విజయవాడ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

బురదలో చిక్కుకోవచ్చు, స్కూబా డైవింగ్: రేటు తక్కువ ప్రాణాల మీదకు తెచ్చింది

విజయవాడ బోటు ప్రమాదం ప్రాంతంలో ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్, ఫైర్ సిబ్బంది పాల్గొన్నారు. ఘటన స్థలి వద్ద ఒండ్రు మట్టి అధికంగా ఉండటంతో గల్లంతైన కొందరు బురదలో చిక్కుకొని ఉంటారని భావించారు.

|
Google Oneindia TeluguNews

విజయవాడ: విజయవాడ బోటు ప్రమాదం ప్రాంతంలో ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్, ఫైర్ సిబ్బంది పాల్గొన్నారు. ఘటన స్థలి వద్ద ఒండ్రు మట్టి అధికంగా ఉండటంతో గల్లంతైన కొందరు బురదలో చిక్కుకొని ఉంటారని భావించారు.

బోటు ప్రమాదంలో కొత్త కోణాలు: నిలిపేసినా.. ఎన్నో షాకింగ్ విషయాలుబోటు ప్రమాదంలో కొత్త కోణాలు: నిలిపేసినా.. ఎన్నో షాకింగ్ విషయాలు

స్కూబా డైవింగ్

స్కూబా డైవింగ్

దీంతో ఫైర్ అధికారులు స్కూబా డైవింగ్ ఏర్పాట్లు చేశారు. ఇందులో భాగంగా స్కూబా డైవర్స్ నదీ గర్భంలో నుంచి వెళ్లి వెతకనున్నారు. ఈ ఆపరేషన్‌ను ఫైర్ సర్వీసెస్ డీజీ సత్యనారాయణ పర్యవేక్షిస్తున్నారు.

పర్యటనకు తీసుకొచ్చిన వ్యక్తి మృత్యువాత

పర్యటనకు తీసుకొచ్చిన వ్యక్తి మృత్యువాత

బోటు ప్రమాదంలో ప్రకాశం జిల్లా ఒంగోలుకు చెందిన బీజేపీ నేతలు ప్రభాకర్ రెడ్డి, కోటేశ్వర రావులు మృతి చెందారు. ప్రభాకర్ రెడ్డి వాకర్స్ అసోసియేషన్ కోశాధికారి. అతనే వాళ్లను ఈ పర్యటనకు తీసుకువచ్చారు. ప్రమాదంలో ప్రభాకర్ రెడ్డి సతీమణి శ్రీలక్ష్మి ప్రాణాలతో బయటపడ్డారు.

 అసలు బోటింగ్ మానేద్దామనుకున్నారు కానీ

అసలు బోటింగ్ మానేద్దామనుకున్నారు కానీ

ఒంగోలు వాకర్స్ అసోసియేషన్ వారు తొలుత బోటింగ్ మానేద్దామనుకున్నారని తెలుస్తోంది. తొలుత షికారుకు రూ.500 అని చెప్పడంతో వద్దనుకున్నారు. దీంతో బోటువాడు ఒక్కొక్కరికి రూ.300 అని చెప్పడంతో వారు తిరిగి బోటులో ఎక్కారని తెలుస్తోంది.

 చివర కూర్చొని బతికిపోయారు

చివర కూర్చొని బతికిపోయారు

బోటులో కొందరు ప్రయాణీకులు చివర కూర్చొని బతికి బయటపడ్డారు. ప్రకాశం జిల్లా ఇంకొల్లుకు చెందిన వాకర్స్ క్లబ్ సభ్యుడు వెంకటేశ్వర రావు బోటులో చివరన కూర్చున్నారు. బోటు తిరగబడగానే ఆయన, అతని భార్య కడ్డీ పట్టుకొని బోటు పైకి ఎక్కారు. ఆ తర్వాత వారిని సిబ్బంది వచ్చి కాపాడారు.

ఆ ప్రాంతం నుంచి వెళ్లకూడదు

ఆ ప్రాంతం నుంచి వెళ్లకూడదు

రూట్ మ్యాప్ ప్రకారం బోటు ప్రమాదం జరిగిన ప్రాంతం వైపు వెళ్లకూడదు. బోడు డ్రైవర్‌గా ఉన్న వ్యక్తి గతంలో ఎప్పుడు అటువైపు బోడు నడపలేదు. దీంతో ఈ ప్రమాదం జరిగింది. అసలు బోటుకు కూడా అనుమతి లేదని విజయవాడ సిటీ కమిషనర్ గౌతమ్ సవాంగ్ తెలిపారు. బోటుకు సర్టిఫికేట్ లేదు. కాగా ఈ ప్రమాదంలో ఇప్పటి వరకు 20 మంది చనిపోయినట్లుగా తెలిసింది. సోమవారం మధ్యాహ్నం మరో మహిళ మృతదేహాన్ని వెలికి తీశారు.

English summary
Altogether, 38 people were on the boat, which belonged to a private tourism company. Sources said the boat did not have a licence to operate.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X