• search
 • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

చంద్రబాబుకు ప్రతిపక్ష నేత హోదా ఉండదా..! అటు బీజేపీ..ఇటు వైసీపీ: టీడీపీ కౌంటర్ వ్యూహం ఏంటి...!

|

తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే గెలిచిన అయిదు నెలలకే దారి తప్పుతున్నారు. గెలిచిన పార్టీ కాని..23 మంది ఎమ్మెల్యేల్లో పలువురుమరో అధినేత ఆదేశాలు బేఖాతర్ చేస్తున్నారు. అందులో ఇప్పుడు ప్రధానంగా విశాఖ నగరానికి చెందిన ఎమ్మెల్యేల తీరు టీడీపీలో అలజడికి కారణమవుతోంది. ఒక వైపు వల్లభనేన వంశీ తన తీవ్ర విమర్శలతో చంద్రబాబు..

లోకేశ్ ను ఉక్కిరి బిక్కిరి చేస్తున్నారు. అయితే, వంశీ వ్యాఖ్యలను ఖండించటానికి వర్ల రామయ్య..నిమ్మల రామానాయుడు మినహా.. మిగిలిన ఎమ్మెల్యేలు ఎవరూ ముందుకు రావటం లేదు. చంద్రబాబు దీక్ష..పార్టీ సమావేశానికి పలువురు ఎమ్మెల్యేలు గైర్హాజరయ్యారు. వారిలో పలువురు కారణాలు చెబుతున్నా..విశాఖ నగరానికి చెందిన టీడీపీ ఎమ్మెల్యేల తీరు ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. వారు టీడీపీలో ఉండరనే ప్రచారం జోరుగా సాగుతోంది. దీంతో..చంద్రబాబు కు ప్రతిపక్ష నేత హోదా లేకుండా చేయటమే బీజేపీ..వైసీపీ లక్ష్యంగా కనిపిస్తోంది.

పవన్‌ను మించిన మహానటుడు చంద్రబాబు.. జగన్‌పైన మతపర విమర్శలా.. అంబటి ఫైర్

ఎమ్మెల్యేల వరుస గైర్హాజరు..

ఎమ్మెల్యేల వరుస గైర్హాజరు..

చంద్రబాబు ప్రభుత్వం పైన పోరాటంలో భాగంగా ఇసుక దీక్ష నిర్వహించారు. అందులో నలుగురు ఎమ్మెల్యేలు మినహా మిగిలిన వారు పట్టీ పట్టనట్లుగా ఉన్నారు. అధినేత దీక్షకు గైర్హాజరైన వారిలో పలువురు ముందుగానే సమాచారం ఇచ్చారని పార్టీ నేతలు సమర్ధించుకొనే ప్రయత్నం చేస్తున్నారు. మరో వాదన ప్రకారం అనగాని సత్యప్రసాద్, బుచ్చయ్య చౌదరి, జోగేశ్వర రావు, పయ్యావుల కేశవ్, గద్దె రామ్మోహన్, బాలకృష్ణ, బెందాళం అశోక్ మాత్రమే ముందస్తు సమాచారం ఇచ్చారని తెలుస్తోంది. ప్రకాశం జిల్లా నుండి ఇద్దరు హాజరు కాలేదు. ఒక వైపు వల్లభనేని వంశీ వ్యవహారం టీడీపీకి తలనొప్పి గా మారిన సమయం లో ఇక రకంగా ఇప్పడు చంద్రబాబు సమర్ధతకు పరీక్షగా మారుతోంది. ఈ సమయంలో ఎమ్మెల్యేలు ఇలా అధినేత ఆదేశాలను పట్టించుకోకపోవటం పార్టీలో కలవరానికి కారణమవుతోంది.

