చిత్తూరు వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

తిరుపతిలోని అలిపిరి వద్ద బాంబు కలకలం... పోలీసుల విస్తృత తనిఖీలు

By Nageswara Rao
|
Google Oneindia TeluguNews

చిత్తూరు: హిందువుల పవిత్ర పుణ్యక్షేత్రం తిరుమల తిరుపతి దేవస్ధానం. అలాంటి తిరుపతిలో అలిపిరి వద్ద బాంబు పేలొచ్చనే సమాచారంతో పోలీసులు అప్రమత్తమయ్యారు. శ్రీలంక అధ్యక్షుడు మహేంద్ర రాజపక్సే వెళ్లిన కొన్ని గంటల్లోనే అలిపిరి వద్ద బాంబు పేలే అవకాశం ఉందని సమాచారం రావడంతో పోలీసులు విస్తృత తనిఖీలు చేపట్టారు.

ఈ విషయాన్ని ఆంధ్రప్రదేశ్ హోం మంత్రి నిమ్మకాయల చినరాజప్ప స్పష్టం చేసారు. తిరుమలతో పాటు తిరుపతి, అలిపిరి చెక్ పోస్టులో నాలుగు బాంబు స్వ్కాడ్‌లతో తనిఖీలు పోలీసులు నిర్వహిస్తున్నారని హోం మంత్రి తెలిపారు. ఉన్నాతాధికారుల సమావేశాలతోనే తనిఖీలు నిర్వహిస్తున్నట్లు పోలీసులు చెబుతున్నారు. తమిళనాడు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో తీవ్రవాదులు, మావోయిస్టులు బాంబు దాడులకు పాల్పడే ప్రమాదం ఉందని ఇంటెలిజెన్స్ బ్యూరో హెచ్చరించింది.

Bomb threat at alipiri in tirupati chittoor district

ఈనేపథ్యంలో తిరుమలలోని అలిపిరి వద్ద బాంబులు పేలే ప్రమాదం ఉందని, తమకు విశ్వసనీయ సమాచారం ఉందని కర్ణాటక డీజీపీ ఆంధ్రప్రదేశ్ పోలీసులను హెచ్చరించారు. అనుమానాస్పదంగా కనిపించిన ప్రతి వ్యక్తిని, వస్తువుని క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారు.

రోడ్డు ప్రమాదంలో తండ్రీ కొడుకులు మృతి

రోడ్డు ప్రమాదంలో తండ్రీ కొడుకులు మృతి చెందిన ఘటన మహబూబ్ నగర్ జిల్లా వంగూరు మండలంలోని తురకపల్లి, చారగొండ రహదారిపై చోటుచేసుకుంది. తురకపల్లికి చెందిన వెంకటయ్య (40), అతడి కుమారుడు సాయికృష్ణ (10) ద్విచక్ర వాహనంపై వెళ్తుండగా వీరిని లారీ ఢీకొట్టింది. దీంతో వీరు తీవ్ర గాయాలపాలై అక్కడిక్కడే మృతి చెందారు.

English summary
Bomb threat at alipiri in tirupati chittoor district
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X