India
 • search
 • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

చెరో పెట్రోల్ డబ్బా తెచ్చుకుని తేల్చుకుందాం.. కొడాలి నానీ సవాల్ ను స్వీకరించిన బోండా ఉమ!!

|
Google Oneindia TeluguNews

కృష్ణాజిల్లా గుడివాడలో క్యాసినో నిర్వహణ వ్యవహారం చిలికి చిలికి గాలివానగా మారుతోంది. టిడిపి నిజనిర్ధారణ కమిటీ గుడివాడ పర్యటన నేపథ్యంలో చోటుచేసుకున్న ఘర్షణ మరింత ముదురుతుంది. ఇక క్యాసినో వ్యవహారంపై తనపై చేస్తున్న ఆరోపణలు నిరూపిస్తే పెట్రోల్ పోసుకుని ఆత్మహత్య చేసుకుంటా అన్న కొడాలి నాని సవాల్ కు బోండా ఉమా ధీటుగా జవాబిచ్చారు. తాను సిద్ధంగా ఉన్నానని చెప్పారు.

 క్యాసినో నిర్వహించినట్టు నిరూపిస్తే సూసైడ్ చేసుకుంటా: కొడాలి నాని

క్యాసినో నిర్వహించినట్టు నిరూపిస్తే సూసైడ్ చేసుకుంటా: కొడాలి నాని

గుడివాడ క్యాసినో వ్యవహారంపై టీడీపీ నేతల విమర్శల నేపధ్యంలో మంత్రి కొడాలి నాని క్యాసినో వ్యవహారంపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. క్యాసినోలు చంద్రబాబు కు, లోకేష్ కు మాత్రమే తెలుసు అని దుయ్యబట్టారు. చంద్రబాబుకు టైమ్ అయిపోయిందని ఎప్పుడూ గెలవని వర్ల రామయ్య ఎన్నికల్లో ఓడిపోయిన వాళ్ళందరితో కలిపి నిజ నిర్ధారణ కమిటీ వేశారని, ఆ కమిటీ ప్రశాంతంగా ఉన్న గుడివాడలో గొడవలు పెడుతున్నారని కొడాలి నాని ఆరోపించారు. సంక్రాంతికి రాష్ట్రంలో అన్ని చోట్ల జరిగినట్టే గుడివాడలోనూ జూదం జరిగిందని పేర్కొన్న కొడాలి నాని, మహిళలతో అశ్లీల నృత్యాలు చేస్తున్నారు అని తెలిసి తాను డి ఎస్ పి కి ఫోన్ చేసి ఆపించానని పేర్కొన్నారు. తాను క్యాసినో నిర్వహించినట్లు గా నిరూపిస్తే పెట్రోల్ పోసుకొని తగలబెట్టుకుంటా అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. రెండు వారాలుగా తను గుడివాడలోనే లేనని, తన కన్వెన్షన్ సెంటర్ లో క్యాసినో నిర్వహించినట్లు రుజువు చేస్తే రాజీనామా చేసి ఆత్మహత్య చేసుకుంటానని పేర్కొన్నారు.

కొడాలి నాని చేసిన సవాల్ కు బోండా ఉమ సై

కొడాలి నాని చేసిన సవాల్ కు బోండా ఉమ సై

కొడాలి నాని చేసిన సవాల్ కు టిడిపి నాయకుడు బోండా ఉమ సై అన్నారు. ఏ తప్పు చేయకుంటే నిజ నిర్ధారణ కమిటీ ని ఎందుకు అడ్డుకున్నారో మంత్రి కొడాలి నాని చెప్పాలని బోండా ఉమ ప్రశ్నించారు. కొడాలి నాని దొరికిపోయి ఇష్టమొచ్చినట్లు మాట్లాడుతున్నారని మండిపడ్డారు. తాను మంత్రి సవాల్ ను స్వీకరిస్తున్నా అని తెలిపిన బోండా ఉమా చెరో పెట్రోల్ డబ్బా తెచ్చుకుందామని క్యాసినో జరిగిందని మీడియా ముఖంగా నిరూపించేందుకు తాను సిద్ధమని చెప్పారు.

