చిత్తూరు వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

తగ్గేది లేదు!: చంద్రబాబుకు బొజ్జల, శివప్రసాద్ ఝలక్, ఎంపీ పార్టీ వీడేనా?

తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు, ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు చిత్తూరు జిల్లా పార్టీ నేతలతో సమావేశమయ్యారు. ఈ సమావేశానికి చిత్తూరు ఎంపీ శివప్రసాద్, మాజీ మంత్రి బొజ్జల గైర్హాజరయ్యారు.

|
Google Oneindia TeluguNews

చిత్తూరు: తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు, ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు చిత్తూరు జిల్లా పార్టీ నేతలతో సమావేశమయ్యారు. ఈ సమావేశానికి చిత్తూరు ఎంపీ శివప్రసాద్, మాజీ మంత్రి బొజ్జల గోపాలకృష్ణా రెడ్డి గైర్హాజరయ్యారు.

బండారం బయటపెడ్తా, రెడ్డి స్త్రీని పెళ్లాడావేం: శివప్రసాద్‌కు బుద్ధా హెచ్చరికబండారం బయటపెడ్తా, రెడ్డి స్త్రీని పెళ్లాడావేం: శివప్రసాద్‌కు బుద్ధా హెచ్చరిక

జిల్లాలో పార్టీ పరిస్థితి, అభివృద్ధి కార్యక్రమాలు, జిల్లాలో నాయకుల మధ్య విభేదాలపై సమావేశంలో చర్చించారు. ఇలాంటి కీలకమైన సమావేశానికి జిల్లాలో ముఖ్య నేతలైన బొజ్జల, శివప్రసాద్‌ గైర్హాజరు కావడం చర్చనీయాంశమైంది. మొత్తానికి జిల్లాలో చంద్రబాబుకు పెద్ద తలనొప్పి వచ్చింది. వారు తమ ఆగ్రహాన్ని వీడలేదనని మరోసారి అర్థమయిందంటున్నారు.

అందుకే బొజ్జల అలక

అందుకే బొజ్జల అలక

ఇటీవల ఏపీ మంత్రివర్గ పునర్‌వ్యవస్థీకరణలో తనను మంత్రివర్గం నుంచి తొలగించడం పట్ల బొజ్జల గోపాలకృష్ణా రెడ్డి అలక వహించారు. ఆ తర్వాత ఆయన పెద్దగా మాట్లాడలేదు.

బొజ్జల ఆవేదన

బొజ్జల ఆవేదన

కొద్ది రోజుల క్రితం మాట్లాడుతూ.. తన ఆరోగ్యం దృష్ట్యానే చంద్రబాబు మంత్రి పదవి నుంచి తప్పించారని అన్నారు. తన కొడుకు రాజకీయ జీవితంపై మాట్లాడుతూ.. వారసత్వం వల్ల రాజకీయాల్లో మనలేరని అభిప్రాయపడ్డారు.

చంద్రబాబుపై శివప్రసాద్ విమర్శలు

చంద్రబాబుపై శివప్రసాద్ విమర్శలు

ఇక, అంబేడ్కర్‌ జయంతి సందర్భంగా చిత్తూరు ఎంపీ శివప్రసాద్‌ ముఖ్యమంత్రి చంద్రబాబుపై, టిడిపిపై బహిరంగంగా తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు.

శివప్రసాద్‌కు కౌంటర్

శివప్రసాద్‌కు కౌంటర్

శివప్రసాద్ వ్యాఖ్యలపై చంద్రబాబు కూడా పరోక్షంగా ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆయనకు మంత్రులు కూడా కౌంటర్ ఇచ్చారు. దళితులకు చంద్రబాబే ప్రాధాన్యం ఇస్తున్నారని నేతలు చెప్పారు. శివప్రసాద్ మాత్రం ప్రత్యక్షంగా, పరోక్షంగా పార్టీపై విమర్శలు చేశారు.

శివప్రసాద్ వైసిపిలో చేరుతారా

శివప్రసాద్ వైసిపిలో చేరుతారా

శివప్రసాద్ వైయస్సార్ కాంగ్రెస్ పార్టీలోకి వెళ్తారనే ఊహాగానాలు కూడా వినిపించాయి. టిడిపి తనను పట్టించుకోకపోవడంతో ఆయన వైసిపిలోకి వెళ్లి 2019లో చిత్తూరు ఎంపీగా పోటీ చేయవచ్చునని అంటున్నారు. వచ్చే ఎన్నికల్లోను తాను చిత్తూరు ఎంపీనే అని, కానీ ఏ పార్టీ నుంచో మాత్రం అప్పుడే చెప్పలేనని ఇప్పటికే శివప్రసాద్ అన్నారు.

English summary
Former Minister Bojjala Gopalakrishna Reddy and MP Sivaprasad on Tuesday gave shock to TDP chief Nara Chandrababu Naidu.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X