వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

సీబీఐ-సీఐడీ వయా సిట్.. ఇన్‌సైడర్ ట్రేడింగ్‌పై టీడీపీది పూటకోమాట, ఈఎస్ఐ స్కాంపై కూడా: మంత్రి బొత్స

|
Google Oneindia TeluguNews

ప్రతిపక్ష టీడీపీపై ఏపీ మంత్రి బొత్స సత్యనారాయణ ఫైరయ్యారు. అమరావతిలో ఇన్‌సైడర్ ట్రేడింగ్‌పై ప్రతిపక్ష టీడీపీ విచారణ జరిపించమని కోరిందని చెప్పారు. ఇన్‌సైడర్ ట్రేడింగ్ జరిగిందనే అంశానికి తాము కట్టుబడి ఉన్నామని, ప్రతిపక్షం అడిగినందున సిట్ ఏర్పాటు చేశామని వివరించారు. ఎంక్వైరీ అడిగి గగ్గోలు పెట్టడం ఏంటీ అని మండిపడ్డారు.

సిట్‌తో విచారణ..

సిట్‌తో విచారణ..


అమరావతిలో అక్రమాలు, ఇన్‌సైడర్ ట్రేడింగ్‌పై విచారణ జరుగుతోందని మంత్రి బొత్స సత్యనారాయణ స్పష్టంచేశారు. తప్పు చేయకుండే నిర్దోషులుగా బయటపడతారు కదా.. ఎందుకు భయపడుతున్నారని ప్రశ్నించారు. తప్పు చేయకుంటే నిర్దోషిత్వం నిరూపించుకోవాలని విపక్షాలకు బొత్స సత్యనారాయణ సూచించారు.

సీబీఐ, సీఐడీ..

సీబీఐ, సీఐడీ..

ఇన్‌‌సైడర్ ట్రేడింగ్‌పై విచారణపై కూడా టీడీపీ నేతలు పూటకో మాట మాట్లాడుతున్నారని బొత్స సత్యనారాయణ మండిపడ్డారు. తొలుత సీబీఐకి ఇచ్చేందుకు ప్రభుత్వం సిద్ధమైతే.. సొంత పోలీసులపై నమ్మకం లేదా, ఏపీ పోలీసులు పనికిరారా అన్నారు. సీఐడీ అప్పగించేందుకు ముందుకొస్తే, రాష్ట్ర పోలీసులు ప్రభుత్వం చెప్పినట్టు వింటారన్నారు. అలా కాదని చివరకు సిట్ ఏర్పాటు చేశామని, క్షుణ్ణంగా పరిశీలించి నివేదిక అందజేస్తారని తెలిపారు.

ఎవరైనా ఒక్కటే..

ఎవరైనా ఒక్కటే..


ఈఎస్ఐ స్కాంపై కూడా బొత్స సత్యనారాయణ స్పందించారు. రూ.వందల కోట్లు చేతుల మారాయనే విజిలెన్స్ కమిషన్ రిపోర్ట్‌తో విచారణ జరిపేందుకు ప్రభుత్వం నిర్ణయం తీసుకొందని చెప్పారు. ఒక డెసిషన్ తీసుకునే సమయంలోనే.. బీసీలను వేధిస్తున్నారని ఎదురుదాడికి దిగారని పేర్కొన్నారు. తప్పు చేస్తే ఎవరైనా శిక్ష అనుభవించాల్సిందేనని బొత్స సత్యనారాయణ స్పష్టంచశారు. అందుకు ఓసీ, బీసీ, ఎస్టీ, ఎస్సీ అనే మినహాయింపు ఏమీ ఉండనదన్నారు.

Recommended Video

Evening News Express : 3 Minutes 10 Headlines | Coronavirus | YCP MLA Roja Slams Chandrababu
మోడీ ఏం చెప్పారు..?

మోడీ ఏం చెప్పారు..?

ఈఎస్ఐ స్కాం విషయంలో తెరపైకి ప్రధాని మోడీ తీసుకొస్తున్నారని బొత్స విమర్శించారు. ఫలానా కంపెనీకి కట్టబెట్టమని మోడీ స్వయంగా చెప్పారా అని ప్రశ్నించారు. అభియోగాల నుంచి తప్పించుకునేందుకు మోడీ పేరు తెరపైకి తీసుకొచ్చారని అర్థమవుతోందన్నారు. దీంతోపాటు తెలంగాణ ప్రభుత్వం మాదిరిగా టెలీ హెల్త్ సర్వీసెస్ అమలు చేయాలని లేఖ రాశానని అచ్చెన్నాయుడు చెబుతున్నారు. తెలంగాణలో ఏ విధంగా అమలు చేశారు..? ఏపీలో ఎందుకు ప్రభుత్వానికి రూ.400 కోట్ల నష్టం వచ్చింది అని బొత్స సత్యనారాయణ ప్రశ్నించారు.

English summary
minister botsa satya narayana angry on tdp attitude on insider trading enquiry issue and esi scam also.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X