వేగవంతమైన అలర్ట్స్ కోసం
For Daily Alerts
మంత్రి బొత్స సత్యనారాయణకు మాతృవియోగం, అనారోగ్యంతో ఈశ్వరమ్మ కన్నుమూత..
ఆంధ్రప్రదేశ్ మంత్రి బొత్స సత్యనారాయణకు మాతృవియోగం కలిగింది. ఆయన తల్లి ఈశ్వరమ్మ తెల్లవారుజామున చనిపోయారు. ఆమె గత కొద్దిరోజుల నుంచి అనారోగ్యంతో బాధపడుతున్నారు. దీంతో విశాఖలోని పినాకిల్ ఆసుపత్రిలో చికిత్స అందిస్తున్నారు. అస్వస్థతతో ఇవాళ ఉదయం కన్నుమూశారని ఆస్పత్రి వర్గాలు తెలిపాయి. ఈశ్వరమ్మ మృతితో బొత్స కుటుంబంలో విషాదం అలుముకుంది.

Ram Pothineni సంచలన ట్వీట్స్, ఏదో కుట్ర జరుగుతోందని..!! || Oneindia Telugu
ఈశ్వరమ్మకు ఏడుగురు కుమారులు, నలుగురు కుమార్తెలు కాగా.. మంత్రి బొత్స సత్యనారాయణ పెద్ద కుమరుడు. రెండో కుమారుడు బొత్స అప్పల నరసయ్య కూడా ప్రజా జీవితంలో ఉన్నారు. అతను ఎమ్మెల్యేగా పనిచేస్తున్నారు. మిగతా ఇద్దరు కుమారులు, కూతుళ్లు వ్యాపార రంగంలో ఉన్నారు. విజయనగరంలోని స్వర్గధామంలో ఈశ్వరమ్మ అంత్యక్రియలను మధ్యాహ్నాం నిర్వహిస్తామని కుటుంబసభ్యులు తెలిపారు.