అనంతపురం వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

టీడీపీకి షాక్: తాడిపత్రి జగ్గీ బ్రదర్స్ పార్టీకి గుడ్ బై, జేసీ బ్రదర్స్‌తో విభేదాలే కారణమా?

|
Google Oneindia TeluguNews

అనంతపురం: తాడిపత్రిలో తెలుగుదేశం పార్టీకి పెద్ద షాక్ తగిలింది. సీనియర్ నేతలుగా కొనసాగుతున్న బొమ్మిరెడ్డి జగదీశ్వర్ రెడ్డి, 23వ వార్డు కౌన్సిలర్ జయచంద్రారెడ్డి(వీరిని స్థానికంగా జగ్గీ బ్రదర్స్ అని పిలుచుకుంటారు) టీడీపీకి రాజీనామా చేశారు.

పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్నారంటూ జిల్లా అధిష్టానం నెల రోజుల క్రితం జగ్గీ బ్రదర్స్ షోకాజ్ నోటీసులు జారీ చేసింది. దీంతో జగ్గీ బ్రదర్స్ జూన్ 20న వివరణ ఇచ్చారు.

మనస్తాపం చెంది రాజీనామాలు

మనస్తాపం చెంది రాజీనామాలు

అయితే, సంజాయిషీ సంతృప్తికరంగా లేదంటూ జగ్గీ బ్రదర్స్‌ను పార్టీ నుంచి సస్పెండ్ చేసినట్లు అధ్యక్షుడి పేరుతో ఉన్న ఉత్తర్వులు సోషల్ మీడియాలో చక్కర్లు కొట్టాయి. ఈ క్రమంలో కొంత మనస్తాపానికి గురైన జగదీశ్వర్ రెడ్డి, జయచంద్రారెడ్డిలు టీడీపీకి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. దీంతో వీరితోపాటు మరికొందరు కూడా టీడీపీని వీడే అవకాశాలున్నట్లు ప్రచారం జరుగుతోంది.

 జేసీ బ్రదర్స్ కంటే ముందు నుంచీ..

జేసీ బ్రదర్స్ కంటే ముందు నుంచీ..


కాగా, 1993 నుంచి జగదీశ్వర్ రెడ్డి, జయచంద్రా రెడ్డిలు టీడీపీలోనే కొనసాగుతున్నారు. గత కొంత కాలం క్రితం(2014) టీడీపీలో చేరిన జేసీ దివాకర్ రెడ్డి, జేసీ ప్రభాకర్ రెడ్డి సోదరులతో వీరికి విభేదాలున్నాయి. అయితే, టీడీపీలో చేరడంతో జగ్గీ బ్రదర్స్.. జేసీ సోదరులతో కలిసి పనిచేశారు.

జేసీ ప్రభాకర్ పావులు కదపడంతో..

జేసీ ప్రభాకర్ పావులు కదపడంతో..

ఈ క్రమంలో 23వ వార్డు కౌన్సిలర్‌గా జయచంద్రారెడ్డి ఎన్నికయ్యారు. మరో వైపు జగదీశ్వర్ రెడ్డికి మార్కెట్ యార్డ్ పదవి విషయంలో జిల్లా నాయకుల మద్దతు లభించింది. అయితే, ఆయనకు మార్కెట్ యార్డు పదవి దక్కకుండా జేసీ ప్రభాకర్ రెడ్డి పావులు కదిపారని ప్రచారంలో ఉంది. దీంతో మరోసారి జగ్గీ-జేసీ బ్రదర్స్ మధ్య దూరంగా పెరిగినట్లయింది.

Recommended Video

‘ఫిరాయింపు ఎమ్మెల్యేలు పశువులతో సమానం’
జేసీ బ్రదర్స్ వర్సెస్ జగ్గీ బ్రదర్స్

జేసీ బ్రదర్స్ వర్సెస్ జగ్గీ బ్రదర్స్

ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్ రెడ్డి, అతని అనుచరుడు ఎస్వీ రవీంద్రారెడ్డి అవినీతికి పాల్పడుతున్నారంటూ జయచంద్రారెడ్డి ఆరోపించారు. దీంతో జయచంద్రారెడ్డిని మూడు నెలలపాటు కౌన్సిల్ నుంచి సస్పెండ్ చేశారు. ఆ తర్వాత కూడా జేసీ బ్రదర్స్‌పై ఆరోపణలు, విమర్శలు కొనసాగించారు జగ్గీ బ్రదర్స్. ఈ నేపథ్యంలో జేసీ బ్రదర్స్ పార్టీ అధిష్టానంపై ఒత్తిడి పెంచి జగ్గీ బ్రదర్స్‌ను పార్టీకి దూరం చేశారని వాదనలు వినిపిస్తున్నాయి. కాగా, జగ్గీ బ్రదర్స్ వైయస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరతారనే ప్రచారం జరుగుతోంది. దీనిపై వారు ఎలాంటి ప్రకటనా చేయలేదు.

జేసీ బ్రదర్స్ నుంచి ప్రాణహాని

జేసీ బ్రదర్స్ నుంచి ప్రాణహాని

జేసీ బ్రదర్స్ నుంచి తమకు ప్రాణహాని ఉందని జగ్గీ బ్రదర్స్ చెప్పారు. వారు మంగళవారం మీడియాతో మాట్లాడుతూ.. తాడిపత్రిలో అరాచకం రాజ్యమేలుతోందని, జేసీ బ్రదర్స్ వందల కోట్ల అవినీతికి పాల్పడుతున్నారని ఆరోపించారు. జేసీ బ్రదర్స్ అక్రమాలను నిరూపిస్తామని అన్నారు. జేసీ ఫ్యామిలీ నుంచి తమ ఇద్దరికీ రక్షణ కల్పించాలంటూ చంద్రబాబు గతంలో సీఎంగా ఉన్న వైయస్సార్‌కు లేఖ కూడా రాశారని గుర్తు చేశారు. ఇకపై తాము జేసీ బ్రదర్స్ ఓటమే లక్ష్యంగా పనిచేస్తామని చెప్పారు.

English summary
Tadipatri leaders Bommireddy Jagadishwar Reddy and Jayachandra Reddy resigns to Telugudesam Party.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X