వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

చిరంజీవికి ఏపీలో ఓటు హక్కు కూడా లేదు: విశాఖలో లాభాపేక్ష కోసమే మద్దతు: బీజేపీ నేత...!

|
Google Oneindia TeluguNews

మూడు రాజధానుల ప్రతిపాదనలు..కేంద్ర మాజీ మంత్రి చిరంజీవి మద్దతు ఇవ్వటం పైన బీజేపీ యువమోర్చా అధ్యక్షుడు రమేష్ నాడుయు తీవ్ర వ్యాఖ్యలు చేసారు. చిరంజీవికి ఏటో ఓటు హక్కు కూడా లేదని ఎద్దేవా చేసారు. విశాఖలో లాభాపేక్ష కోసమే చిరంజీవి సీఎం జగన్ కు మద్దతు ఇస్తున్నారని ఆరోపించారు. జగన్ మూడు కళ్ల సిద్దాంతం కంటి తుడుపు చర్యగా అభివర్ణించారు. హైకోర్టును మూడు ముక్కలు చేసి కర్నూలులో కోర్టు ఏర్పాటు చేస్తే ఏం లాభమని ప్రశ్నించారు. జీఎన్ రావు కమిటీ మీద అఖిల పక్షం అవసరం లేదా అని ప్రభుత్వాన్ని నిలదీసారు.

విశాఖలో లాభాపేక్ష కోసమే..
కేంద్ర మాజీ మంత్రి చిరంజీవి మూడు రాజధానులకు మద్దతు ప్రకటించటం పైన బీజేపీ నేత రమేష్ నాయుడు కీలక వ్యాఖ్యలు ఇప్పుడు హాట్ టాపిక్ గా మారాయి. చిరంజీవి విశాఖలో లాభాపేక్ష కోసమే జగన్ కు మద్దతు ఇస్తున్నారని విమర్శించారు. ఇప్పుడున్న పరిస్థితులు చూస్తుంటే నాలుగున్నారేళ్ల క్రితం పరిస్థితులు గుర్తు చేస్తున్నాయని వివరించారు. చంద్రబాబు..జగన్ మధ్య వైరం రాష్ట్రానికి శాపంగా మారిందని చెప్పుకొచ్చారు. విజయ సాయిరెడ్డి ఇప్పటికే రాజధాని ఎక్కడ ఉంటుందో భీమిలో సర్వే నెంబర్లతో సహా చెబుతున్నారని పేర్కొన్నారు. వైసీపీ నేతలు విశాఖలో ఇన్ సైడర్ ట్రేడింగ్ కు పాల్పడ్డారని ఆరోపించారు. జగన్ తీరు చూస్తుంటే గింజలు చల్లి పావురాలు పట్టే విధంగా ఉందని వ్యాఖ్యానించారు.

BJP youth wing leader serious comments against Chiranjeevi on his reaction on three capitals

జగన్ నిర్ణయం కంటి తుడుపు చర్యే..
జగన్ మూడు కళ్ల సిద్దాంతం కంటి తుడుపు చర్యేనని రమేష్ నాయుడు పేర్కొన్నారు. రాయలసీమకు హైకోర్టు రావాలని బీజేపీ కోరుకుందని..అయితే.. మూడు ముక్కలుగా చేస్తున్న హైకోర్టుతో ఏం ప్రయోజనమని ప్రశ్నించారు. రాయలసీమక కావాల్సింది నికర జలాలు..ఉపాధినిచ్చే పరిశ్రమలంటూ చెప్పుకొచ్చారు. జీఎన్ రావు నివేదిక చూస్తుంటే జగన్ కు కట్ అండ్ పేస్ట్ లాగా ఉందని అభిప్రాయపడ్డారు. కమిటీ నివేదిక మీద అఖిలపక్షం అవసరం లేదా అని రమేష్ నాయుడు ప్రశ్నించారు.

English summary
BJP youth wing leader serious comments against Chiranjeevi on his reaction on three capitals and GN rao committee.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X