వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

బాబుకు బై బై చెప్పే యోచనలో బోండా ఉమా .. వైసీపీలో చేరతారా ?

|
Google Oneindia TeluguNews

ఇప్పుడు ఏపీ రాజకీయ వర్గాలలో బొండా ఉమా రాజకీయ భవిష్యత్ పై ఆసక్తికర చర్చ జోరుగా సాగుతుంది. ఫైర్‌బ్రాండ్ టిడిపి నాయకుడు, విజయవాడ తూర్పు మాజీ ఎమ్మెల్యే బోండా ఉమా త్వరలో టిడిపికి గుడ్ బై చెప్పే ఆలోచనలో ఉన్నట్టు పార్టీ వర్గాల్లో జోరుగా చర్చ జరుగుతుంది .. ఇక ఉమా ఆగస్టులో అధికార వైయస్ఆర్సిపిలో చేరడానికి సిద్ధంగా ఉన్నారన్న టాక్ వినిపిస్తుంది.

 టీడీపీలో జపింగుల పర్వం.. టీడీపీకి గుడ్ బై చెప్పే ఆలోచనలో బోండా ఉమా

టీడీపీలో జపింగుల పర్వం.. టీడీపీకి గుడ్ బై చెప్పే ఆలోచనలో బోండా ఉమా

ఏపీలో అధికారం కోల్పోయిన టీడీపీలో జపింగుల పర్వం ఆగస్ట్ నెలలో బాగానే ఉండేలా కనిపిస్తుంది . ఇప్పటి వరకు నలుగురు రాజ్యసభ సభ్యు లు జంప్ చేస్తే.. ఇప్పుడు మాజీలు కూడా ఇదే బాటలో కొనసాగుతున్నారు. బెజవాడ సెంట్రల్ నియోజకవర్గానికి చెందిన ఫైర్ బ్రాండ్ బొండా ఉమామహేశ్వరరావు కూడా పార్టీ మారేందుకు రంగం సిద్ధం చేసుకున్నారని తెలుస్తుంది . ఇప్పటికే ఆయన పార్టీ మార్పుపై ఊహాగానాలు వెలువడుతున్నాయి. పార్టీలో అంతర్గత విభేదాలతోనే ఆయన పార్టీ మార్పు నిర్ణయం తీసుకున్నారని అంటున్నారు. టీడీపీ లో బలమైన గళాన్ని వినిపించి రాజకీ యంగా సంచలనాలు సృష్టించారు బొండా ఉమా . వివాదాలకు, వివాదాస్పద వ్యాఖ్యలకు కూడా ఆయన కేర్ ఆఫ్ అడ్రెస్ అని చెప్పొచ్చు . ఇక భూకబ్జాల విషయంలో ప్రధానంగా వార్తల్లో నిలిచారు ఉమా.

 15 ఓట్ల తేడాతో ఓటమిపాలైన బొండా ఉమా .. పార్టీ మారాలనే నిర్ణయం

15 ఓట్ల తేడాతో ఓటమిపాలైన బొండా ఉమా .. పార్టీ మారాలనే నిర్ణయం

2017లో జరిగిన మంత్రి వర్గ విస్తరణలో ఆయన మంత్రి పదవిని ఆశించారు. అయితే అప్పట్లో ఆయనకు మంత్రి పదవి దక్కలేదు. దీంతో కినుక వహించారు. అయితే చంద్రబాబు ఆయనకు అడగకుండానే టీటీడీ బోర్డులో సభ్యుడిగా పదవిని అప్పగించారు. దీంతో కొంత ఉపశమనం పొందారు. ఇక తాజా ఎన్నికల్లో ఆయన సెంట్రల్ నియోజకవర్గం నుంచి తిరిగి పోటీ చేసినా.. అత్యంత స్వల్ప ఓట్ల తేడాతో అంటే 15 ఓట్ల తేడాతో మాత్రమే ఓటమి పాలయ్యారు. మల్లాది విష్ణు చేతిలో ఓటమి పాలయ్యారు బొండా ఉమా .. ఇక టీడీపీ లో ఉంటె తిప్పలు తప్పవు అని భావిస్తున్న బొండా ఉమా పార్టీ మార్పుపై నిర్ణయం తీసుకున్నారు.

