వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

గుర్తుకు లేదా?: జగన్ ‌ఇటలీ వ్యాఖ్యలపై బొత్స, జగ్గారెడ్డి

By Srinivas
|
Google Oneindia TeluguNews

 Botsa and Jagga Reddy criticise YS Jagan
హైదరాబాద్: వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్మోహన్ రెడ్డి మాటల్లో క్లారిటీ లేదని, సమైక్యంపై మాట్లాడే అర్హత ఆయనకు లేదని సంగారెడ్డి శాసన సభ్యుడు తూర్పు జయప్రకాశ్ రెడ్డి(జగ్గా రెడ్డి) ఆదివారం సాయంత్రం అన్నారు. ఓ ప్రాంతంలో తన ఉనికిని కాపాడుకునేందుకే జగన్ హైదరాబాదులో సమైక్య సభ పెట్టారని ఆరోపించారు. రాష్ట్ర విభజన విషయంలో జగన్‌ది డబుల్ గేమ్ అని విమర్శించారు.

సమైక్యవాదిగా మాట్లాడే నైతిక హక్కు జగన్‌కు లేదన్నారు. పరకాల ఉప ఎన్నికల సందర్భంగా ఆయన వైయస్ విజయమ్మ తెలంగాణకు తాము వ్యతిరేకం కాదని ప్రకటించిన విషయం గుర్తు చేసుకోవాలన్నారు. తమకు తెలంగాణ ఇచ్చే శక్తి లేదని, ఇస్తే అభ్యంతరం లేదని చెప్పిన మాటను జగన్ మరిచారా అని ప్రశ్నించారు.

సోనియా సంతకం చేసిన బిఫారం తీసుకున్నప్పుడు ఇటలీ సోనియా అనే విషయం గుర్తుకు రాలేదా అని ప్రశ్నించారు. ఆయన తండ్రిని రెండుసార్లు సిఎంని చేసినప్పుడు అవన్నీ గుర్తుకు రాలేదా అని ప్రశ్నించారు. ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి సిడబ్ల్యూసి నిర్ణయాన్ని వ్యతిరేకించి సమైక్యవాదం వినిపిస్తున్నారని ఆయనే నిజమైన సమైక్యవాది అన్నారు.

కుర్చీ కోసమే: బొత్స

రాష్ట్రంలో అధికారం కోసమే వైయస్ జగన్ సమైక్యరాగం ఆలపిస్తున్నారని, కుర్చీ కోసమే సమైక్యగళం వినిపిస్తున్నారని ప్రదేశ్ కాంగ్రెసు కమిటీ అధ్యక్షుడు బొత్స సత్యనారాయణ వేరుగా ధ్వజమెత్తారు. ఆదివారం రాత్రి విశాఖ జిల్లాలో ఆయన విలేకరులతో మాట్లాడారు. భారత్‌తో ముప్పై ఏళ్ల సోనియా అనుబంధం గురించి మాట్లాడుతున్న జగన్‌కు, ఆర్టికల్ 3 ప్రకారం విభజన చేయాలని కేంద్ర హోంమంత్రి షిండేకు లేఖ ఇచ్చినప్పుడు రాష్ట్ర ప్రజల 60 ఏళ్ల అనుబంధం గుర్తుకురాలేదా అని బొత్స ప్రశ్నించారు.

జగన్ జైల్లో ఉన్న సమయంలో గుంటూరులో విజయమ్మ నిరాహార దీక్ష చేసినప్పుడు శిబిరంలో సమన్యాయం బ్యానర్ ఎందుకు ఏర్పాటు చేశారో చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు. రాష్ట్రం సమైక్యంగా ఉండాలన్నదే తమ అందరి అభిమతమని, దీనిపై అధిష్ఠానానికి తమ వాదన స్పష్టంగా వినిపించామని బొత్స చెప్పారు. రాష్ట్రపతికి ముఖ్యమంత్రి రాసిన లేఖతో రాష్ట్ర విభజన ఆగుతుందా లేదా అనేది తాను చెప్పలేనని, ఆగుతుందనే తాను ఇప్పటికీ నమ్ముతున్నానన్నారు.

English summary
YSRCP chief YS Jaganmohan Reddy was the target of the Congress for his remarks made at Samaikyandhra Sankaravam.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X