వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

బీజేపి అందుకు ఒప్పుకుంటేనే ఆ పదవి తీసుకుంటాం..! కేంద్రానికి వైసీపి ప్రతిపాదన..!!

|
Google Oneindia TeluguNews

ఢిల్లీ/అమరావతి : గత టీడిపీ ప్రభుత్వం చేయలేని పని ఇప్పుడు వైసిపి ప్రభుత్వం చేసి చూపబోతోందా..? కేంద్రంలోని బీజేపీ ప్ర‌భుత్వంతో వైసీపీ క‌లిసేందుకు అడుగులు ప‌డుతున్నాయా..? వైసీపీలోని ప‌లువురు నాయ‌కులు చెబుతున్న‌దాన్ని బ‌ట్టి చూస్తే అవున‌నే స‌మాధానం వినిపిస్తోంది. వాస్త‌వానికి కేంద్రంలో బీజేపీ రెండోసారి అధికారంలోకి వ‌చ్చాక వైసీపీ కేంద్రంలో భాగ‌స్వామి అవుతుంద‌న్న చ‌ర్చ మొద‌లైంది. ఇప్ప‌టికే వారిద్ద‌రి మ‌ధ్య ర‌హ‌స్య మైత్రి కొన‌సాగుతోంది. ఏపీలో వైసీపీ అధికారంలోకి రావ‌డం, కేంద్రంలో బీజేపీ అధికారంలోకి రావ‌డంతో ఇద్ద‌రూ క‌లిసి పొత్తు పెట్టుకుని ముందుకు సాగుతార‌న్న ప్ర‌చారం మొద‌లైంది. ఇందుకుగానూ బీజేపీ త‌ర‌ఫున నుంచి వైసీపీకి డిప్యూటీ స్పీక‌ర్ ప‌ద‌విని ఆఫ‌ర్ చేసిన‌ట్లు తెలుస్తోంది.

చంద్రబాబు అడగటమే తప్పా.. ప్రజావేదిక కూల్చితే ఏం లాభం.. చంద్రబాబు అడగటమే తప్పా.. ప్రజావేదిక కూల్చితే ఏం లాభం..

బీజేపీ ముందు వైసీపీ ప్రతేక ప్ర‌తిపాద‌న‌..!అలాగైతే డిప్యూటీస్పీక‌ర్ ప‌ద‌వికి ఒకే అన్న వైసీపి..!!

బీజేపీ ముందు వైసీపీ ప్రతేక ప్ర‌తిపాద‌న‌..!అలాగైతే డిప్యూటీస్పీక‌ర్ ప‌ద‌వికి ఒకే అన్న వైసీపి..!!

జ‌గ‌న్ అధికారంలోకివ‌చ్చాక ఇప్ప‌టికే రెండుసార్లు బీజేపీ అధ్య‌క్షుడు, హోం మంత్రి అమిత్ షాతో చ‌ర్చలు జ‌రిపారు. ఇందులో కేంద్ర ప్ర‌భుత్వంలో చేరేందుకు సిద్ధంగా ఉన్నామ‌ని జ‌గ‌న్ స్ప‌ష్టం చేసి వ‌చ్చారు. అయితే.. త‌మ‌కు కేంద్ర‌మంత్రి ప‌ద‌వులు ఇవ్వాల‌ని జ‌గ‌న్ కోరిన‌ప్ప‌టికీ అమిత్ షా సుముఖ‌త చూప‌లేదు. ప్ర‌స్తుతం కేంద్రంలో బీజేపీకి సంపూర్ణ బ‌లం ఉంది. లోక్ సభ‌లో ఎంపీ సంఖ్యాబ‌లం ప‌రిపూర్ణంగా ఉంది. దీంతో బీజేపీ స‌భ్యుల‌కే మంత్రి ప‌ద‌వులు స‌రిపడా ఇవ్వ‌లేని ప‌రిస్థితి. జేపీ న‌డ్డా, మేన‌కాగాంధీ త‌దిత‌రుల‌కు కూడా ప‌ద‌వులు ఇవ్వ‌కుండా ప‌క్క‌న‌పెట్టారు. దీంతో అమిత్ షా మ‌రో వ్యూహం ఆలోచించి లోక్‌స‌భలో డిప్యూటీ స్పీక‌ర్ ప‌ద‌విని వైసీపీకి వ‌చ్చేందుకు సుముఖ‌త చూపారు.

Recommended Video

జిల్లాల వారీగా గ్రామవాలంటీర్ల ఖాళీలు
పెండిండ్ లో ఉన్న డిప్యూటీ స్పీకర్ పదవి..! వైసిపితో టచ్ లో ఉన్న బీజేపి..!!

పెండిండ్ లో ఉన్న డిప్యూటీ స్పీకర్ పదవి..! వైసిపితో టచ్ లో ఉన్న బీజేపి..!!

