వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

బొత్స ఝాన్సీ డుమ్మా: కావూరి, చిరు, కెవిపి హాజరు

By Pratap
|
Google Oneindia TeluguNews

Botsa Jhansi
హైదరాబాద్: రాష్ట్ర విభజనకు వ్యతిరేకంగా భవిష్యత్తు కార్యాచరణ రూపకల్పనకు ఏర్పాటైన సీమాంధ్ర కేంద్ర మంత్రులు, పార్లమెంటు సభ్యుల సమావేశానికి పిసిసి అధ్యక్షుడు బొత్స సత్యనారాయణ సతీమణి, పార్లమెంటు సభ్యురాలు బొత్స ఝాన్సీ డుమ్మా కొట్టారు. సమైక్యాంధ్ర ఉద్యమాలు జరుతున్న నేపథ్యంలో, విభజనకు కాంగ్రెసు అధిష్టానం ముందడుగు వేస్తున్న స్థితిలో సీమాంధ్ర కాంగ్రెసు నేతలు శనివారం మినిస్టర్స్ క్వార్టర్స్‌లోని క్లబ్ హౌస్‌లో శనివారం సమావేశమయ్యారు.

ఆ సమావేశానికి హాజరు కావడం ఇష్టంలేని బొత్స ఝాన్సీ సమావేశం ప్రారంభం కావడానికి ముందే మినిస్టర్స్ క్వార్టర్స్ నుంచి బయటకు వెళ్లిపోయారు. కాంగ్రెసు అధిష్టానం నిర్ణయానికి కట్టుబడి ఉండాలని బొత్స సత్యనారాయణ కుటుంబ సభ్యులు నిర్ణయించుకున్నారు. దీంతో బొత్స ఝాన్సీ సమైక్యాంధ్ర ఉద్యమానికి దూరంగా ఉండాలని నిర్ణయించుకున్నారు.

సమావేశానికి సీమాంధ్రకు చెందిన కేంద్ర మంత్రులు కావూరి సాంబశివ రావు, చిరంజీవి, దగ్దుబాటి పురంధేశ్వరి, పళ్లం రాజుస, జెడి శీలం హాజరయ్యారు. పార్లమెంటు సభ్యులు లగడపాటి రాజగోపాల్, కనమూరి బాపిరాజు, కెవిపి రామచంద్రరావు, మాగుంట శ్రీనివాసులు రెడ్డి హాజరయ్యారు. పార్లమెంటు సభ్యులు చింతా మోహన్, రాయపాటి సాంబశివ రావు సమావేశానికి రాలేదు.

సమైక్యాంధ్రకు మద్దతుగా రాజీనామాలు ఆమోదింపజేసుకోవాలా, లేదా అనే విషయంపై సీమాంధ్ర పార్లమెటు సభ్యుల్లో ఏకాభిప్రాయం లేదని రాష్ట్ర మంత్రి గంటా శ్రీనివాస రావు చెప్పారు. ఏడుగురు సీమాంధ్ర పార్లమెంటు సభ్యులు రాజీనామాలను ఆమోదింపజేసుకునేందుకు సిద్ధంగా ఉన్నట్లు లగడపాటి రాజగోపాల్ సమావేశానికి ముందు చెప్పారు. కొంత మంది సీమాంధ్ర కేంద్ర మంత్రులు కూడా రాజీనామాలకు సిద్ధంగా ఉన్నట్లు ఆయన తెలిపారు.

English summary
PCC president Botsa Satyanarayana's wife and Congress MP kept away from the Seemandhra MPs and ministers meeting held in Hyderabad.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X