కర్నూలు వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

బిజెపిని దోషిగా నిలబెట్టి ఎన్నికలకు టిడిపి:కన్నా;అలా చేస్తే టిడిపికి మా మద్దతు:రోజా

By Suvarnaraju
|
Google Oneindia TeluguNews

కర్నూలు:ఎంపి సిఎం రమేష్ దీక్షపై బిజెపి, వైసిపి నేతల విమర్శల పర్వం కొనసాగుతోంది. కడప ఉక్కు పరిశ్రమకు సంబంధించిన సమాచారాన్ని కేంద్రానికి ఇవ్వకుండా రాజ్యసభ సభ్యుడు సీఎం రమేష్‌తో చంద్రబాబు కావాలనే దీక్ష చేయిస్తున్నారని ఏపీ బీజేపీ అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ ఆరోపించారు.

ప్రజల ముందు బీజేపీని దోషిగా నిలబెట్టి చంద్రబాబు ఎన్నికలకు వెళ్లాలని చూస్తున్నారని ఆయన ఆరోపించారు. మరోవైపు క‌డ‌ప స్టీల్ ప్లాంట్ కోసం టిడిపి నేత‌లు చేస్తోందని దీక్ష కాదని, డైటింగ్ అని వైసిపి ఎమ్మెల్యే రోజా ఎద్దేవా చేశారు. శుక్ర‌వారం తిరుపతిలో ఆమె మీడియాతో మాట్లాడుతూ టిడిపిపై విమర్శల వర్షం కురిపించారు. సీఎం ర‌మేష్‌, బిటెక్ ర‌విల దీక్ష‌ల‌ వెనక మర్మంను ప్ర‌జ‌లు అర్థం చేసుకున్నార‌ని, నాలుగేళ్లు నోరెత్త‌కుండా ఇప్పుడు దీక్ష‌లు చేస్తే ఏమీ రాద‌న్నారు.

 BJP and YCP leaders criticize TDP

Recommended Video

వచ్చే ఎన్నికల్లో పొత్తులుండవ్‌...జగన్‌

చిత్త‌శుద్ధి లేని ఇలాంటి దీక్ష‌లు ఎందుక‌ని ఎమ్మెల్యే రోజా ప్ర‌శ్నించారు. ఇలాంటి దీక్ష‌లు చేస్తే సంవ‌త్స‌ర‌మైనా షుగ‌ర్ లెవ‌ల్స్ త‌గ్గ‌వ‌న్నారు. అయితే టిడిపి ఎంపీలు త‌మ ప‌ద‌వుల‌కు రాజీనామాలు చేసి, ఢిల్లీలో పోరాడితే తాము మ‌ద్ద‌తిస్తామ‌ని రోజా చెప్పారు.

English summary
Kurnool: The BJP and YCP leaders continue to criticizes over MP CM Ramesh Deeksha. AP BJP leader Kanna Lakshminarayana alleges that Chandrababu without giving the information of the Kadapa steel industry to the center and encourages to CM Ramesh deeksha.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X