వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఏపీ రాజధానిపై వైసీపీ రూటు మారలేదా..? వరదలు ఎక్కువగా వస్తే పరిస్థితి ఏంటి?: బొత్స సత్యనారయణ

|
Google Oneindia TeluguNews

ఏపి రాజధాని అమరావతి నిర్మాణంపై తాను చేసిన వ్యాఖ్యలకు కట్టుబడి ఉన్నానని పురపాలక శాఖ మంత్రి బోత్స సత్యనారయణ మరోసారి స్పష్టం చేశారు. ప్రస్థుతం క్రిష్ణా నదికి వచ్చిన 8 లక్షల క్యూసెక్కుల నీటీ ప్రవానికే రాజధాని నీటమునిగిందని, గత పది సంవత్సరాల క్రితం కూడ ఇదే పరిస్థితి నెలకొందని ఆయన గుర్తు చేసిందని అన్నారు.. ఇక ఇంతకంటే ఎక్కువ వరద భవిష్యత్ ఏర్పడితే... పరిస్థితి ఏంటని ఆయన ప్రశ్నించారు. ఈ నేపథ్యంలోనే రాజధానికి వరద ముంపు ఉందని ఆయన స్పష్టం చేశారు.

ముఖ్యంగా రాజధాని నిర్మాణంపై కేంద్రం ప్రభుత్వం వేసిన శివరామన్ కమిటి సూచనలను టీడీపీ ప్రభుత్వం పట్టించుకోవలేదని, అప్పటి ప్రభుత్వం మంత్రి నారయణ ఆధ్వర్యంలో స్వంతగా కమిటి వేసి తమ నిర్ణయాలను అమలు చేసిందని విమర్శలు చేశారు. ఇక రాజధాని నిర్మాణం అనేది ఓ ఒక్కరి కోసమో, సామాజిక వర్గం కోసమో కాదని, ఇది అయిదు కోట్ల ఆంధ్రప్రదేశ్ ప్రజల అవసరమని పేర్కోన్నారు. మరోవైపు రాజధాని నిర్మాణం అధిక నిధులు కూడ వ్యయం అవుతున్నాయిని అన్నారు. ఇది ఇతర ప్రాంతాలతో పోల్చితే చాల ఎక్కువని చెప్పారు.

Botsa Satyanarayana has once again clear the comments on the capital

ఇక రాజధాని విషయంలో జనసేన అధినేత పవన్ కళ్యాన్ చేసిన వ్యాఖ్యలను ఆయన తప్పుబట్టారు. పవన్ కళ్యాన్ చేసిన వ్యాఖ్యలు ద్వంద అర్ధాన్ని ఇస్తున్నాయని అన్నారు. ఇందులో భాగంగానే తాను చేసిన వ్యాఖ్యలకు కట్టుబడి ఉన్నానని ఆయన స్పష్టం చేశారు. కాగా అమరావతి నిర్మాణంపై బోత్స చేసిన వ్యాఖ్యలు పెద్ద రాజకీయ దుమారాన్ని రేపాయి. ప్రజల్లో కూడ అనేక ఆందోళనలు చెలరేగాయి. అయితే రాజధాని మాత్రం మారబోదని కూడ కొంతమంది అధికార పార్టీ నేతలు స్పష్టం చేశారు. బోత్స వాఖ్యలతో మరోసారి రాజకీయ దుమారం చెలరేగే అవకాశాలు కనిపిస్తున్నాయి.

English summary
Municipal Minister Botsha Satyanarayana has once again clear that which is made comments on the capital of Andhra Pradesh.capital is neither one nor any social class but five crore people of the state he said.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X