వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

కులాల ఆధిపత్య పోరులోనే బొత్స టార్గెట్: పాల్వాయి

By Pratap
|
Google Oneindia TeluguNews

Palwai Govardhan Reddy
హైదరాబాద్: సీమాంధ్రలో మూడు కులాల ఆధిపత్య పోరులో భాగంగానే పిసిసి అధ్యక్షుడు బొత్స సత్యనారాయణను లక్ష్యంగా చేసుకుని దాడులు జరుగుతున్నాయని తెలంగాణకు చెందిన రాజ్యసభ సభ్యుడు పాల్వాయి గోవర్ధన్ రెడ్డి అన్నారు. ఆయన శనివారం మీడియా ప్రతినిధులతో మాట్లాడారు. కమ్మ, కాపు, రెడ్డి కులాల మధ్య సీమాంధ్రలో ఆధిపత్య పోరు సాగుతోందని, ఇందులో భాగంగానే బొత్సను లక్ష్యం చేసుకున్నారని ఆయన అన్నారు.

రాష్ట్రాన్ని విడగొట్టాలని బొత్స సత్యనారాయణ ఎప్పుడూ చెప్పలేదని ఆయన స్పష్టం చేశారు. రాష్ట్ర విభజన విషయంలో కాంగ్రెసు ఆంధ్ర నాయకుల తప్పు లేదని ఆయన అన్నారు. తెలుగుదేశం, వైయస్సార్ కాంగ్రెసు పార్టీలు తెలంగాణకు అనుకూలంగా చెప్పడం వల్లనే రాష్ట్ర విభజన జరుగుతోందని ఆయన అన్నారు.

ఇదిలావుంటే, సీమాంధ్ర ప్రజలను మోసం చేయవద్దని తెలంగాణకు చెందిన రాజ్యసభ సభ్యుడు వి హనుమంతరావు ఆ ప్రాంత పార్టీలకు, నాయకులకు విజ్ఞప్తి చేశారు. వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్ హైదరాబాదులో, తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు ఢిల్లీలో దీక్షలకు పూనుకోవడం సీమాంధ్ర ప్రజలను మభ్యపెట్టడానికేనని ఆయన అన్నారు.

నల్లగొండ జిల్లా యాదగిరిగుట్టలోని శ్రీలక్ష్మీనర్సింహ స్వామిని ఆయన శనివారం కుటుంబ సమేతంగా దర్శించుకున్నారు. ఆ తర్వాత ఆయన మీడియాతో మాట్లాడారు. సమైక్యాంధ్ర ఉద్యమం కొందరు పెట్టుబడిదారుల కనుసన్నల్లో కొనసాగుతోందని ఆయన విమర్శించారు. ఎపిఎన్జీవోల సంఘం అధ్యక్షుడు అశోక్ బాబు తన మాటలతో తెలంగాణ ప్రజలను రెచ్చగొడుతున్నారని అన్నారు. సోదరభావంతో విడిపోదామని ఆయన సీమాంధ్రులకు సూచించారు.

English summary
Congress Rajyasabha member from Telangana Palwai Govardhan Reddy opined that PCC president Botsa Satyanarayana has been made target as a part of caste rivalry.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X