• search
  • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

KCR, YS Jagan లంచ్ మీట్: ఏకాంత సమావేశం: అసలు చర్చ అదే..!

|

తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు సోమవారం (జనవరి 13న) మరోసారి సమావేశం కాబోతున్నారు. ఈ మధ్నాహ్నం తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్..ఏపీ ముఖ్యమంత్రి జగన్ ను విందుకు ఆహ్వానించారు. సీఎం జగన్ రెండు రోజులుగా హైదరాబాద్ లోని లోటస్ పాండ్ లోనే ఉంటున్నారు. నాలుగు నెలల విరామం తరువాత ఇద్దరి మధ్య సాగుతున్న సమావేశం కావటంతో దీని పైన ఆసక్తి నెలకొని ఉంది. ఈ సమావేశానికి అధికారుల కు సమాచారం లేదు. దీంతో..ఇద్దరు ముఖ్యమంత్రుల మధ్య ఏకాంత సమావేశం జరగనుంది. ఇందులో పూర్తిగా రాజకీయ అంశాలే చర్చకు వచ్చే అవకాశం కనిపిస్తోంది. రాజధాని అమరావతిని విశాఖకు మార్పు వ్యవహా రం.. దీనిపై అమరావతి ప్రాంత రైతుల ఆందోళనలు కూడా చర్చకు వచ్చే వీలుందని సమాచారం.

జగన్ కు కేసీఆర్ విందు

జగన్ కు కేసీఆర్ విందు

ఏపీ ముఖ్యమంత్రి జగన్ ను తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ విందుకు ఆహ్వానించారు. తొలుత ఇద్దరు ముఖ్యమంత్రులు గతంలో మాదిరి అధికారులతో కలిసి రెండు రాష్ట్రాల సమస్యల పైన చర్చిస్తారని భావించారు. అయితే, ఈ సమావేశం గురించి అధికారులకు ఆహ్వానం లేదు. వారికి సమాచారం ఇవ్వలేదని తెలుస్తోంది. పూర్తిగా ఇద్దరు ముఖ్యమంత్రులు ఏకాంత సమావేశంగా సమాచారం.

రెండు రోజులుగా హైదరాబాద్ లోనే ఉన్న ఏపీ ముఖ్యమంత్రి ఈ రోజు ప్రగతి భవన్ కు వెళ్లి కేసీఆర్ తో సమావేశం కానున్నారు. ఇద్దరు ముఖ్యమంత్రులతో రెండు రాష్ట్రాలకు చెందిన కీలక నేతలు మాత్రమే ఉండే అవకాశం ఉంది.
హైదరాబాద్ వేదికగా ఇద్దరు ముఖ్యమంత్రులు గతంలో మూడు సార్లు భేటీ అయ్యారు. కాగా..ఇది నాలుగో సమావేశం.

ఆ ప్రతిపాదనలపైన చర్చ లేనట్లే..

ఆ ప్రతిపాదనలపైన చర్చ లేనట్లే..

గతంలో మూడు సార్లు సమావేశమైన సమయంలో వీరిద్దరితో పాటుగా అధికారులు పాల్గొన్నారు. ఈ సమావేశానికి అధికారులు రావటం లేదు. ప్రధానంగా గతంలో వీరు తెలంగాణ భూభాగం నుంచి గోదావరి జలాలను నాగార్జునసాగర్‌, శ్రీశైలం జలాశయాల్లోకి ఎత్తిపోసే పథకంపై చర్చించారు. కానీ, ఇప్పుడు ఏపీ ముఖ్యమంత్రి దానికి సుముఖంగా కనిపించటం లేదని సమాచారం.

దీంతో..ఈ సమావేశంలో రాయలసీమ కాలువల విస్తరణలో భాగంగా పోతిరెడ్డిపాడు హెడ్‌రెగ్యులేటర్‌ సామర్థ్యాన్ని పెంచాలని జగన్‌ నిర్ణయించారు. దీనిపై తెలంగాణ ప్రభుత్వం అభ్యంతరం వ్యక్తంచేస్తోంది. దీనిపైనా ఇద్దరు సీఎంలు చర్చిం చే వీలుంది. ఆర్టీసీని ఏపీ ప్రభుత్వంలో విలీనం చేయటం సమయంలో కేసీఆర్ కీలక వ్యాఖ్యలు చేసారు. ఆర్టీసీ పైన ఇద్దరు మఖ్యమంత్రుల అభిప్రాయాలు వేర్వేరుగా ఉన్నాయి. ఇక.. దిశ చట్టం సమయంలో అసెంబ్లీ వేదికగా కేసీఆర్ కు ఏపీ ముఖ్యమంత్రి జగన్ హాట్సాఫ్ చెప్పారు.

అమరావతి పైనే అసలు చర్చ..

అమరావతి పైనే అసలు చర్చ..

గతంలో కేసీఆర్ అమరావతి పైన కొన్ని కీలక వ్యాఖ్యలు చేసారు. అమరావతి భౌగోళిక పరిస్థితుల కారణంగా అక్కడ పెట్టే పెట్టుబడి డెడ్ ఇన్వెస్ట్ మెంట్ గా అభివర్ణించినట్లు అప్పట్లో వార్తలు వచ్చాయి. ఇక, ఇప్పుడు జగన్ సైతం అదే అభిప్రాయంతో ఉన్నారు. అయితే, మూడు రాజధానుల ప్రతిపాదనల పైన రాష్ట్రంలో నెలకొన్న తాజా పరిస్థితులు..చంద్రబాబు రాజకీయ యాత్ర పైనా ఇద్దరు చర్చించే అవకాశం కనిపిస్తోంది.

ఈ సమయంలో కేసీఆర్ కొన్ని సూచనలు సైతం చేసే ఛాన్స్ ఉంది. ఇక, జాతీయ స్థాయిలో చోటు చేసుకుంటున్న రాజకీయ పరిణామాల పైనా ఇద్దరు సీఎంలు చర్చించే అవకాశం ఉంది. కేంద్రం నుండి మరింతగా సాయం పొందటం పైన వీరిద్దరు తమ అభిప్రాయాలు పంచుకొనే పరిస్థితి కనిపిస్తోంది. అయితే, ఇది మర్యాద పూర్వకంగా సాగే సమావేశం కావటంతో..కేవలం కీలక అంశాల పైన చర్చలకు మాత్రమే పరిమితమవుతారని భావిస్తున్నారు.

English summary
Telangana CM KCR invited AP Cm Jagan for lunch in his official residence along with his family. After four months gap both Chief ministers meeting to day. Political curiosity created on this meeting.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X