వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

అవినీతికి వారసులు, రాష్ట్రంలో రూలింగ్ లేదు: బాబుపై సోము వీర్రాజు ఫైర్

By Narsimha
|
Google Oneindia TeluguNews

కర్నూల్: రాష్ట్రంలో రూలింగ్ లేదు, ట్రేడింగ్ మాత్రమే జరుగుతోందని బిజెపి ఎమ్మెల్సీ సోము వీర్రాజు ఏపీ రాష్ట్ర ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేశారు. వారంతా అవినీతికి వారసులంటూ పరోక్షంగా విమర్శలు గుప్పించారు.

''బిజెపికి వ్యతిరేకంగా బాబు చక్రం: టిడిపి ప్లానేంటీ, మిత్రధర్మం ఇదేనా?'' ''బిజెపికి వ్యతిరేకంగా బాబు చక్రం: టిడిపి ప్లానేంటీ, మిత్రధర్మం ఇదేనా?''

బీజేపీ ఎమ్మెల్సీ సోము వీర్రాజు మరోసారి టీడీపీ నాయకులపై ఆదివారంనాడు సంచలన వ్యాఖ్యలు చేశారు. టీడీపీ నాయకులు అవినీతికి వారసులంటూ తీవ్రస్థాయిలో మండిపడ్డారు.

Bjpc MLC Somu Verraju sensational comments on chandrababunaidu

సీఎం చంద్రబాబుపైనా పరోక్షంగా ఆరోపణలు గుప్పించారు. కర్నూలు అసెంబ్లీ పరిధిలో బూత్ స్థాయి బీజేపీ కార్యకర్తల సమావేశంలో సోము వీర్రాజు ఈ వ్యాఖ్యలు చేయడం కలకలం రేపుతోంది.

మేము నిప్పులాంటి వాళ్లం. మీరు అవినీతికి వారసులంటూ నిప్పులు చెరిగారు. బీజేపీని రాష్ట్రంలో బలోపేతం చేయడమే నా అజెండా. నాకు సొంత ఎజెండా లేదని సోము వీర్రాజు అభిప్రాయపడ్డారు.

రాష్ట్రంలో రూలింగ్ లేదు..ట్రేడింగ్ మాత్రమే జరుగుతోంది. రెండెకరాల రైతును అంటున్న మీకు లక్షల కోట్ల ఆస్తులు ఎలా వచ్చాయని పరోక్షంగా టిడిపి అధినేత చంద్రబాబుపై సోము వీర్రాజు తీవ్రస్థాయిలో ఆరోపించారు.

బడ్జెట్ ఎఫెక్ట్: శివసేన చీఫ్ ఉద్దవ్ ఠాక్రేతో బాబు ఫోన్లో చర్చలు, ఏపీలో మారుతున్న రాజకీయాలు బడ్జెట్ ఎఫెక్ట్: శివసేన చీఫ్ ఉద్దవ్ ఠాక్రేతో బాబు ఫోన్లో చర్చలు, ఏపీలో మారుతున్న రాజకీయాలు

తమ పార్టీ అధ్యక్షుడి ఆదేశాల మేరకే అవినీతిపై ఎదురుతిరుగుతున్నామని, తమకు ఎలాంటి సొంత అజెండా లేదని స్పష్టం చేశారు. రాష్ట్రంలో జరుగుతున్న అభివృద్ధికి నాంది పలికింది కేంద్ర ప్రభుత్వమేనని చెప్పారు.

కేంద్ర నిధులు రాష్ట్రంలో స్వార్థ పరులకు ఆదాయ వనరులుగా మారాయని ఆరోపించారు. స్వయంగా ముఖ్యమంత్రి నియోజకవర్గంలో భారీ అవినీతి జరిగింది నిజం కాదా అని ప్రశ్నించారు.

ప్రధాని మోదీ బొమ్మ వాడడానికి రాష్ట్రం భయపడుతోందన్నారు. కేంద్రం అమలు చేస్తున్న అభివృద్ధి పనుల్లో ప్రధాని పేరు ఎక్కడా రాష్ట్ర ప్రభుత్వం ప్రచురించడం లేదని వాపోయారు. కరెంటు సమస్యలు తీర్చడానికి 5 వేల కోట్ల రూపాయల నిధులు మోదీ ప్రభుత్వం ఇచ్చిందని రాష్ట్ర ప్రభుత్వమే ఒప్పుకుందని గుర్తు చేశారు.

English summary
BJP MLC Somu Veerraju sensational comments on Ap Chief minister Chandrababu naidu on Sunday at Kurnool.He made allegations on TDP leaders. Verraju participated Kurnool Assembly Bjp leaders meeting held at Kurnool.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X