు టార్గెట్ చేయడం మొదలుపెట్టారు. ఈ విషయాన్ని కేంద్రానికీ ఫిర్యాదు చేసేందుకు సిద్ధమవుతున్నారు. అదే జరిగితే అప్పుడు టీడీపీ తరహాలోనే ఇప్పుడు వైసీపీ ప్రభుత్వం కూడా ఇరుకునపడటం ఖాయంగా కనిపిస్తోంది.

  Weather Update : Two More Days Heavy Rains In AP & Telangana | Oneindia Telugu
   కేంద్రం జోక్యం చేసుకుంటుందా ?

  కేంద్రం జోక్యం చేసుకుంటుందా ?


  గతంలో టీడీపీ ప్రభుత్వ హయాంలో పీడీ ఖాతాలకు భారీ మొత్తాల మళ్లింపు వ్యవహారంపై కేంద్రం దృష్టిపెట్టింది. అయితే చర్యలు తీసుకునేలోపు ఎన్నికలు రావడం టీడీపీ ఘోర పరాజయం పాలవ్వడం చకచకా జరిగిపోయాయి. ఇప్పుడు వైసీపీ ప్రభుత్వంపై అదే ఫిర్యాదు వస్తే కేంద్రం ఏం చేస్తుందనేది ఆసక్తి కరంగా మారింది. అయితే ప్రస్తుతానికి సీఎం జగన్ కేంద్రంలో బీజేపీ పెద్దలతో సత్సంబంధాలు కొనసాగిస్తున్న నేపథ్యంలో ఇప్పటికిప్పుడు ఎలాంటి ఇబ్బందీ ఉండకపోవచ్చని తెలుస్తోంది.

  English summary
  bjp mp gvl narasimharao targets ruling ysrcp and opposition tdp over transfer of huge amounts to pd accounts in andhrapradesh.
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X