• search
  • Live TV
అమరావతి వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  

రఘురామ అంశంలో జోగి సక్సెస్-చంద్రబాబు దగ్గర మాత్రం : పొలిటికల్ ట్రాప్ -మైలేజ్ ఎవరికి..!!

By Chaitanya
|

కరకట్ట రాజకీయం ఏపీలో హాట్ టాపిక్ గా మారింది. మాజీ ముఖ్యమంత్రి ...టీడీపీ అధినేత చంద్రబాబు నివాసం వద్ద జరిగిన ఘర్షణ రాజకీయ వివాదంగా మారింది. ఇందులో వైసీపీ నేతలే చంద్రాబు నివాసం వద్దకు వెళ్లటం తప్పని కొందరు వాదిస్తుంటే.. .మరి కొందరు టీడీపీ నేతలు తొలుత దాడికి దిగారంటూ ఆరోపణలు చేస్తున్నారు. ఇదే సమయంలో అనేక మంది మాజీ ముఖ్యమంత్రి నివాసం.. ప్రస్తుత సీఎం నివాసానికి కూత వేటు దూరంలో ఇదంతా జరుగుతుంటే పోలీసులు ఏం చేస్తున్నారనే ప్రశ్నలు మొదలయ్యాయి. అయితే, అసలు ఇదంతా రాజకీయ వ్యూహాల్లో భాగంగానే స్పష్టమవుతున్నాయి.

నాడు రఘురామ అంశం లో జగన్ ప్రశంసలు

నాడు రఘురామ అంశం లో జగన్ ప్రశంసలు


ఎమ్మెల్యే జోగి రమేష్ అసెంబ్లీ వేదికగా వైసీపీ ఎంపీ రఘురామ రాజు సీఎం జగన్ పైన చేసిన వ్యాఖ్యలను ప్రస్తావిస్తూ సీరియస్ అయ్యారు. ఆయన వ్యాఖ్యలను తప్పు బడుతూ ఫైర్ అయ్యారు. ఆ తరువాత తాను తప్పుగా ఏమైనా మాట్లాడితే రికార్డుల నుంచి తొలిగించాలని కోరారు. ఆ వెంటనే సభలోనే ఉన్న సీఎం జగన్ ఎమ్మెల్యే జోగికి థాంక్స్ చెప్పారు. అదే సమయంలో జోగి తన వ్యాఖ్యల్లో తప్పుంటే తొలిగించమని కోరటం పైన అభినందనలు తెలిపారు. సీఎంపైన అభిమానం చాటుకోవటంలో జోగి రమేష్ ఎప్పుడూ ముందు నిలుస్తున్నారు.

అయ్యన్న పైన అవకాశం వదులుకున్నారా

అయ్యన్న పైన అవకాశం వదులుకున్నారా

కానీ, ఇప్పుడు మాత్రం మాజీ మంత్రి అయ్యన్న పాత్రుడు చేసిన వ్యాఖ్యలకు నిరసనగా తాను చంద్రబాబు ఇంటి వద్ద నిరసన కోసమే వెళ్లానని ఎమ్మెల్యే జోగి రమేష్ చెబుతున్నారు. అయ్యన్న పాత్రుడు చేసిన వ్యాఖ్యలను ప్రతీ ఒక్కరూ ఖండిస్తున్నారు. అయితే, చంద్రబాబు ఇంటి ముందు ఆందోళన చేపట్టకుండా ముఖ్యమంత్రిపై తీవ్ర అనుచిత వ్యాఖ్యలు చేసిన అయ్యన్నపాత్రుడుపై కఠిన చర్యలు తీసుకుని ఉంటే మరొకరు ఇలాంటి వ్యాఖ్యలు చేయాలంటే ఆలోచించి నడుచుకొనే వారు. మహారాష్ట్రలో ముఖ్యమంత్రిని ఉద్దేశించి కేంద్ర మంత్రి చేసిన వ్యాఖ్యలతో..ఏకంగా కేంద్ర మంత్రి పైనే కేసు నమోదు చేసి అరెస్ట్ చేసారు.