ఆగస్ట్ నెలలో జగన్ ను కలిసే అవకాశం ... పార్టీ మార్పు పక్కానే అని సంకేతాలు

ఆగస్ట్ నెలలో జగన్ ను కలిసే అవకాశం ... పార్టీ మార్పు పక్కానే అని సంకేతాలు

బోండా ఉమా ప్రస్తుతం కుటుంబంతో కలిసి ఆస్ట్రేలియా పర్యటనలో ఉన్నారు . విదేశీ పర్యటనకు బయలుదేరే ముందు బొండా ఉమా తన శ్రేయోభిలాషులను మరియు అతని అనుయాయులను కలుసుకుని పార్టీ మార్పుపై చర్చించారని తెలుస్తుంది. వైయస్ జగన్ పట్ల తన విధేయతను చూపించేందుకు బొండా ఉమా సిద్దంగా ఉన్నారన్న ప్రచారం సైతం జరుగుతుంది. అంతా అనుకున్నట్లు జరిగితే, ఆగస్టు 5 న విజయవాడకు తిరిగి వచ్చిన తరువాత బొండా ఉమా జగన్‌ను కలవాలనే ఆలోచనలో ఉన్నారని సమాచారం . ఇక జగన్ పార్టీలో చేరటానికి సాధ్యం కాకుంటే బీజేపీలో చేరే చాన్స్ ఉందని ప్రచారం జరుగుతుంది.

విజయవాడ సెంట్రల్ లో హాట్ టాపిక్ గా మారిన బొండా ఉమా పార్టీ మార్పు ప్రచారం

విజయవాడ సెంట్రల్ లో హాట్ టాపిక్ గా మారిన బొండా ఉమా పార్టీ మార్పు ప్రచారం

బోండా ఉమా కాపు వర్గానికి చెందిన నేత . సార్వత్రిక ఎన్నికల్లో విజయవాడ కేంద్ర నియోజకవర్గంలో కేవలం 15 ఓట్ల తేడాతో ఓడిపోయారు. బొండా ఉమా తో పాటు కాపు సామాజిక వర్గానికి చెందిన కొందరు నేతలు టిడిపిలో పరిస్థితి దారుణంగా ఉండటంతో పార్టీ మార్పు ఆలోచనలో ఉన్నారని వార్తలు వస్తున్నాయి. అదే కనుక జరిగితే విజయవాడ తూర్పులో వైయస్ఆర్సిపి వ్యవహారాలను నిర్వహించడంలో ఆయనకు కీలక పాత్ర లభిస్తుందని ఆయన అనుచరులు భావిస్తున్నారు. ఏది ఏమైనా టీడీపీలో కీలకంగా వ్యవహరించిన కాపు నేత బొండా ఉమా ఇప్పుడు వైసీపీ వైపు మొగ్గు చూపుతూ బాబు కు బై బై చెప్పాలనే ఆలోచనలో ఉండటం ఇప్పుడు విజయవాడ సెంట్రల్ లో హాట్ టాపిక్

English summary
According to the strong ongoing buzz in the political circles, firebrand TDP leader and former Vijayawada MLA Bonda Uma is said to be bidding adieu to TDP soon. Apparently, Uma is all set to join the ruling YSRCP in August.Bonda Uma is currently on a family holiday in Australia. Before leaving for the tour, he is said to have met his well-wishers and his community leaders and discussed about shifting his loyalties to YS Jagan. If everything goes as planned, Uma will be meeting Jagan after he returns to Vijayawada on August 5th.Bonda Uma hails from the Kapu community. He lost the Vijayawada Central constituency with just 15 votes margin in the general elections. He and other senior leaders from the city are said to be miffed with TDP's not so encouraging stand on the Kapus and this prompted him to turn towards the YSRCP. He is expected to be given a key role in handling YSRCP's affairs in Vijayawada East soon after he bids a goodbye to Babu and shakes hands with Jagan.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X