వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

తెలుగు రాష్ట్రాల్లో బ్లాక్ దందా : సామాన్యుల నిలువుదోపిడీ .. ఒక్క రెమ్‌డెసివిర్ ఇంజెక్షన్ ఎంతంటే !!

|
Google Oneindia TeluguNews

తెలుగు రాష్ట్రాల్లో కరోనా కష్టకాలంలో బ్లాక్ మార్కెట్ జోరందుకుంది. కరోనా బాధితులకు అందించే వైద్యానికి సంబంధించి వినియోగించే మందులు, ఇంజక్షన్ల ధరలకు కట్టడి లేకుండాపోయింది. శ్వాసకోశ సమస్యతో తీవ్రంగా ఇబ్బంది పడుతున్న కరోనా బాధితులకు ఇచ్చే రెమ్‌డెసివిర్ ఇంజక్షన్ ధర ఒక్కో ఇంజక్షన్ కు 30 వేల రూపాయల దాకా బ్లాక్ మార్కెట్లో పలుకుతోంది. మొత్తం రెమ్‌డెసివిర్ డోసులు ఆరు కరోనా బాధితులకు ఇవ్వవలసిన నేపథ్యంలో వీటిని కొనుగోలు చేయాలంటే దాదాపు లక్షా ఎనభై వేల రూపాయలు వెచ్చించాల్సిన పరిస్థితి సామాన్యులు తీవ్ర ఆవేదనకు గురి చేస్తోంది.

ప్రాణాంతక మహమ్మారి : ప్రపంచ రికార్డులు బద్దలు .. 3.32 లక్షలకు పైగా కరోనా కొత్త కేసులు 2,263 మరణాలు ప్రాణాంతక మహమ్మారి : ప్రపంచ రికార్డులు బద్దలు .. 3.32 లక్షలకు పైగా కరోనా కొత్త కేసులు 2,263 మరణాలు

ఆస్పత్రుల్లో నో రెమ్‌డెసివిర్.. జోరుగా సాగుతున్న బ్లాక్ దందా

ఆస్పత్రుల్లో నో రెమ్‌డెసివిర్.. జోరుగా సాగుతున్న బ్లాక్ దందా

ఇంజక్షన్లు బ్లాక్ మార్కెట్లో కొనుగోలు చేయలేక , ఆసుపత్రులలో లేవని చెప్పడంతో దిక్కుతోచని స్థితిలో సామాన్యులు దీనంగా రోదిస్తున్నారు.

కరోనా మహమ్మారి బారిన పడి శ్వాసకోశ సమస్యలతో తీవ్రంగా ఇబ్బంది పడుతున్న వారి బంధువులు రెమ్‌డెసివిర్ ఇంజక్షన్ కోసం పరుగులు పెడుతున్నారు. ప్రభుత్వ, ప్రైవేటు ఆసుపత్రులలో ఇంజెక్షన్లు అందుబాటులో లేవని వైద్యులు చెబుతున్న పరిస్థితులతో బ్లాక్ లో కొనుగోలు చేయడానికి విఫల యత్నాలు చేస్తున్నారు.

బాధితుల అవసరాన్ని బట్టి దోపిడీ పర్వానికి తెర తీసిన అక్రమార్కులు

బాధితుల అవసరాన్ని బట్టి దోపిడీ పర్వానికి తెర తీసిన అక్రమార్కులు

తెలుగు రాష్ట్రాలలో రెమ్‌డెసివిర్ ఇంజెక్షన్లను ఇప్పటికే బ్లాక్ చేసిన అక్రమార్కులు, బాధితుల అవసరాన్ని బట్టి విపరీతమైన ధరలు పెంచి విక్రయిస్తున్నారు . రెమ్‌డెసివిర్ అసలు ధర దాదాపు 3,000 రూపాయలు గా ఉంటే, దానికి పది రెట్లు పెంచి 30 వేల రూపాయలు గా విక్రయిస్తున్న పరిస్థితి తెలుగు రాష్ట్రాల్లో కనిపిస్తుంది.

ఒక్క తెలుగు రాష్ట్రాల్లోనే కాదు దేశవ్యాప్తంగా రెమ్‌డెసివిర్ ఇంజెక్షన్ బ్లాక్ మార్కెట్ అవుతుంది . ఏ ఆస్పత్రికి వెళ్ళినా ఇంజక్షన్ లు లేవు అనే పదమే ముందు వెలుగు చూస్తుంది.

