వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

బాండు రాసిస్తా... ఒక్క అవకాశం ఇవ్వండి... బోటు పైకి తీస్తా....! మరోసారి మీడియా ముందుకు వచ్చిన శివ

|
Google Oneindia TeluguNews

గోదావరి బోటు ప్రమాదం జరిగి పదిరోజులు గడిచిపోతుంది. ఇంకా పదమూడు మంది అడ్రస్ ఎక్కడ ఉందో తెలియని పరిస్థితి.. ప్రమాద భారిన పడినవారు బోటులోనే చిక్కుకునే ఉన్నారన్న అనుమానాల నేపథ్యంలో దాన్ని బయటకు తీసేందుకు అనేక ఆటంకాలు ఎదురవుతున్నాయి. ప్రతికూల పరిస్థితుల నేపథ్యంలోనే సహాయక చర్యలు చేపట్టిన ఎన్డీఆర్ఎఫ్, నేవీ బృందాలు వెనక్కి వెళ్లాయి. అత్యాధునిక సాంకేతికను ఉపయోగించి తీసుకువచ్చే ప్రయత్నాలకు రహాదారి అడ్డుగా మారింది. దీంతో చేసేదేమీ లేక అధికారులు సహయక చర్యలను నిలిపి వేసిన పరిస్థితి నెలకోంది.

మళ్లీ మీడియా ముందుకు వచ్చిన శివ

మళ్లీ మీడియా ముందుకు వచ్చిన శివ

కాని మునిగిపోయిన బోటును సాంప్రదాయక పద్దతుల్లో బయటకు తీసుకువస్తానని ఇదివరకే పశ్చిమగోదావరి జిల్లాకు చెందిన శివ అనే వ్యక్తి ప్రకటించాడు. అయితే అధికారులు మాత్రం శివ మాటలను పట్టించుకోలేదు. కాని శివ మాత్రం మరోసారి మీడియా ముందుకు వచ్చాడు. ఇప్పటికైన బోటను బయటకు తీస్తానని బల్లగుద్ది చెబుతున్నాడు. ఇందుకోసం తాను మరికొద్ది మంది సహాకారంతో దీనికి పూనుకుంటానని చెబుతున్నాడు. అధికారులు తనకు ఒక అవకాశం ఇవ్వాలని మీడియా ముఖంగా కోరుతున్నాడు.

ప్రామిసరీ నోటుపై రాసిస్తా...

ప్రామిసరీ నోటుపై రాసిస్తా...

ఇందుకోసం అవసరమైతే తన ప్రాణాలను సైతం అడ్డువేస్తానని చెబుతున్న శివ..అధికారులకు నమ్మకం లేకపోతే ప్రామిసరీ నోటు మీద రాసిస్తానని చెప్పాడు. 300 అడుగుల లోతుల ఉన్న బోటును ముందుగా సుడిగుండాలు లేని ప్రాంతానికి తీసుకురావడం ద్వార బోటు అతి ఈజిగా బయటకు తీసుకురావచ్చని చెబుతున్నాడు. కాగా శివ సూచించిన సాంప్రదాయా పద్దతి వల్ల మరో ప్రమాదం జరిగే అవకాశం ఉందని అధికారులు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు.

ఎలాంటీ భయం అవసరం లేదంటున్న శివ

ఎలాంటీ భయం అవసరం లేదంటున్న శివ

అయితే శివమాత్రం ఎలాంటీ ఇబ్బంది లేదని చెబుతున్నాడు. తాను రెండు గంటల్లో బోటును బయటకు తీసుకువస్తానని సవాల్ విసురుతున్నాడు. తనకు సాంప్రదాయ పద్దతిలో కావాల్సిన మెటీరియల్ ఇవ్వడంతో పాటు నీటీలో అనుభవం తన సోదరుడు, మరో 10 మంది సపోర్టుతో బోటును బయటకు తీస్తానని ఓ ప్రముఖ టీవీ చానల్‌కు ఇచ్చిన ఇంటర్యూలో మ్యాప్‌ ద్వార వెళ్లడించాడు. కాగా బోటు ప్రమాదం తర్వాత అయిల్ మరకల ద్వార బోటును గుర్తించిన విషయాన్ని కూడ శివ గతంలో చెప్పాడు.

ఆచూకి లభించని మరో 13 మంది మృతదేహాలు

ఆచూకి లభించని మరో 13 మంది మృతదేహాలు

ప్రమాద సమయంలో బోటులో 8 మంది సిబ్బందితోపాటు ముగ్గురు పిల్లలతో సహా మొత్తం 75 మంది ఉన్నారని పోలీసులు చెప్పారు. వీరిలో 26 మంది ప్రాణాలతో బయటపడగా.. ఇప్పటి వరకు 36 మృతదేహాలను బయటకు తీశారు. కాగా మరో 13 మంది ఆచూకీ తెలియలేదు. బోటులోనే వారి డెడ్‌బాడీలు చిక్కుకొని ఉంటాయని అంచనా వేస్తుండగా రోజుకో శవం బయటపడుతోంది. మరోవైపు ప్రమాద స్థలంలో ఎడతెరిపిలేని వర్షం కురుస్తుండడతో గాలింపు చర్యలకు బ్రేక్ వేశారు.

English summary
The boat which was Drown in Godavari river will be taken out with the traditional way with in two hours once again Shiva said.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X