 ఆధారాలున్నాయి.. నిరూపిస్తా .. డేట్ టైం కొడాలి నాని ఫిక్స్ చేసినా పర్లేదు

ఆధారాలున్నాయి.. నిరూపిస్తా .. డేట్ టైం కొడాలి నాని ఫిక్స్ చేసినా పర్లేదు


కొడాలి నాని కి చెందిన కే కన్వెన్షన్ లోనే క్యాసినో నిర్వహించారని తమ వద్ద ఆధారాలున్నాయని ఆయన పేర్కొన్నారు. ఎప్పుడు రావాలో చెప్పాలని డేటు, టైము కొడాలి నాని ఫిక్స్ చేసిన సరేనంటూ సవాల్ విసిరారు. క్యాసినో జరగలేదంటే తాను పెట్రోలు పోసుకుని అందుకు సిద్ధంగా ఉన్నారంటూ బోండా ఉమా పేర్కొన్నారు. ఒకవేళ జరిగిందని నిరూపిస్తే కొడాలి నాని మంత్రి పదవికి రాజీనామా చేయాలని ఆయన డిమాండ్ చేశారు.

 కే కన్వెన్షన్ కి తనిఖీకి వెళితే వైసీపీ ప్రభుత్వం వణికిపోయింది

కే కన్వెన్షన్ కి తనిఖీకి వెళితే వైసీపీ ప్రభుత్వం వణికిపోయింది

క్యాసినోలో డాన్స్ చేసిన వారి పేర్లు కూడా తమ వద్ద ఉన్నాయని బోండా ఉమ చెప్పుకొచ్చారు. విక్టర్, శశిభూషణ్ వంటి వాళ్ళు డాన్సులు చేశారని బోండా ఉమా పేర్కొన్నారు. తాము కే కన్వెన్షన్ కి తనిఖీకి వెళితే వైసీపీ ప్రభుత్వం వణికిపోయిందని బోండా ఉమ పేర్కొన్నారు. ఇక మహిళల అర్థనగ్న నృత్యాలు జరిగాయని కొడాలి నాని తానే ఒప్పుకున్నారు అంటూ ఎద్దేవా చేశారు. కరోనా వచ్చిందని హైదరాబాద్ లో ఉంటే చేసిన తప్పులు ఒప్పులు అయిపోతాయా అంటూ ప్రశ్నించారు. కే కన్వెన్షన్ సెంటర్లో జరిగిన క్యాసినో చేసిన వీడియోలను మీడియాకు విడుదల చేసిన ఆయన కొడాలి నాని సవాల్ కు ప్రతి సవాల్ విసిరారు.

  #AndhraPradesh : Kodali Nani Vs Devineni Uma | Oneindia Telugu
   నానీ రెడీనా అంటున్న బోండా ఉమా.. కొడాలి నానీ ఏమంటారో?

  నానీ రెడీనా అంటున్న బోండా ఉమా.. కొడాలి నానీ ఏమంటారో?


  కొడాలి నాని సవాల్ ను స్వీకరించడానికి తాను సిద్ధంగా ఉన్నానని నాని రెడీనా అంటూ బోండా ఉమా ప్రశ్నించారు. ఈ వ్యవహారంలో తాజాగా బోండా ఉమా చేసిన వ్యాఖ్యలపై కొడాలి నాని ఏ విధంగా స్పందిస్తారు అనేది తెలియాల్సి ఉంది. మొత్తానికి సంక్రాంతి పండుగ సాక్షిగా గుడివాడ వేదికగా మొదలైన రగడ నేటికీ కొనసాగుతుంది.

  English summary
  Bonda Uma said he was ready to prove casino was operated at the Kodali Nani K Convention during Sankranthi. Bonda Uma told that he is ready to take kodali nani challenge.
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X