వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఇద్దరు వైసీపీ ఎంపీలకు బీజేపీ ట్రాప్!! వైసీపీ అధినాయత్వం అలర్ట్: వారు ఆగినట్లేనా..!!

|
Google Oneindia TeluguNews

బీజేపీ ఏపీలో టీడీపీనే కాదు..వైసీపీని టార్గెట్ చేస్తోంది. ఏపీలో ముఖ్యమంత్రి జగన్ లక్ష్యంగా విమర్శలు చేస్తున్న బీజేపీ నేతలు..ఢిల్లీ కేంద్రంగా కొత్త రాజకీయం చేస్తున్నారు. వైసీపీ నుండి గెలిచిన ఎంపీలు ఇద్దరి తో బీజేపీ నేతలు టచ్ లోకి వెళ్లినట్లు జోరుగా ప్రచారం సాగుతోంది. వైసీపీ నుండి తాజా ఎన్నికల్లో 22 మంది ఎంపీలు గెలిచారు. కేంద్ర ప్రభత్వం సాయం ఏపీకి అవసరమని గుర్తించి..వారితో రాజకీయంగానూ వైసీపీ సఖ్యతగా కొనసాగుతోంది. ఇదే సమయంలో అనేక బిల్లులకు..నిర్ణయాలకు మద్దతు ప్రకటించింది. బీజేపీ నేతలు వైసీపీ ప్రభుత్వం మీద విమర్శలు చేస్తున్నా..వైసీపీ నేతలు రియాక్ట్ అవ్వటం లేదు. ఇక, వైసీపీ నుండి ఎంపీలుగా గెలిచిన ఇద్దరు..జాతీయ స్థాయిలో కాంట్రాక్టులు చేస్తూ ఉంటారు. వారి అవసరాలను గుర్తించిన బీజేపీ ముఖ్య నేతలు వారిని బీజేపీలో చేర్చుకొనే ప్రయత్నాలు చేసారని సమాచారం. ఆ సమాచారం తెలియటంతో వైసీపీ అధినాయకత్వం అలర్ట్ అయింది. వెంటనే జోక్యం చేసుకోవటంతో వారిని నియంత్రించినట్లు చెబుతున్నారు. అయితే..కేంద్రంతో ఉన్న అవసరాల కారణంగా రానున్న రోజుల్లో బీజేపీ వర్సెస్ వైసీపీ రాజకీయాలు మరింత ముదిరే అవకాశం కనిపిస్తోంది.

ఇద్దరు ఎంపీలకు బీజేపీ వల..!!
ఏపీలోని టీడీపీ నుండి రాజ్యసభ సభ్యులను తమ పార్టీలో చేర్చుకున్న బీజేపీ వైసీపీ ఎంపీల మీద ఫోకస్ చేసినట్లు సమాచారం. రాజ్యసభలో మెజార్టీ లేకపోవటంతో కీలక బిల్లుల కోసం ఇతర పార్టీల ఎంపీలను బీజేపీ తమ పార్టీలో చేర్చుకుంటుందని భావించారు. అయితే లోక్ సభలో బీజేపీకీ అవసరం కంటే ఎక్కువ మంది సభ్యుల సంఖ్య ఉంది. అయినా..రాజకీయంగా బలపడేందుకు ఇతర పార్టీల ఎంపీలను తమ చేతిలో ఉంచుకొనేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. టీడీపీ ఎంపీలను సైతం బీజేపీ ట్రాప్ చేసిందనే ప్రచారం సాగింది. అయితే..టీడీపీ లోక్ సభ సభ్యులు మాత్రం పార్టీ వీడలేదు. అదే సమయంలో వైసీపీలోని ఇద్దరు ఎంపీలతో బీజేపీ నేతలు ఢిల్లీ కేంద్రంగా చర్చలు జరిపారని సమాచారం. ఎన్నికల ముందు నాటి అధికార పార్టీ నుండి వైసీపీలో చేరి ఎంపీలుగా గెలిచిన ఆ ఇద్దరూ వ్యాపార ప్రముఖులే. వారితో బీజేపీ నేతలు సంప్రదింపులు చేసిన మాట నిజమేనని..కానీ వారు పార్టీ మారే ఆలోచన లేదని స్పష్టం చేసినట్లు చెబుతున్నారు. కానీ, ఢిల్లీ కేంద్రంగా జరుగుతున్న పరిణామలపై సమాచారం తెలుసుకున్న వైసీపీ అధినాయకత్వం వెంటనే అలర్ట్ అయింది. రంగంలోకి దిగింది. ఇద్దరు ఎంపీలతో సంప్రదింపులు చేయటం పైన ఆరా తీసారు. వ్యాపార పరంగా అధికార పార్టీ నేతలతో సన్నిహితంగా ఉంటే తప్పు లేదని.. దీని కారణంగా పార్టీ మారే అంశం మాత్రం సబబు కాదని విశ్లేషించినట్లు తెలిసింది. ఆ ఇద్దరు సైతం తాము పార్టీ మారే అంశం పైన అసలు చర్చే చేయలేదని చెప్పినట్లు సమాచారం.

