
వణికిస్తున్న బ్లాక్ ఫంగస్, భారీగా కేసులతో ఏపీకి కొత్త టెన్షన్ ; కేసుల పెరుగుదలకు కారణాలివే !!
కరోనా మహమ్మారి కేసులలో టాప్ 5 రాష్ట్రాల్లో ఒకటిగా ఉన్న ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఇప్పుడు మరో భయంతో వణికిపోతుంది. కరోనా సెకండ్ వేవ్ లో దారుణంగా దెబ్బ తిన్న ఏపీలో ప్రజలకు ఇప్పుడు కొత్త సమస్య ఇబ్బంది పెడుతోంది. పెరుగుతున్న బ్లాక్ ఫంగస్ కేసులు ఏపీ రాష్ట్రాన్ని తీవ్ర ఆందోళనకు గురి చేస్తున్నాయి. కరోనా నుంచి కోలుకున్న చాలామందిలో బ్లాక్ ఫంగస్ లక్షణాలు బయటపడుతున్న తీరు ఏపీ వాసులకు కంటి మీద కునుకు పట్టనివ్వటం లేదు.
దేశంలోనే
బ్లాక్
ఫంగస్
కేసుల్లో
ఏపీ
మూడో
స్థానం
:
గుంటూరులోనే
అధికంగా,
ఏపీకి
కొత్త
భయం
!!

ఏపీలో ఇప్పటి వరకు బ్లాక్ ఫంగస్ కేసులు 4,597
ఆంధ్రప్రదేశ్లో బ్లాక్ ఫంగస్ అని పిలువబడే మ్యూకోర్ మైకోసిస్ కేసులు బాగా పెరుగుతున్నాయి. రాష్ట్ర ఆరోగ్య శాఖ ప్రకారం, మొత్తం ఏపీలో ఇప్పటి వరకు బ్లాక్ ఫంగస్ కేసులు 4,597 కి పెరిగాయి.గత వారం రోజుల్లో, రాష్ట్రంలో 151 మ్యుకోర్ మైకోసిస్ కేసులు నమోదయ్యాయి. అలాగే బ్లాక్ ఫంగస్ కారణంగా 14 మంది మరణించారు. అదే సమయంలో గత వారంలో 225 మంది బ్లాక్ ఫంగస్ నుండి కోలుకున్నారని ఆరోగ్య శాఖ తెలిపింది. తాజాగా చెప్పిన లెక్కల ప్రకారం మొత్తం కేసులలో 428 మంది ప్రస్తుతం ఇన్ఫెక్షన్ తో బాధ పడుతున్నారు. మొత్తం 3,492 మంది బ్లాక్ ఫంగస్ నుండి కోలుకున్నారు.

ఏపీలో యాక్టివ్ కేసుల సంఖ్య 677
ఆంధ్రప్రదేశ్లో యాక్టివ్ కేసుల సంఖ్య ఈ వారం 88 కి పడిపోయింది. దీనితో, యాక్టివ్ కేస్లోడ్ ఇప్పుడు 677 వద్ద ఉంది. తాజాగా విశాఖపట్నం జిల్లాలో ఒక కేసు మరియు రెండు మరణాలు నమోదయ్యాయి, చిత్తూరు జిల్లాలో మూడు కేసులు మరియు ఒక మరణం నమోదయ్యాయి. ఇదిలా ఉంటే అనంతపురం జిల్లాలో 32, గుంటూరు 21, కడప 16 మరియు తూర్పు గోదావరి 13 కేసులు నమోదయ్యాయి.రెండు వారాల తరువాత, విజయనగరం జిల్లాలో మూడు కొత్త కేసులు నమోదు కాగా, పశ్చిమ గోదావరిలో వరుసగా మూడో వారం సున్నా కేసులు నమోదయ్యాయి.ఆరోగ్య శాఖ గణాంకాల ప్రకారం కృష్ణా జిల్లా కూడా కొత్త కేసు నమోదు చేయలేదు.