చంద్రబాబు ఇంటి దగ్గర కాకుండా అయితే

చంద్రబాబు ఇంటి దగ్గర కాకుండా అయితే

ఇప్పుడు జరిగిన పరిణామాలతో అయ్యన్నపాత్రుడుపై చర్యలు తీసుకున్నా జోగి రమేష్ పై కూడా చర్యలు తీసుకోవాలనే డిమాండ్ వినిపిస్తోంది. అయితే, అసలు జోగి రమేష్ ఈ నిరసన వ్యక్తిగతంగా తీసుకున్న నిర్ణయమా..లేక పార్టీ పరంగా వచ్చన ఆదేశాలా అనేది మరో చర్చ. ముఖ్యమంత్రిని విమర్శిస్తే...అయ్యన్న ఉన్న ప్రాంతంలో నిరసన వ్యక్తం చేయాలి..లేదా పార్టీ ముఖ్యకార్యాలయం ఉన్న మంగళగిరిలో నిరసన వ్యక్తం చేస్తే మరో విధంగా ఉండేదనే అభిప్రాయం వినిపిస్తోంది. అయితే, చంద్రబాబు నివాసం వద్ద నిరసన నిర్వహించాలనుకోవటం రాజకీయ తప్పిదమనే విశ్లేషణలు వినిపిస్తున్నాయి.

మైలేజ్ దక్కిందెవరికి..టీడీపీకా-వైసీపీకా

మైలేజ్ దక్కిందెవరికి..టీడీపీకా-వైసీపీకా

అక్కడ తొలుత ఎవరి మీద ఎవరు దాడి చేసినా... ఆ తరువాత ఏం జరిగినా...కేసులు పెట్టినా..ముందుగా అసలు చంద్రబాబు నివాసం వద్ద అధికార పార్టీ ఎమ్మెల్యే నిరసన ఏంటనే ప్రశ్నే ఎక్కువగా వినిపిస్తోంది. ప్రభుత్వం ప్రతిపక్షానికి ఎటువంటి అవకాశం ఇవ్వకుండా పూర్తిగా డామినేట్ చేసుకుంటూ వేళ్లాల్సిన పరిస్థితుల్లో...ఇలాంటి రాజకీయ తప్పిదాలు టీడీపీ క్యాష్ చేసుకోవటంలో ముందుంటుంది. చంద్రబాబు ఇంటి వద్ద నిరసన పార్టీ కార్యక్రమం అయితే, జోగి రమేష్ ఒక్కరికే ఆ బాధ్యత అప్పగించరు. స్థానిక ఎమ్మెల్యేలకు సమాచారం లేదు.

జోగి రమేష్ వ్యక్తిగతంగా నిర్ణయించారా

జోగి రమేష్ వ్యక్తిగతంగా నిర్ణయించారా

అయితే, అనూహ్యంగా జోగి రమేష్ తన అనుచర వర్గంతో అక్కడకు చేరకొనే సమయానికి..ఆ వెంటనే మాత్రం టీడీపీ నేతలు..కేడర్ పెద్ద సంఖ్యలో చేరుకోవటం మాత్రం పరిగణలోకి తీసుకోవాల్సిన అంశంగా చెబుతున్నారు. చంద్రబాబు ఇంటి వద్దకు వచ్చి నిరసన అయినా..అది రెండు పార్టీల నాయకులు-కార్యకర్తల మధ్య జరిగిన ఘర్షణతో ప్రతిపక్ష నేత ఇంటి పైన దాడికి వచ్చారంటూ ప్రచారం జరిగింది. అధికార పార్టీ ఎమ్మెల్యే తన అనుచరులతో చంద్రబాబు ఇంటి వద్దకు రావటంతో ఆ రకమైన ప్రచారానికి టీడీపీకి అవకాశం దక్కింది.

