వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

గుడివాడ కోర్టుకు బాంబు బెదిరింపు: న్యాయవాదుల పరుగు, బాంబు స్వ్కాడ్ తనిఖీలు

|
Google Oneindia TeluguNews

కృష్ణా: జిల్లాలోని గుడివాడ కోర్టుకు బుధవారం బాంబు బెదిరింపులు వచ్చాయి. దీంతో భయాందోళనలకు గురైన న్యాయవాదులు కోర్టు నుంచి బయటికి పరుగులు తీశారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు.

మచిలీపట్నం నుంచి వచ్చిన బాంబు స్క్కాడ్ కోర్టు ఆవరణలో తనిఖీలు చేపట్టింది.

Bomb threateing call to Gudiwada Court

కిడ్నాపైన డిగ్రీ విద్యార్థి క్షేమం

కిడ్నాప్‌కు గురైన డిగ్రీ విద్యార్థి కృష్ణారెడ్డి క్షేమంగా బయటపడ్డాడు. రెండు రోజుల క్రితం బస్టాండ్ దగ్గర కృష్ణారెడ్డిని దుండగులు కిడ్నాప్ చేశారు. కృష్ణారెడ్డికి గుండు గీయించిన కిడ్నాపర్లు సిగరెట్లతో కాల్చి చిత్రహింసలకు గురిచేశారు. కిడ్నాపర్ల నుంచి తప్పించుకొన్న విద్యార్థి పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు. కృష్ణారెడ్డి గుత్తి మండలం తొండపాడు వాసి.

రైతు ఇంట్లో పట్టపగలు చోరీ

కృష్ణా జిల్లా వత్సవాయి మండలంలోని చిట్యాలలో బుధవారం ఈ ఘటన జరిగింది. వ్యవసాయ పనుల నిమిత్తం తాము పొలానికి వెళ్లామని, పనుల అనంతరం ఇంటికి వచ్చి చూస్తే సామానులన్నీ చిందరవందరగా పడి ఉన్నాయని పాపిరెడ్డి అనే రైతు ఆవేదన వ్యక్తం చేశాడు. దాదాపు రూ. 10 లక్షల విలువైన నగలను దొంగలు అపహరించారని బాధిత రైతు పోలీసులకు ఫిర్యాదు చేశాడు.

English summary
Bomb threateing call to Gudiwada Court on Wedensday.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X