బీజేపీకి వైసీపి డైరెక్షనా? - కన్నా నేను ఒకటే -చంద్రబాబు, జగన్ కవలలు -ఇదీ అసలు కథ: సోము వీర్రాజు
ఆంధ్రప్రదేశ్ ప్రజల్ని మోసగించడంలో, కేంద్రం నుంచి వస్తోన్న నిధుల్ని మింగేయడంలో, అవినీతి, అక్రమాల వ్యవహారాల్లోనూ చంద్రబాబు, జగన్ కవలపిల్లలని బీజేపీ చీఫ్ సోము వీర్రాజు విమర్శించారు. నాటి టీడీపీ వైఫల్యాలను, ప్రస్తుత వైసీపీ తప్పులను ఏకిపారేస్తామని, ఇద్దరిలో ఒకరు ఎక్కువ, ఒకరు తక్కువ అనే భావన బీజేపీ లేదని ఆయన క్లారిటీ ఇచ్చారు. విజయవాడ సిటీలో కొత్తగా ఏర్పాటు చేసిన బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో సోమవారం ఆయన మీడియాతో మాట్లాడారు. టీడీపీ, వైసీపీలను ఉద్దేశించి మరికొన్ని సంచలన వ్యాఖ్యలు చేశారు.
మోదీ, షా చెప్పినా జగన్ వినలేదు - సోము వీర్రాజు ఫైర్- ఏపీలో సంక్షోభం -కేంద్రమే దిక్కన్న బీజేపీ నేతలు

అమరావతే రాజధాని..
ఏపీ రాజధాని విషయంలో వైసీపీ, టీడీపీలకంటే ఎక్కువ క్లారిటీ బీజేపీకి ఉందని, అమరావతి మాత్రమే ఆంధ్రుల రాజధానిగా ఉండాలని సోము వీర్రాజు చెప్పారు. అమరావతిని రాజధానిగా ఫిక్స్ అయ్యాం కాబట్టే విజయవాడలో బీజేపీ రాష్ట్ర నూతన కార్యాలయం పెట్టామని, త్వరలోనే శాశ్వత భవంతిని కూడా నిర్మిస్తామని తెలిపారు. రాజధానిపై నాటు టీడీపీ, ప్రస్తుత వైసీపీ ప్రభుత్వాలు రైతుల్ని దారుణంగా మోసం చేశాయని ఆయన ఆరోపించారు. అది ఎలా అంటే..

చేయక బాబు.. చేస్తానని జగన్..
‘‘తనను తాను దార్శనికుడుగా చెప్పుకునే చంద్రబాబు.. రాజధాని ప్రాంతంలో 64 వేల మంది రైతులకు ప్లాట్లు ఇవ్వకుండా వదిలేశారు. ఆ(ప్లాట్లు ఇచ్చే) పనిని మేం చేస్తామని జగన్ హామీ ఇచ్చారు. బాబు తన 1800 రోజుల పాలనలో మోసపూరిత మాటలతోనే కాలం గడిపేయగా.. గడిచిన 500 రోజులుగా పాలిస్తోన్న వైఎస్ జగన్ కూడా అదే తీరును అనుసరిస్తున్నారు. గతంలో నీరు-చెట్టు అక్రమాలపై నిజాలు నిగ్గుతేలుస్తామన్న వైసీపీ ప్రభుత్వం ఇప్పుడు సైలెంట్ అయిపోయింది. అవ భూముల కుంభకోణంలో వైసీపీ నేతల హస్తం ఉన్నట్లు తెలుస్తోంది. మోసపూరిత మా

ఆ డబ్బులన్నీ ఏమయ్యాయి?
అమరావతిలో రాజధాని నిర్మాణానికి రూ.7200 కోట్ల ఖర్చుకాగా, అందులో రూ.2500కోట్లు నేరుగా, మరో రూ.4600కోట్లు రుణం రూపంలో కేంద్ర ప్రభుత్వం అందజేసిందని, ఉపాధి హామీ పథకం కిందట గడిచిన ఐదేళ్లలో రూ.45 వేల కోట్లు, తాజాగా మరో రూ.1200 కోట్ల నిధులను కేంద్రం ఇచ్చిందని వివరించిన వీర్రాజు.. ఆ డబ్బులన్నీ ఏమైపోయాయో ప్రజలకు లెక్కలు చెప్పాల్సిన బాధ్యత టీడీపీ, వైసీపీలకు ఉందన్నారు. కేంద్రం నేరుగా నిర్మిస్తోన్న పథకాలు వేగంగా పూర్తవుతుంటే, రాష్ట్ర సర్కారు మాత్రం సహకరించకపోగా, అడ్డంకులు సృష్టిస్తోందని, 50 కోట్ల వ్యయంతో అద్భుతమైన డిజైన్ యూనివర్సిటీని కేంద్రం నిర్మిస్తే, దానికి రోడ్డు వేసుకునేలా 4 ఎకరాలు ఇవ్వడానికి రాష్ట్రం నిరాకరిస్తున్నదని సోము వాపోయారు.

