India
 • search
 • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

టీడీపీపై విషప్రచారం చెయ్యటం కొడాలి నాని పని; ఆ విషయంలో గిన్నిస్ రికార్డ్ మీదే: బోండా ఉమ  

|
Google Oneindia TeluguNews


టిడిపి ఎమ్మెల్యే అశోక్ బాబు అరెస్టుపై మంత్రి కొడాలి నాని చేసిన వ్యాఖ్యలకు టిడిపి నేత బోండా ఉమ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. తెలుగుదేశం పార్టీ పై విష ప్రచారం చేయడమే కొడాలి నాని పనిగా పెట్టుకున్నారని బోండా ఉమ విమర్శలు గుప్పించారు. రాష్ట్రాన్ని అప్పులలో అగ్రగామిగా నిలిపినందుకు ప్రభుత్వం గిన్నిస్ రికార్డు సాధిస్తుందని టిడిపి నేత బొండా ఉమా ఎద్దేవా చేశారు.

year ender 2021: ఏపీని కుదిపేసిన డ్రగ్స్ రచ్చ.. టీడీపీ వర్సెస్ వైసీపీ; ఆంధ్రప్రదేశ్ పై దేశవ్యాప్త చర్చyear ender 2021: ఏపీని కుదిపేసిన డ్రగ్స్ రచ్చ.. టీడీపీ వర్సెస్ వైసీపీ; ఆంధ్రప్రదేశ్ పై దేశవ్యాప్త చర్చ

క్యాసినో మంత్రి నానీపై కేసు ఎందుకు పెట్టలేదు

క్యాసినో మంత్రి నానీపై కేసు ఎందుకు పెట్టలేదు

మంత్రి కొడాలి నానికి తన శాఖలో ఉన్న తప్పులు, లెక్కలపై కనీస అవగాహన ఉందా అంటూ ప్రశ్నించారు. క్యాసినో పెట్టి, మహిళలతో అశ్లీల నృత్యాలు చేయించిన కొడాలి నానిపై కేసు ఎందుకు నమోదు చేయలేదని బోండా ఉమా ప్రశ్నించారు. కొడాలి నాని క్యాసినో వ్యవహారంలో విచారణ అధికారి ఏమయ్యారని? డీజీపీ గౌతమ్ సవాంగ్ ఎందుకు నోరు మెదపడం లేదని బోండా ఉమా ప్రశ్నించారు. ఇప్పటివరకు ఎందుకు చర్యలు తీసుకోలేదని ప్రశ్నించారు. వైసీపీ ప్రభుత్వానికి ప్రజలు బుద్ధి చెప్పే రోజులు త్వరలోనే ఉన్నాయని బోండా ఉమా అభిప్రాయం వ్యక్తం చేశారు.

 కమీషన్ల కోసం విశాఖలో అదానీకి వేలకోట్ల ఆస్తులు ముట్ట చెప్పారు

కమీషన్ల కోసం విశాఖలో అదానీకి వేలకోట్ల ఆస్తులు ముట్ట చెప్పారు

అంతేకాదు కమీషన్ల కోసం విశాఖలో అదానీకి వేలకోట్ల ఆస్తులు ముట్ట చెప్పారని టిడిపి నేత బోండా ఉమా ఆరోపణలు గుప్పించారు. జీవో 225 ద్వారా 75 గజాలకు పైగా ఉన్న ఇళ్ల స్థలాలలో లక్షల రూపాయలు వసూలు చేస్తున్నారని లేకపోతే ఇళ్లను జప్తు చేస్తామని నోటీసులు ఇస్తున్నారంటూ బోండా ఉమా ఆగ్రహం వ్యక్తం చేశారు. కొత్త జిల్లాల ఏర్పాటుపై ప్రజాభిప్రాయ సేకరణ చేయకుండా స్వార్థ రాజకీయ ప్రయోజనాల కోసం వైసీపీ సర్కార్ ఇష్టమొచ్చినట్టు వ్యవహరిస్తోందని బోండా ఉమా మండిపడ్డారు.

 దమ్ముంటే ఎన్టీఆర్ పేరు వద్దన్నట్లు ఆధారాలు ఉంటే చూపండి

దమ్ముంటే ఎన్టీఆర్ పేరు వద్దన్నట్లు ఆధారాలు ఉంటే చూపండి

వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాజకీయ ప్రయోజనాల కోసమే కొత్త జిల్లాల ఏర్పాటు జరిగిందని బోండా ఉమా పేర్కొన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళనలు కొనసాగుతున్నా సీఎం జగన్ ఎందుకు మాట్లాడడం లేదని బోండా ఉమా ప్రశ్నించారు. జిల్లాకు ఎన్టీఆర్ పేరు పెడితే టీడీపీ అడ్డుకుంటోందని కావాలని దుష్ప్రచారం చేస్తున్నారని బోండా ఉమ తెలిపారు. దమ్ముంటే ఎన్టీఆర్ పేరు వద్దన్నట్లు ఆధారాలు ఉంటే చూపాలని బోండా ఉమా సవాల్ విసిరారు.

  Devineni Uma MaheswaraRao Slams AP CM YS Jagan And YCP Government | Oneindia telugu
  కేంద్రం ముందు అప్పుల కోసం తల దించాల్సి వచ్చేదా?

  కేంద్రం ముందు అప్పుల కోసం తల దించాల్సి వచ్చేదా?

  రాష్ట్రంలో సంపద సృష్టించి ఉంటే, వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎంపీలు కేంద్రం ముందు అప్పుల కోసం తల దించాల్సి వచ్చేదా? అని బోండా ఉమా ప్రశ్నించారు. ఒకప్పుడు అభివృద్ధిలో దేశానికే ఆదర్శంగా ఉన్న ఏపీ పరువును వైసీపీ అప్పుల కోసం పణంగా పెడుతోందని బోండా ఉమ విమర్శలు గుప్పించారు. ప్రభుత్వ తప్పులపై ప్రశ్నించే వారిని అక్రమ అరెస్టులు చేయిస్తూ వైసేపీ అధికారాన్ని దుర్వినియోగం చేస్తోందని, డైవర్షన్ పాలిటిక్స్ చేస్తుందని మండిపడ్డారు.

  English summary
  Bonda Uma has targeted the YSRCP, claiming that Kodali Nani was spewing poison on the TDP and that the Guinness World Record for leading in debt of AP.
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X