• search
  • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

అదంతా పుకారే ... నేను సైకిల్ దిగేది లేదు అంటున్న బోండా ఉమా

|

ఏపీ రాజకీయ వర్గాలలో బొండా ఉమా రాజకీయ భవిష్యత్ పై ఆసక్తికర చర్చ జోరుగా సాగింది. ఫైర్‌బ్రాండ్ టిడిపి నాయకుడు, విజయవాడ తూర్పు మాజీ ఎమ్మెల్యే బోండా ఉమా త్వరలో టిడిపికి గుడ్ బై చెప్పే ఆలోచనలో ఉన్నట్టు పార్టీ వర్గాల్లో కూడా జోరుగా చర్చ జరిగింది .. ఇక ఉమా ఆగస్టులో అధికార వైయస్ఆర్సిపిలో చేరడానికి సిద్ధంగా ఉన్నారన్న టాక్ కూడా విన్పించింది . కానీ చంద్రబాబును కలినసిన బొండా ఉమా అబ్బే అదేమీ లేదు . అదంతా పుకారే అని తేల్చి పారేశారు .

కోడెల కొత్త పాట: నేను ఒక బాధితుడినే.. నాపై జరుగుతుంది కక్ష సాధింపే...

టీడీపీ ని టెన్షన్ పెట్టిన బొండా ఉమా పార్టీ మార్పు వార్తలు .. బుద్ధాతో రాయబారం నడిపిన చంద్రబాబు

టీడీపీ ని టెన్షన్ పెట్టిన బొండా ఉమా పార్టీ మార్పు వార్తలు .. బుద్ధాతో రాయబారం నడిపిన చంద్రబాబు

ఏపీలో అధికారం కోల్పోయిన టీడీపీలో ఆగస్ట్ నెల టెన్షన్ పెట్టింది . అందునా మంచి రోజులు కావటంతో చంద్రబాబుకు చిక్కులు తెచ్చి పెడతాయని చాలా మంది పార్టీ మారతారని భావించారు. కానీ చంద్రబాబు కీలక నేతలు పార్టీ వీడకుండా ఉండేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. ఇప్పటి వరకు నలుగురు రాజ్యసభ సభ్యు లు జంప్ చేస్తే.. ఇప్పుడు మాజీలు కూడా ఇదే బాటలో కొనసాగుతున్నారు. బెజవాడ సెంట్రల్ నియోజకవర్గానికి చెందిన ఫైర్ బ్రాండ్ బొండా ఉమామహేశ్వరరావు కూడా పార్టీ మారేందుకు రంగం సిద్ధం చేసుకున్నారని జోరుగానే ప్రచారం జరిగింది . ఇప్పటికే ఆయన పార్టీ మార్పుపై ఊహాగానాలు పెద్ద ఎత్తున వచ్చాయి . పార్టీలో అంతర్గత విభేదాలతోనే ఆయన పార్టీ మార్పు నిర్ణయం తీసుకున్నారని పార్టీ వర్గాల్లోనూ చర్చ జరిగింది . టీడీపీ లో బలమైన గళాన్ని వినిపించి రాజకీ యంగా సంచలనాలు సృష్టించారు బొండా ఉమా . వివాదాలకు, వివాదాస్పద వ్యాఖ్యలకు కూడా ఆయన కేర్ ఆఫ్ అడ్రెస్ అని చెప్పొచ్చు . ఇక అలాంటి ఉమా పార్టీ మారితే పార్టీకి చాలా నష్టం అని భావించి బుద్దా వెంకన్నతో రాయబారం నడిపారు చంద్రబాబు . బుద్దా దౌత్యం ఫలించి చంద్రబాబును కలిశారు బొండా ఉమా .

బాబును కలిసిన బొండా ఉమా .. చంద్రబాబు బుజ్జగింపుతో చల్లబడ్డ బొండా ఉమా

బాబును కలిసిన బొండా ఉమా .. చంద్రబాబు బుజ్జగింపుతో చల్లబడ్డ బొండా ఉమా

ఇక బాబుతో భేటీ తర్వాత బొండా ఉమా సంచలన వ్యాఖ్యలు చేశారు. మీడియాతో మాట్లాడుతూ బొండా ఉమా తాను విదేశాల్లో ఉన్న సమయంలో తనపై దుష్ప్రచారం చేశారని పేర్కొన్న ఆయన , ఇప్పటికీ తనపై సామాజిక మాధ్యమాల్లో దుష్ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. గత ఎన్నికల తర్వాత తనకు చాలా పార్టీల నుంచి పిలుపులు అందాయని, కానీ తాను టీడీపీలోనే కొనసాగుతానని స్పష్టం చేశారు. సైకిల్ దిగేదే లేదు అని తేల్చి చెప్పారు. తాను ఇండియాలో లేని సమయంలో లేనిపోని వదంతులు పుట్టించారని, పార్టీ మారేవాడ్నే అయితే ఇప్పుడు చంద్రబాబు ఇంటికి ఎందుకు వస్తానని ఉమ ప్రశ్నించారు.

విజయవాడ సెంట్రల్ లో హాట్ టాపిక్ గా మారిన బొండా ఉమా వ్యవహారం

విజయవాడ సెంట్రల్ లో హాట్ టాపిక్ గా మారిన బొండా ఉమా వ్యవహారం

బోండా ఉమా కాపు వర్గానికి చెందిన నేత . సార్వత్రిక ఎన్నికల్లో విజయవాడ కేంద్ర నియోజకవర్గంలో కేవలం 15 ఓట్ల తేడాతో ఓడిపోయారు. బొండా ఉమా తో పాటు కాపు సామాజిక వర్గానికి చెందిన కొందరు నేతలు టిడిపిలో పరిస్థితి దారుణంగా ఉండటంతో పార్టీ మార్పు ఆలోచనలో ఉన్నారని వార్తలు వచ్చాయి . అదే కనుక జరిగితే విజయవాడ తూర్పులో వైయస్ఆర్సిపి వ్యవహారాలను నిర్వహించడంలో ఆయనకు కీలక పాత్ర లభిస్తుందని ఆయన అనుచరులు కూడా భావించారు . ఏది ఏమైనా టీడీపీలో కీలకంగా వ్యవహరించిన కాపు నేత బొండా ఉమా పార్టీ మారతారని అంతా ఊహిస్తే అలాంటిదేమీ లేదు.. ఇదంతా దుష్ప్రచారం అని తేలికగా కొట్టిపారేశారు బొండా ఉమా .

English summary
After meeting with Babu, Bonda Uma made sensational comments. Speaking to the media, Bonda Uma said that the rumors spread about his party change while he was abroad, and said He has received calls from many parties since the last election but made it clear that he would remain in the TDP. He said that he don't want to leave TDP.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X