టీడీపీ, వైసీపీ కులపార్టీలు కాకున్నా..
‘‘రాజధాని తరలింపు, అనేక ఇతర వివాదాల నేపథ్యంలో వైసీపీ, టీడీపీలు కులాల పరంగా విమర్శలు చేసుకుంటున్నాయి. వాటిని కుల పార్టీలుగా బీజేపీ చూడబోదు. కానీ ఆ రెండూ కచ్చితంగా కుటుంబ పార్టీలే. జాతీయ భావాలు కలిగిన పార్టీగా మేం ఏ ఒక్క వర్గానికీ అన్యాయం జరగబోనివ్వం. జనసేన పార్టీతో కలిసి బీజేపీ ఆధ్వర్యంలో నిరంతరాయంగా పోరాటం చేస్తాం''అని వీర్రాజు అన్నారు. ఏపీలో కేంద్ర ప్రభుత్వ ప్రాయోజిత 21 పథకాలు అమలవుతున్నాయని, వాటికి సంబంధించి స్థానిక ప్రభుత్వాలు చేసిన అవినీతి అక్రమాల చిట్టాను రూపొందించి, ఎప్పటికప్పుడు కేంద్రం దృష్టికి తీసుకెళుతున్నామని, ఇటీవల వర్షాలు, వరదల నేపథ్యంలో కేంద్ర వ్యవసాయ మంత్రిని అడిగిన వెంటనే నష్టం అచనాల కోసం బృందాలను పంపేందుకు అగీకరించారని సోము తెలిపారు.

ఆంధ్రా ఆక్టోపస్ రాజగోపాల్ ప్రస్తావన..
‘‘రాజధాని గురించి, పోలవరం గురించి ఏపీ బీజేపీ మాట్లాడటంలేదని, ఒకవేళ మాట్లాడినా గట్టిగా వ్యవహరించడంలేదని ఈ మధ్య కథనాలు వస్తున్నాయి. ఇది పూర్తిగా తప్పు. మాకు టీడీపీ తక్కువ, వైసీపీ ఎక్కువ కానేకాదు. ఇద్దరి తప్పులనూ ఎండగడతాం. రాజకీయ పార్టీల జాతకాలు చెప్పే లగడపాటి రాజగోపాల్ విజయవాడలో ఒక్క ఫ్లైఓవర్ కట్టలేకపోయాడు. అదే, కేశినేని నాని ఒక్క లెటర్ రాస్తే, గడ్కరీ వెంటనే నిధులిచ్చారు. తీరా ఆ ప్రాజెక్టును ఎవరో 420 కాంట్రాక్టర్ చేతులో పెట్టి, నిర్మాణాన్ని వాయిదావేస్తూ వచ్చారు. గతంలో గడ్కరీ స్వయంగా చంద్రబాబును పలిచి, ఏపీకి లక్ష కోట్లు ఇస్తామన్నారు. అప్పుడుగానీ, ఇప్పుడుగానీ ఏపీ విషయంలో మోదీ సర్కార్ కమిట్ మెంట్ తోనే ఉంది. అమరావతి, పోలవరం విషయంలో మా స్టాండ్ మారబోదు'' అని సోము వీర్రాజు చెప్పారు.

కన్నా నేను ఒకటే.. మాకు వైసీపీ డైరెక్షనా?
టీడీపీ, వైసీపీలపై పోరాడే విషయంలో బీజేపీ మాజీ చీఫ్ కన్నా లక్ష్మినారాయణది, తనది ఒకే పథా అని సోము వీర్రాజు అన్నారు. కాకుంటే, కన్నా కంటే తాను విషయాలను కాస్త వివరంగా విషదీకరిస్తున్నాని, అధికార ప్రతినిధుల విషయంలో కూడా కచ్చితంగా వ్యవహరిస్తున్నానని తెలిపారు. ఎవరు పడితే వాళ్లు మీడియాతో మాట్లాడొద్దని కచ్చితంగా ఆదేశించిన తర్వాత కూడా నిబంధనల్ని మీరినవారిపై చర్యలు తీసుకున్నామని లంకా దినకర్ సస్పెన్షన్ పై సోము క్లారిటీ ఇచ్చారు. టీవీ చానెళ్లు కూడా అధికార ప్రతినిధుల్ని మాత్రమే చర్చకు పిలవాలని సూచించారు. టీడీపీ అవినీతిని కొనసాగిస్తోన్న వైసీపీకి చెందిన కొందరు నేతలు బీజేపీకి డైరెక్షన్ ఇస్తున్నారంటూ పరోక్షంగా విజయసాయిరెడ్డిపై సోము సెటైర్లు వేశారు.
ముస్లింలను తప్పుదోవ పట్టించారు - సీఏఏపై ఆర్ఎస్ఎస్ చీఫ్ - మేం బచ్చాగాళ్లమా?: ఓవైసీ కౌంటర్