వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఇసుకదిబ్బని ఢీకొట్టి, లైఫ్ జాకెట్లు అడిగినా ఇవ్వక: బోటు ప్రమాదానికి కారణాలివీ!

ఇబ్రహీంపట్నం ఫెర్రాఘాట్ వద్ద జరిగిన విషాధ సంఘటనకు సంబంధించి బాధితులు ఎన్నో షాకింగ్ విషయాలు చెబుతున్నారు. భవానీ ఐలాండ్స్ నుంచి పవిత్ర సంగమం వద్దకు 38 మందితో వెళ్తున్న బోటు ఇబ్రహీంపట్నంవద్ద తిరగబడింది

|
Google Oneindia TeluguNews

Recommended Video

Krishna River Boat Mishap : బోటు ప్రమాదానికి కారణాలివీ!

విజయవాడ: ఇబ్రహీంపట్నం ఫెర్రాఘాట్ వద్ద జరిగిన విషాధ సంఘటనకు సంబంధించి బాధితులు ఎన్నో షాకింగ్ విషయాలు చెబుతున్నారు. భవానీ ఐలాండ్స్ నుంచి పవిత్ర సంగమం వద్దకు 38 మందితో వెళ్తున్న బోటు ఇబ్రహీంపట్నం వద్ద తిరగబడటంతో 14 మంది వరకు మృతి చెందినట్లుగా తెలుస్తోంది.

బోటులో సామర్థ్యానికి మించి

బోటులో సామర్థ్యానికి మించి

ప్రమాదానికి సంబంధించి విస్తుపోయే విషయాలను చెబుతూ బాధితులు కన్నీరుమున్నీరు అవుతున్నారు. బోటులో సామర్థ్యానికి మించి ఎక్కినట్లుగా తెలుస్తోంది. ఇది కూడా ప్రమాదానికి ఓ కారణంగా తెలుస్తోంది.

ఏపీ టూరిజం బోటు లేకపోవడంతో ప్రయివేటు బోటు

ఏపీ టూరిజం బోటు లేకపోవడంతో ప్రయివేటు బోటు

బాధితులు అందరూ తొలుత ఆంధ్రప్రదేశ్ టూరిజం బోటు గురించి చూశారు. కానీ ఏపీ టూరిజం బోటు అందుబాటులో లేకపోవడం లేదా సమయం మించిపోవడంతో వారంతా పక్కనే ఉన్న ప్రయివేటు బోటు ఎక్కారు.

లైఫ్ జాకెట్లు అడిగితే లేవని చెప్పారు

లైఫ్ జాకెట్లు అడిగితే లేవని చెప్పారు

ప్రయాణీకులు బోటు ఎక్కే ముందే ప్రయివేటు టూరిజం బోటు సిబ్బందిని లైఫ్ జాకెట్ల గురించి అడిగారు. కానీ వారు మీకు ఏం భయం లేదని, లైఫ్ జాకెట్లు అవసరం లేదని చెప్పారని బాధితులు చెప్పారు. లైఫ్ జాకెట్లు ఇవ్వలేదన్నారు. కొంతమందికి మాత్రమే ఇచ్చినట్లు తెలుస్తోంది.

ప్రమాదానికి ముందు కుదుపులు

ప్రమాదానికి ముందు కుదుపులు

ప్రమాదానికి ముందు బోటు రెండుమూడుసార్లు కుదుపులకు లోనయిందని తెలుస్తోంది. ఆ తర్వాత ఓ మట్టి దిబ్బను ఢీకొట్టడంతో బోటు ఓ వైపుకు ఒంగిపోయిందని, దీనివల్ల ప్రయాణీకులు ఓ పక్కకు రావడం వల్ల బోటు బోల్తా పడిందని కూడా తెలుస్తోంది. బోటు డ్రైవర్ కూడా చాలా నిర్లక్ష్యంగా వ్యవహరించాడని అంటున్నారు.

అందరూ ఒంగోలు వాకర్స్ క్లబ్‌కు చెందినవారు

అందరూ ఒంగోలు వాకర్స్ క్లబ్‌కు చెందినవారు

బాధితులు అందరూ కూడా ఒంగోలు వాసులు. వాకర్స్ క్లబ్ తరఫున వీరు పవిత్ర సంగమానికి వచ్చారు. తామంతా వాకర్స్ క్లబ్ తరఫున వచ్చినట్లు బాధితులు కూడా వెల్లడించారు.

చంద్రబాబు దిగ్భ్రాంతి, కలెక్టర్‌కు ఫోన్

చంద్రబాబు దిగ్భ్రాంతి, కలెక్టర్‌కు ఫోన్

ప్రమాద ఘటనపై సీఎం చంద్రబాబు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. జిల్లా కలెక్టర్‌కు ఫోన్ చేశారు. వివరాలు తెలుసుకున్నారు. ఎంత రాత్రి అయినా గల్లంతైన వారి కోసం వెతకాలని ఆదేశించారు.

చినరాజప్ప దిగ్భ్రాంతి

చినరాజప్ప దిగ్భ్రాంతి

బోటు ప్రమాదంపై ఉప ముఖ్యమంత్రి చినరాజప్ప దిగ్బ్రాంతి వ్యక్తం చేశారు. ప్రమాదం ఘటన తెలియగానే ఎన్టీఆర్ఎఫ్ సిబ్బంది సహాయక చర్యలు ప్రారంభించిందని చెప్పారు.

ఘటనపై విచారణకు ఆదేశించిన అఖిలప్రియ

ఘటనపై విచారణకు ఆదేశించిన అఖిలప్రియ

బోటు ప్రమాదంపై పర్యాటక శాఖ మంత్రి భూమా అఖిలప్రియ విచారణకు ఆదేశించారు. ప్రమాదం జరగ్గానే తొలుత పదిమంది సురక్షితంగా ఒడ్డుకు చేరుకున్నారు. ఆ తర్వాత పలువురిని స్విమ్మర్స్ రక్షించారు. మృతుల్లో ఏడుగురు మహిళలు ఉన్నారు.

English summary
At least 14 were feared dead after a boat carrying 38 people on board capsized at at Pavitra Sangamam ghat in river Krishna on Sunday.Initial reports say that the death toll has already reached 14 and 12 people were either rescued by local fishermen or swam across.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X