జగన్ ను దూషించినా నేతలకు పట్టటం లేదా

జగన్ ను దూషించినా నేతలకు పట్టటం లేదా

అధికార పార్టీలో ఉంటూ అక్కడ గందరగోళ పరిస్థితులకు ఎమ్మెల్యే జోగి కారణమనే వాదన వినిపిస్తోంది. అయితే, ముఖ్యమంత్రి పైన ఒక మాజీ మంత్రి చేసిన వ్యాఖ్యల పైన విశాఖ నేతల తో సహా ఇతర నేతలు ఎందుకు సీరియస్ గా స్పందించలేదనేది మరో ప్రశ్న. తమ పార్టీ అధినేత ..సీఎం పైన అటువంటి వ్యాఖ్యలు చేస్తుంటే కనీసం విశాఖ నేతలు ఫిర్యాదు కూడా చేయలేదు. దీనిపి వైసీపీ అధినాయకత్వం సీరియస్ గా తీసుకుంటోంది. వైసీపీ ఎమ్మెల్యే చేసిన రాజకీయ తప్పిదానికి తప్పని పరిస్థితుల్లో పార్టీలోని ఇతర నేతలు సైతం ఆలస్యంగా వచ్చి మద్దతు ఇవ్వాల్సి వచ్చింది.

టీడీపీ నేతలు అంత వేగంగా ఎలా రియాక్ట్ అయ్యారు

టీడీపీ నేతలు అంత వేగంగా ఎలా రియాక్ట్ అయ్యారు

చివరకు పోలీసుల కు ఫిర్యాదులు చేసారు. అదే నిరసనకు ముందే అయ్యన్న పైన ఫిర్యాదు చేసి ఉంటే..ఖచ్చితంగా టీడీపీ ఆత్మరక్షణలో పడేదనే అభిప్రాయం వైసీపీలోనూ వినిపిస్తోంది. జోగి రమేష్ కరకట్ట వద్ద ఉన్న చంద్రబాబు నివాసం వద్దకు రాగానే విజయవాడ- గుంటూరులోని టీడీపీ నేతలు ఆగమేఘాల మీద చంద్రబాబు నివాసం వద్దకు చేరుకున్నారు. మాజీ ఎమ్మెల్సీ బుద్దా వెంకన్న వర్సెస్ జోగి రమేష్ అన్నట్లుగా అక్కడి పరిస్థితు లు మారాయి. దాడిగా చిత్రీక‌రిస్తూ ప్ర‌జ‌ల్లో ప్ర‌భుత్వంపై వ్య‌తిరేక‌త‌ను సృష్టించ‌డానికి టీడీపీ నాయ‌క‌త్వం ప‌క్కా ప్ర‌ణాళిక‌తో రాజకీయంగా ఈ అంశాన్ని సక్సెస్ ఫుల్ గా వాడుకుంది.

టీడీపీ ప్రచారమే హైలైట్ అయిందా...

టీడీపీ ప్రచారమే హైలైట్ అయిందా...

ఇదే సమయంలో దాదాపుగా రాష్ట్రంలోని అన్ననియోజకవర్గాల్లోనూ జోగి రమేష్ వచ్చింది చంద్రబాబు ఇంటి పైన దాడి చేయటానికే అంటూ టీడీపీ నేతలు ప్రచారం చేసారు. కానీ ,అదే స్థాయిలో వైసీపీ నుంచి మాత్రం అయ్యన్న వ్యాఖ్యల మీద స్పందన కనిపించ లేదు. తాము అధికారంలో ఉన్న విషయం మరిచి..వ్యక్తిగత మైలేజ్ కోసం చేసిన ప్రయత్నంగా విమర్శలు వస్తున్నాయి. ప్రతిపక్షంలో ఉన్న సమయంలో టీడీపీ నేతలు పదే పదే జగన్ ను టార్గెట్ చేస్తే చేసిన ఆరోపణలు..విమర్శలు సైతం చంద్రబాబుకు వ్యతిరేకంగా..జగన్ కు అనుకూలంగా మారిన విషయాన్ని విశ్లేషకులు గుర్తు చేస్తున్నారు. కానీ, ఇప్పుడు చంద్రబాబుకు ఆ అవకాశం ఇచ్చే విధంగా చేస్తున్న రాజకీయ తప్పిదాలు పార్టీకి ప్రజల్లో నష్టం చేస్తాయనేది వారి అభిప్రాయంగా కనిపిస్తోంది.

English summary
YCP MLA Jogi Ramesh who had a clash with TDP leaders near Chandrababu house had fallen into the political trap.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X