హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

బొత్సకు అస్వస్థత: కెకె సహా కేర్‌కు నేతల క్యూ(పిక్చర్స్)

By Srinivas
|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: ప్రదేశ్ కాంగ్రెసు కమిటీ అధ్యక్షుడు, రవాణా శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ తీవ్ర తలనొప్పి, హైబిపితో బాధపడుతుండటంతో మంగళవారం మధ్యాహ్నం కుటుంబ సభ్యులు ఆయనను బంజారాహిల్స్‌లోని కేర్ ఆస్పత్రిలో చేర్చారు.

ప్రాథమిక పరీక్షల అనంతరం వైద్యులు ఆయనను తక్షణం ఐసియుకు తరలించారు. ఆస్పత్రి చైర్మన్ డాక్టర్ సోమరాజు, న్యూరాలజిస్టు డాక్టర్ ముదిగొండ చంద్రశేఖర్ చికిత్స చేస్తున్నారు.

బొత్సను కేంద్రమంత్రి చిరంజీవి, ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి, మంత్రులు జానారెడ్డి, పొన్నాల లక్ష్మ య్య, గీతారెడ్డి, టిజి వెంకటేశ్, కన్నా లక్ష్మీనారాయణ, దానం నాగేందర్, పలువురు శాసనసభ్యులు పరామర్శించారు.

బొత్స 1

బొత్స 1

ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న పిసిసి అధ్యక్షుడు బొత్స సత్యనారాయణను చూసేందుకు వచ్చిన తెరాస నేత, పిసిసి మాజీ చీఫ్ కె కేశవ రావు.

బొత్స 2

బొత్స 2

బొత్సకు మెదడులో రక్తం గడ్డకట్టిందని తెలిసింది. ఆయనకు ఎంఆర్ఐ స్కాన్ చేయడంతో ఇది బయటపడిందని సమాచా రం. అయితే, ఆస్పత్రి వర్గాలు దీన్ని నిర్ధారించడం లేదు.

బొత్స 3

బొత్స 3

మానసిక ఆందోళన వల్లనే పిసిసి అధ్యక్షుడు బొత్స సత్యనారాయణ అస్వస్థతకు గురయ్యారని కేంద్ర పర్యాటక శాఖ మంత్రి చిరంజీవి చెప్పారు.

బొత్స 4

బొత్స 4


బొత్సతో తాను మాట్లాడానని, సంతోషంగా ఉన్నారని చిరంజీవి చెప్పారు. బొత్స ఆరోగ్యం నిలకడగా ఉందని, ఆయనకు కొంత విశ్రాంతి అవసరమని వైద్యులు చెప్పినట్లు చిరు చెప్పారు.

బొత్స 5

బొత్స 5

బొత్స సత్యనారాయణ ఆరోగ్యం నిలకడగా ఉందని కేర్ ఆస్పత్రి వర్గాలు మంగళవారం సాయంత్రం చెప్పాయి. బొత్స తీవ్రమైన రక్తంపోటు, తలనొప్పితో బాధపడుతున్నట్లు తెలిపాయి. బొత్స ఆరోగ్యంపై కేర్ ఆస్పత్రి వైద్యులు బులిటెన్ విడుదల చేశారు.

బొత్స 6

బొత్స 6

డాక్టర్ సోమరాజు ఆధ్వర్యంలో ఆయనకు చికిత్స అందిస్తున్నారు. మంత్రులు, శాసనసభ్యులు, కాంగ్రెసు నాయకులు ఆయనను పరామర్శించారు.

బొత్స 7

బొత్స 7

అస్వస్థత కారణంగా ఆయన మంగళవారం సాయంత్రం ఏర్పాటైన మంత్రి వర్గసమావేశానికి హాజరు కాలేకపోయారు. బొత్స ఆరోగ్యంపై పార్టీ శ్రేణులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని కాంగ్రెసు నాయకులు చెప్పారు.

English summary
Blood clot found in Botsa Satyanarayana's brain.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X