గుంటూరులోనే అత్యధికంగా బ్లాక్ ఫంగస్ కేసులు
ఇదిలా ఉండగా, చిత్తూరులో వారంలో ఆరు మరణాలు, తూర్పు గోదావరి జిల్లాలో నాలుగు, విశాఖపట్నం జిల్లాలో రెండు, కర్నూలు మరియు అనంతపురం జిల్లాలలో ఒక్కొక్కటి చొప్పున బ్లాక్ ఫంగస్ మరణాలను నమోదు చేసింది. మిగిలిన ఎనిమిది జిల్లాలలో బ్లాక్ ఫంగస్ కారణంగా ఎటువంటి మరణాలను చూడలేదు.ఇప్పటివరకు, రాష్ట్రంలో 2,510 ఫంగస్ సోకిన వ్యక్తులకు శస్త్రచికిత్సలు జరిగాయని ఆరోగ్య శాఖ డేటా పేర్కొంది.ఇదిలా ఉంటే గుంటూరు జిల్లాలో అత్యధికంగా ఇప్పటికే వందల సంఖ్యలో బ్లాక్ ఫంగస్ కేసులు నమోదైనట్లుగా తెలుస్తుంది.

బ్లాక్ ఫంగస్ కేసుల పెరుగుదలకు కారణాలివే
ఇక
ఆంధ్రప్రదేశ్
రాష్ట్రంలో
బ్లాక్
ఫంగస్
కేసులు
బాగా
పెరగటానికి
ప్రధాన
కారణం.
కరోనా
మహమ్మారి
నుండి
కాపాడుకోవటం
కోసం
ప్రజలు
తమకు
అర్ధం
కాకుండా
ఇష్టారాజ్యంగా
వాడిన
స్టెరాయిడ్స్.
కరోనా
రాక
ముందే
కరోనా
రాకుండా
ముందస్తు
జాగ్రత్త
అని
భావించిన
చాలా
మంది
స్టెరాయిడ్స్
వాడారు.
ఫలితంగా
బ్లడ్
షుగర్
లెవల్స్
పెరిగి
బ్లాక్
ఫంగస్
రావటానికి
కారణం
అయ్యింది.
ఇదిలా
ఉంటే
డయాబెటిస్
బాధితుల్లో
కూడా
కంట్రోల్
లో
షుగర్
లెవల్స్
లేకుంటే
బ్లాక్
ఫంగస్
బారిన
పడుతున్నారు.
ఇటీవల
లోక్సభలో
ఒక
ప్రశ్నకు
ఆరోగ్య
మరియు
కుటుంబ
సంక్షేమ
మంత్రిత్వ
శాఖ
వెల్లడించిన
వివరాల
ప్రకారం
ఆంధ్రప్రదేశ్
రాష్ట్రం
మూడో
స్థానంలో
ఉందని
తెలుస్తుంది.

బాధిత కుటుంబాల ఆవేదన.. ప్రభుత్వానికి వేడుకోలు
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో బ్లాక్ ఫంగస్ బాధిత కుటుంబాల ఆవేదన అంతా ఇంతా కాదు. బ్లాక్ ఫంగస్ కు ట్రీట్మెంట్ చాలా కాస్ట్లీ ట్రీట్మెంట్ కావడంతో ప్రైవేట్ ఆసుపత్రులలో ట్రీట్మెంట్ చేయించుకోలేని పరిస్థితి నెలకొంది.బ్లాక్ ఫంగస్ బాధితులు అందరూ ప్రభుత్వ ఆసుపత్రులకు పరుగులు పెట్టాల్సిన పరిస్థితి. అయితే ప్రభుత్వ ఆసుపత్రులలో బ్లాక్ ఫంగస్ కు ట్రీట్మెంట్ చేయడానికి సరైన వసతులు లేవని, ఆపరేషన్ల తర్వాత వాడే మందులు కూడా చాలా కాస్ట్లీగా ఉండడంతో, మందులను కూడా ప్రభుత్వం ఉచితంగా ఇస్తే బాగుంటుందని బాధితులు కోరుతున్నారు. నిరుపేదలకు ఆరోగ్యశ్రీ ద్వారా బ్లాక్ ఫంగస్ కు మందులు ఇచ్చే విధానాన్ని అమలు చేయాలని వారు విజ్ఞప్తి చేస్తున్నారు.