వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఆరు సీట్లకు ఎనిమిది నామినేషన్లు (పిక్చర్స్)

|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: రాష్ట్రంలో జరగనున్న ఆరు రాజ్యసభ స్థానాల ఎన్నికకు గానూ ఎనిమిది మంది నామినేషన్లు వేశారు. కాంగ్రెస్ నుంచి ముగ్గురు, తెలుగుదేశం పార్టీ నుంచి ఇద్దరు, తెలంగాణ రాష్ట్ర సమితి నుంచి ఒక్కరు నామినేషన్లు వేశారు. ఇద్దరు స్వతంత్ర అభ్యర్థులుగా బరిలో ఉన్నారు. బుధవారం నామినేషన్ల పరిశీలన జరగనుంది.

రాజ్యసభ సభ్యత్వానికి జరుగనున్న ఎన్నికల్లో నామినేషన్ వేసేంత వరకే తన బాధత్య అని కాంగ్రెస్ పార్లమెంటు సభ్యుడు టి సుబ్బరామిరెడ్డి అన్నారు. ఆయన మంగళవారం మీడియాతో మాట్లాడుతూ.. కాంగ్రెస్ పార్టీలోని రెబెల్ అభ్యర్థుల విషయాన్ని హైకమాండ్ చూసుకుంటుందని అన్నారు. ముగ్గురు రాజ్యసభ అభ్యర్థులకు సరిపడే బలం మాత్రమే ఉందని సుబ్బరామిరెడ్డి తెలిపారు. అందుకే కాంగ్రెస్ అధిష్టానం ముగ్గురు అభ్యర్థులను మాత్రమే ప్రకటించిందని ఆయన చెప్పారు.

ఎవరికీ భయపడను: ఆదాల

సమైక్యతా కోసమే తాను నామినేషన్ వేశానని ఆదాల ప్రభాకర్ రెడ్డి అన్నారు. తనను కొందరు మంత్రులు, కాంగ్రెస్ నేతలు బెదిరింపులకు గురి చేస్తున్నారని, కుట్రలకు పాల్పడుతున్నారని చెప్పారు. ఎవరి బెదిరింపులకు భయపడననీ, నామినేషన్‌ను ఉపసంహరించుకునే ప్రసక్తే లేదని తెలిపారు. అయితే రాష్ట్ర సమైక్యతను కాపాడుతామని హామీ ఇస్తే తన నామినేషన్‌ను ఉపసంహరించుకుంటానని పేర్కొన్నారు.

టిఎస్సార్

టిఎస్సార్

రాజ్యసభ ఎన్నికల నేపథ్యంలో నామినేషన్ వేసేందుకు కాంగ్రెస్ పార్లమెంట్ సభ్యుడు టి సుబ్బరామిరెడ్డికి గాంధీ భవన్‌లో బి ఫాం అందిస్తున్న పిసిసి చీఫ్ బొత్స సత్యనారాయణ.

ఎంఏ ఖాన్

ఎంఏ ఖాన్

రాజ్యసభ ఎన్నికల నేపథ్యంలో నామినేషన్ వేసేందుకు కాంగ్రెస్ సీనియర్ నాయకుడు ఎంఏ ఖాన్‌కి గాంధీ భవన్‌లో బి ఫాం అందిస్తున్న పిసిసి చీఫ్ బొత్స సత్యనారాయణ.

కెవిపి

కెవిపి

రాజ్యసభ ఎన్నికల నేపథ్యంలో నామినేషన్ వేసేందుకు కాంగ్రెస్ సీనియర్ నాయకుడు కెవిపి రామచంద్రరావుకి పిసిసి చీఫ్ బొత్స సత్యనారాయణ బిఫాం అందజేశారు.

బిఫారాలతో అభ్యర్థులు

బిఫారాలతో అభ్యర్థులు

గాంధీభవన్‌లో పిసిసి చీఫ్ బొత్స సత్యనారాయణతో కాంగ్రెస్ రాజ్యసభ అభ్యర్థులు టి సుబ్బరామిరెడ్డి, ఎంఏ ఖాన్, కెవిపి రామచంద్రరావు.

 నామినేషన్ దాఖలు

నామినేషన్ దాఖలు


కాంగ్రెస్ పార్టీ తరపున రాజ్యసభ అభ్యర్థిగా బరిలో ఉన్న టి సుబ్బరామిరెడ్డి మంగళవారం తన నామినేషన్‌ను ఎన్నికల అధికారికి అందజేశారు. ఆయన వెంట ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి, ఉప ముఖ్యమంత్రి దామోదర రాజనర్సింహ, పిసిసి చీఫ్ బొత్స సత్యనారాయణ, ప్రభుత్వ చీఫ్ విప్ గండ్ర వెంకటరమణారెడ్డి ఉన్నారు.

నామినేషన్ దాఖలు చేస్తున్న ఎంఏ ఖాన్

నామినేషన్ దాఖలు చేస్తున్న ఎంఏ ఖాన్

కాంగ్రెస్ పార్టీ తరపున రాజ్యసభ అభ్యర్థిగా బరిలో ఉన్న ఎంఏ ఖాన్ మంగళవారం తన నామినేషన్‌ను ఎన్నికల అధికారికి అందజేశారు. ఆయన వెంట ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి, ఉప ముఖ్యమంత్రి దామోదర రాజనర్సింహ, పిసిసి చీఫ్ బొత్స సత్యనారాయణ, ప్రభుత్వ చీఫ్ విప్ గండ్ర వెంకటరమణారెడ్డి ఉన్నారు.

 కెవిపి నామినేషన్

కెవిపి నామినేషన్


కాంగ్రెస్ పార్టీ తరపున రాజ్యసభ అభ్యర్థిగా బరిలో ఉన్న కెవిపి రామచంద్రరావు మంగళవారం తన నామినేషన్‌ను ఎన్నికల అధికారికి అందజేశారు. ఆయన వెంట ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి, ఉప ముఖ్యమంత్రి దామోదర రాజనర్సింహ, పిసిసి చీఫ్ బొత్స సత్యనారాయణ, ప్రభుత్వ చీఫ్ విప్ గండ్ర వెంకటరమణారెడ్డి ఉన్నారు.

English summary

 PCC President Botsa Satyanarayana handling over B forms to their party Rajyasabha candidates at Gandhi Bhavan on Tuesday.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X