ఇప్ప‌టికే స్పీక‌ర్ ప‌ద‌వికి రాజ‌స్థాన్‌కు చెందిన ఓం బిర్లాకు ఇవ్వ‌గా డిప్యూటీ స్పీక‌ర్ ప‌ద‌విని ఇంకా ఎవ‌రికి ఇవ్వ‌లేదు. వైసీపీ ముందుకు వ‌స్తే.. ఆ పార్టీకి ఇచ్చేందుకే పెండింగులో పెట్టార‌న్న ప్ర‌చారం ఉంది. ప్ర‌స్తుతం వైసీపీ 22 మంది ఎంపీల‌తో లోక్‌స‌భ‌లో నాలుగో పెద్ద పార్టీగా ఉంది.లోక్‌స‌భ ప‌రంగా బీజేపీకి మ‌ద్ద‌తు అవ‌స‌రం లేక‌పోయినా.. రాజ్య‌స‌భ‌లో మాత్రం బీజేపీకి అవ‌స‌రం ఉంది. వైసీపీని ద‌గ్గ‌రికి తీస్తే రానున్న రోజుల్లో త‌మ‌కు బిల్లుల ఆమోదంలో మ‌ద్దతు ఉంటుంద‌న్న బీజేపీ భావిస్తోంది. కేంద్ర మంత్రి ప‌ద‌వులు ఇవ్వ‌న‌ప్పుడు డిప్యూటీ స్పీక‌ర్ ప‌ద‌వి తీసుకునేందుకు వైసీపీ స‌రికొత్త ప్ర‌తిపాద‌న‌ను బీజేపీ ముందు ఉంచిన‌ట్లు స‌మాచారం. ఏపీకి చిర‌కాల డిమాండ్ ఉన్న ప్ర‌త్యేక హోదా ఇస్తే డిప్యూటీ స్పీక‌ర్ ప‌ద‌వి తీసుకునేందుకు సిద్ధ‌మ‌ని వైసీపీ రాయ‌బారం పంపిన‌ట్లు తెలుస్తోంది.

తెరమీదకు ప్రత్యేక హోదా..! జగన్ కేంద్రాన్ని ఒప్పిస్తారా..!!

తెరమీదకు ప్రత్యేక హోదా..! జగన్ కేంద్రాన్ని ఒప్పిస్తారా..!!

అవ‌స‌ర‌మైతే బేష‌ర‌తుగా కూడా మ‌ద్ద‌తు ఇస్తామ‌ని కూడా చెప్పిన‌ట్లు తెలుస్తోంది. ప్ర‌త్యేక హోదా ఇస్తే బీజేపీ చెప్పిన‌ట్లుగా డిప్యూటీ స్పీక‌ర్ ప‌ద‌వి తీసుకుని బీజేపీకి రానున్న కాలంలో మ‌ద్ద‌తుగా నిలుస్తామ‌ని వైసీపీఅధినేత జ‌గ‌న్ వర్తమానం పంపార‌ని తెలుస్తోంది. ప్రత్యేక హోదా ఇవ్వ‌ని ప‌క్షంలో ప‌దవి తీసుకునేది లేద‌ని, అవ‌స‌ర‌మైతే బ‌య‌ట నుంచి బిల్లుల విష‌యంలో మ‌ద్ద‌తు ఇవ్వ‌గ‌ల‌మ‌ని చెప్పిన‌ట్లు స‌మాచారం. ఈ విష‌యంపై మ‌రి బీజేపీ ఏ నిర్ణ‌యం తీసుకుంటుంద‌నేది ఆస‌క్తిక‌రంగా మారింది. ఈ మొత్తం వ్య‌వ‌హారాన్ని వైసీపీ పార్ల‌మెంట‌రీ పార్టీ నేత విజ‌య‌సాయిరెడ్డి నడిపిస్తున్నట్లు తెలిసింది.

జగన్ మొండి వైఖరి..! తలచుకుంటే సాధిస్తారంటున్న వైసీపి శ్రేణులు..!!

జగన్ మొండి వైఖరి..! తలచుకుంటే సాధిస్తారంటున్న వైసీపి శ్రేణులు..!!

జ‌గ‌న్ కూడా ప‌లుమార్లు ప్ర‌త్యేక హోదా విష‌యంలో ఆచితూచి స్పందించారు. ప్ర‌స్తుతం బీజేపీకి లోక్‌స‌భ‌లో సంపూర్ణ బ‌లం ఉన్నందున గ‌ట్టిగా అడిగే ప‌రిస్థితి లేద‌ని, కానీ అడ‌గ‌డం మాత్రం ఆప‌న‌ని ఇటీవ‌ల దిల్లీలో విలేక‌రుల స‌మావేశంలో ప్ర‌క‌టించారు. దీనికి త‌గ్గ‌ట్టుగా బీజేపీ నుంచి డిప్యూటీ స్పీక‌ర్ ప‌ద‌వి ఆఫ‌ర్ వ‌చ్చినందున హోదా ఇస్తే ఆ ప‌ద‌వి తీసుకునేందుకు సిద్ధ‌మ‌ని వైసీపీ భావిస్తోంది. డిప్యూటీ స్పీక‌ర్ ప‌ద‌విని ఇస్తే తీసుకునేందుకు మా పార్టీ తీసుకునేందుకు సిద్ధంగా ఉంది. అయితే ప్ర‌త్యేక హోదా ఇచ్చి ఆ ప‌ద‌వి త‌మ‌కు ఇవ్వ‌మ‌ని బీజేపీని అడుగుతున్నాం. ప్ర‌త్యేమ హోదా ప్ర‌జ‌ల మ‌న‌సుల్లో ఉంది. అది ఇస్తే డిప్యూటీ స్పీక‌ర్ ప‌ద‌వి తీసుకునేందుకు ఎలాంటి ఇబ్బంది లేద‌నేది మా అధినేత ఆలోచ‌న‌` అని వైసీపీ సీనియ‌ర్ నాయ‌కుడు ఒక‌రు తెలపడం విశేషం.

English summary
With the rise of the YCP in power in the AP and the BJP in power at the center, there is a rumor that the two will be merging. This is why the Deputy Speaker of the BJP has offered the YCP. at the same time ycp demanding special status for ap, if bjp done it will continue to support the BJP.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X