విశాఖ ఎమ్మెల్యేల రూటే సపరేటు

విశాఖ ఎమ్మెల్యేల రూటే సపరేటు

విశాఖ నగరం నుండి టీడీపీకి నలుగురు ఎమ్మెల్యేలు ఉన్నారు. అందులో మాజీ మంత్రి గంటా అధికారికంగా టీడీపీలో ఉన్నా..వాస్తవంగా పార్టీకి దూరంగా ఉంటున్నారు. అధినేత ఆదేశించిన పవన్ లాంగ్ మార్చ్ కు హాజరు కాలేదు. అదే విధంగా దీక్ష..పార్టీ సమావేశానికి గైర్హాజరయ్యారు. ఆయనతో పాటుగా మరో ఇద్దరు ఎమ్మెల్యేలు వాసుపల్లి గణేష్ .. పీజీవీఆర్‌ నాయుడు (గణబాబు) సైతం గంటాను అనుసరిస్తున్నాని సమా చారం. గంటా ఢిల్లీలో బీజేపీ ముఖ్య నేత రాం మాధవ్ తో సమావేశమయ్యారు. అప్పుడే ఆయన బీజేపీలోకి వెళ్లటం ఖరారైంది. ఇక, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి విశాఖ వచ్చిన సమయంలో టీడీపీ విశాఖ ఎమ్మెల్యేలు కలిసారు. బటయకు మర్యాద పూర్వరకంగా కలిసామని చెబుతున్నా..అందులోనే రాజకీయాలతో సహా..అన్ని చర్చకు వచ్చాయని సోము వీర్రాజు ఓపెన్ గానే చెప్పారు. దీంతో..ఈ ముగ్గురు కాషాయం కండువా కప్పుకోవటానికి సిద్దంగా ఉన్నట్లు ప్రచారం సాగుతోంది.

తొలి టార్గెట్ అదేనా..

తొలి టార్గెట్ అదేనా..

ఒక వైపు బీజేపీ..మరో వైపు వైసీపీ తొలి లక్ష్యం చంద్రబాబు ప్రతిపక్ష నేత హోదా లేకుండా చేయటంగా కనిపిస్తోంది. అందులో బాగంగా విశాఖ నగరంతో పాటుగా ప్రకాశం జిల్లాలో ఇద్దరు..గుంటూరు జిల్లాలో ఒక ఎమ్మెల్యేతో బీజేపీ టచ్ లో ఉన్నట్లు తెలుస్తోంది. ఇదే సమయంలో వైసీపీ సైతం తమతో కొద్ది కాలం క్రితం టచ్ లోకి వచ్చిన వారికి అప్పుడు క్లియరెన్స్ ఇవ్వకుండా పెండింగ్ లో పెట్టింది. వారు ఇప్పుడు బీజేపీ వైపు చూస్తున్నారు. దీంతో..ఇప్పుడు వైసీపీ అప్రమత్తమైంది. తమ వైపు వచ్చే వారితో పార్టీ నేతలు టచ్ లోకి వెళ్లారు. నలుగురు ఎమ్మెల్యేలతో మంతనాలు సాగిస్తున్నట్లు సమాచారం. ఇప్పటికిప్పుడు వారు పార్టీ మారకపోయినా...సందర్భానుసారం వైసీపీకి అనుకూలంగా వ్యవహరించే విధంగా చర్చలు సాగిస్తున్నట్లు విశ్వసనీయ సమాచారం.

  Devineni Avinash Joins YSRCP || Oneindia Telugu
  చంద్రబాబు ముందున్న ప్రత్యామ్నాయం..

  చంద్రబాబు ముందున్న ప్రత్యామ్నాయం..

  ఇప్పటికే వల్లభనేని వంశీ వెళ్లిపోవటం.. చంద్రబాబు.. లోకేశ్ మీద వ్యక్తిగతంగా తీవ్ర ఆరోపణలు చేయటం టీడీపీ నేతలకు మింగుడు పడటం లేదు. దీంతో..చంద్రబాబు దీని పైన పార్టీ ముఖ్యులతో చర్చించారు. ఎమ్మెల్యేలతో ప్రత్యేకంగా సమావేశం కావాలని డిసైడ్ అయ్యారు. అయితే, అధినేత ఏర్పాటు చేసిన సమావేశానికే కారణాలు చెబుతూ ఎమ్మెల్యేలు గైర్హాజరవుతున్నారు. దీంతో..తానే చొరవ తీసుకొని ప్రతీ ఎమ్మెల్యేతో మాట్లాడాలని చంద్రబాబు నిర్ణయించినట్లు సమాచారం. ఈ సమయంలో చంద్రబాబు మాట వారు ఎంత వరకు వింటారు.. తమ ఆలోచనలు మార్చుకుంటారా అంటే సందేహంగానే కనిపిస్తోంది. దీంతో..డిసెంబర్ మొదటి వారంలో జరిగే శాసనసభా సమావేశాల్లో టీడీపీ ఎటువంటి పరిస్థితి ఎదుర్కోవాల్సి వస్తుందనేది ఆసక్తి కరంగా మారుతోంది.

  తెలుగు మ్యాట్రిమోనిలో మీకు నచ్చిన జీవిత భాగస్వామి ఎంపికలు - రిజిస్ట్రేషన్ ఉచితం!

  English summary
  seem to be political crisis is in TDP. many of the party MLA's not following CBN orders in party issues. BJP.. YCP trying to pull TDP Mla's in to thier parties.
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Oneindia sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Oneindia website. However, you can change your cookie settings at any time. Learn more