మందులు , ఇంజక్షన్ ల కోసం సామాన్యుల నుండి సంపన్నుల వరకు నిలువు దోపిడీ

మందులు , ఇంజక్షన్ ల కోసం సామాన్యుల నుండి సంపన్నుల వరకు నిలువు దోపిడీ


బాధితులు వారి అవసరాన్ని బట్టి అభ్యర్థిస్తున్న క్రమంలో బ్లాక్ మార్కెట్లో రెమ్‌డెసివిర్ ఇంజక్షన్లను విక్రయిస్తున్న పరిస్థితి ప్రస్తుతం కరోనా మహమ్మారి విజృంభణకు, ఆసుపత్రుల దోపిడీకి అద్దం పడుతుంది . వీరు వారు అన్న తేడా లేకుండా సామాన్యుల నుండి సంపన్నుల వరకు ప్రతి ఒక్కరూ తమ వారి ప్రాణాలు నిలిపేందుకు బ్లాక్ మార్కెట్ లో అడిగినంత చెల్లించి ఇంజక్షన్ లను కొనుగోలు చేయాల్సిన పరిస్థితి వచ్చింది . ప్రభుత్వాలు బ్లాక్ మార్కెట్ పై ఉక్కుపాదం మోపాలని ప్రయత్నాలు చేస్తున్నా అవి ఏమాత్రం ఫలించని పరిస్థితి తెలుగు రాష్ట్రాల్లో కనిపిస్తుంది .

 ప్రభుత్వాలు చెప్పే దానికి క్షేత్ర స్థాయి పరిస్థితులకు పోలిక లేదు

ప్రభుత్వాలు చెప్పే దానికి క్షేత్ర స్థాయి పరిస్థితులకు పోలిక లేదు

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలలో ప్రస్తుతానికి వైద్య సదుపాయాల కొరత ఏమీ లేదని , అన్ని ఆసుపత్రులలో కరోనా వైద్యానికి కావలసిన మందులు అందుబాటులో ఉన్నాయని ప్రభుత్వాలు చెబుతున్నా, గ్రౌండ్ రియాలిటీ లో మాత్రం అలా కనిపించడం లేదు. యాంటి బయాటిక్స్ మందుల నుండి, రెమ్‌డెసివిర్ ఇంజక్షన్స్ వరకు ఏది కొనాలన్నా సామాన్యులు కొనుగోలు చేయలేని పరిస్థితి నెలకొంది .ఆస్తిపాస్తులు అమ్ముకొని, బంగారాన్ని తాకట్టు పెట్టి, అప్పులు చేసి అయినా తమ వారి ప్రాణాలు కాపాడడం కోసం మందులో రామచంద్రా అంటూ పరుగులు పెడుతున్నారు తెలుగు రాష్ట్రాల ప్రజలు.

సామాన్యులకు కరోనా వైద్యం అందని ద్రాక్షగా .. ప్రభుత్వాలు స్పందించాలి

సామాన్యులకు కరోనా వైద్యం అందని ద్రాక్షగా .. ప్రభుత్వాలు స్పందించాలి

కరోనా కట్టడి మాట అటుంచి, విపరీతంగా సాగుతున్న బ్లాక్ మార్కెట్ ను కట్టడి చేసి , అన్ని ఆసుపత్రులలో మందులు అందేలా చేస్తే తప్ప సామాన్యులకు వైద్యం దొరకని పరిస్థితి. తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాలు ఇప్పటికైనా దీనిపై దృష్టి సారించి, కరోనా వైద్యానికి కావలసిన అన్ని మందులను అందుబాటులో ఉంచాలని విజ్ఞప్తి చేస్తున్నారు సామాన్య ప్రజానీకం. ముఖ్యంగా చాలా అవసరంగా మారిన


రెమ్‌డెసివిర్ ఇంజక్షన్ ల విషయంలో ప్రభుత్వం స్పందించాలని కోరుతున్నారు .

English summary
The black market was booming in the Telugu states during the Corona crisis. The prices of medicines and injections used in the medical care provided to corona victims have gone up. corona sufferers suffering from severe respiratory problems is said to be need of Remdesivir injection. the injection cost around Rs 30,000 in the black market. In the face of the fact that the total doses of remdesivir have to be given six to corona victims, the situation of having to spend almost one lakh and eighty thousand rupees to buy these is causing serious concern to the common people.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X