BJP trap for two YCP mps who representing from coastal area..MPs denied..

Recommended Video

Telangana People Are In Key Positions At YS Jagan's Government || Oneindia Telugu

బీజేపీ పెద్దలతోనే నేరుగా...
బీజేపీ లో కొందరు అత్యుత్సాహం ప్రదర్శించారని..వారి కారణంగా పార్ట ఎంపీలు ఇబ్బంది పడుతున్నారంటూ వైసీపీలో ముఖ్యనేత ఒకరు నేరుగా బీజేపీ పెద్దలకు వివరంచినట్లు సమాచారం. ఏపీలో కొందరు నేతలు బీజేపీ కాదని వైసీపీలోకి వచ్చే సమయంలోనూ వారిని పార్టీ చేర్చుకోలేదనే విషయాన్ని వైసీపీ నేతలు గుర్తు చేస్తున్నారు. కోస్తా ప్రాంతానికి ఆ ఇద్దరు నేతలు ఆర్దికంగా బలమైన నేతలు కావటంతో వారి ద్వారా.. ఆ రెండు జిల్లాల్లో బలోపేతం కావాలని బీజేపీలో చేరిన కొత్త నేతల సూచనల మేరకే సంప్రదింపులు చేసినట్లు చెబుతున్నారు. పార్టీ నుండి గెలిచిన 22 మంది ఎంపీల్లో ప్రతీ ఒక్కరూ పార్టీ మీద.. ముఖ్యమంత్రి జగన్ మీద అభిమానంతో ఉన్నావారేనని.. ప్రచారం జరుగుతున్నట్లుగా ఎవరూ పార్టీ మారే అవకాశమే లేదని పార్టీ ముఖ్య నేత స్పష్టం చేసారు. అయితే, పార్టీ ఎంపీలు మాత్రం తమతో ఎవరూ బీజేపీ నేతలు మాట్లాడలేదని చెబుతున్నారు. కానీ..ఏపీలో ఎలాగైనా ఇప్పుడున్న రాజకీయ పరిస్థితులను తమకు అనుకూలగా మలచుకోవాలని భావిస్తున్న బీజేపీ అధినాయకత్వం త్వరలో నాలుగు రాష్ట్రాల్లో జరిగే అసెంబ్లీ ఎన్నికల తరువాత పూర్తి స్థాయిలో తెలంగాణ..ఏపీ మీద పోకస్ చేసే అవకాశం కనిపిస్తోంది. దీంతో..ఇప్పుడు వైసీపీ సైతం అప్రమత్తం అయింది. బీజేపీ ఎత్తుగడలను గమనిస్తూనే.. ముందస్తుగానే పావులు కదపాలని భావిస్తోంది. ఇదే సమయంలో రాజకీయాలు ఎలా ఉన్నా..కేంద్రం సాయం ఏపీకి చాలా అవసరమని..కేంద్ర .. రాష్ట్ర ప్రభుత్వాల మధ్య మాత్రం సన్నిహిత సంబంధాలు కొనసాగిస్తామని వైసీపీ ఎంపీలు చెబుతున్నారు. దీంతో..రానున్న రోజుల్లో ఏపీలో రాజకీయ సమీకరణాలు వేగంగా మారే అవకాశం కనిపిస్తోంది.

English summary
BJP trap for two YCP mps who representing from coastal area. But..Mps denied this and said that no Mp ready leave the party. All will be continue in YCP.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X