వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

అలా విడిపిస్తున్నారు: నల్లధనం మార్చుకునేందుకు మరో కొత్త 'ఐడియా'!

పాత నోట్లు మార్చుకునేందుకు రోజుకో సరికొత్త ఐడియా పుట్టుకు వస్తోంది. ఇతరుల బ్యాంకుల ఖాతాలలో వేయడం, బంగారం కొనడం, ఆ తర్వాత డాలర్లుగా మార్చుకున్నారు.

|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: రద్దయిన రూ.500, రూ.1000 నోట్లు మార్చుకునేందుకు రోజుకో సరికొత్త ఐడియా పుట్టుకు వస్తోంది. ఇతరుల బ్యాంకుల ఖాతాలలో వేయడం, బంగారం కొనడం, ఆ తర్వాత డాలర్లుగా మార్చుకోవడం.. ఇలా కొత్త కొత్త ఐడియాలు తెరపైకి వస్తున్నాయి.

ఇప్పుడు పాత పద్ధతి వైపు దృష్టి మరలింది. బంగారం, భూముల పైన నల్ల డబ్బు పెట్టుబడికి దారులు వెతుకుతున్నారు. బంగారం దుకాణాల్లో లెక్కల్లో చూపని బంగారం బిస్కెట్లను పాత నోట్లతో కొనుగోలు చేస్తున్నారు. రూ.100 గ్రాముల బంగారం బిస్కెట్లు గురువారం నాటి మార్కెట్‌లో రూ.3.15 లక్షలు ఉండగా, అంతకు ఎక్కువ ఇచ్చి చలామణిలో ఉన్న నోట్లను తీసుకుంటున్నారు.

Black Money converted into white money

అంతేకాదు, బ్యాంకుల తనఖాలో ఉన్న బంగారాన్ని విడిపించేందుకు పెద్ద నోట్లు ఉపయోగిస్తున్నారు. వ్యవసాయం, ఇంటి ఖర్చుల కోసం బ్యాంకులలో తనకా పెట్టిన ఆభరణాలను విడిపించే కారణంతో రూ.500, రూ.1000 నోట్లను వినియోగిస్తున్నారని అంటున్నారు. అయితే వీరితో నల్ల ధనం కలిగి ఉన్న వారు అలా చేయిస్తున్నారని అంటున్నారు.

గత ఐదు రోజులుగా బ్యాంకు తాకట్టులో ఉన్న బంగారం వస్తువులను విడిపిస్తున్నారని తెలుస్తోంది. తెలిసిన వారివి, బంధువుల నగలను బ్యాంకుల నుంచి విడిపించేలా ఏర్పాట్లు చేశారని అంటున్నారు. కాగా, పెద్ద నోట్లు మార్చేందుకు మధ్యవర్తులు పెద్ద మొత్తంలో కమిషన్ కూడా తీసుకుంటున్నారని అంటున్నారు.

English summary
Black Money converted into white money.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X