అమరావతి వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

నేను ఆ విషయాలు చెబితే తలకాయ ఎక్కడ..:నేనే పుడింగి అనుకోవడం సరికాదు :పవన్ పై బొత్సా కీలక వ్యాఖ్యలు..!

|
Google Oneindia TeluguNews

మంత్రి బొత్సా సత్యనారాయణ జనసేన అధినేత పవన్ కళ్యాణ్ మీద కీలక వ్యాఖ్యలు చేసారు. చంద్రబాబు కు మళ్లీ ఆయన ఫ్రెండ్ తోడయ్యారన్నారు. ఎన్నికల ముందు ఇంటర్నెల్.. ఇప్పుడు ఎక్సట్రనల్ అంటూ వ్యాఖ్యానించారు. సినిమాల్లో చేసిన యాక్షనంతా రాజకీయాల్లో చేస్తున్నారని దుయ్యబట్టారు. రాజకీయాల్లో యాక్షన్ పనికి రాదన్నారు. తనకూ కొన్ని విషయాలు తెలుసంటూ.. తాను ఆ మాట చెబితే తలకాయ ఎక్కడ పెట్టుకుంటారో కూడా తెలియదంటూ ఘాటుగా వ్యాఖ్యానించారు. 2014లో నేను పెద్ద పుడింగి అయ్యింటే గెలిచేవాడినేగా అని ప్రశ్నించారు. జగన్ అవసరం రాష్ట్రానికి ఉందని.. రెండు మెట్లు దిగి వైసీపీలో చేరుతున్నానని ఆ రోజే చెప్పిన విషయాన్ని గుర్తు చేసారు. వాస్తవాలు అంగీకరించకుండా.. నేనే పుడింగి అనుకోవడం సరికాదని హితవు చెప్పారు. గత ప్రభుత్వంలో ఎన్నో అకృత్యాలు జరిగినా హీరోగారు ఎందుకు స్పందించ లేదని ఎద్దేవా చేసారు. సమయం-సందర్భం లేకుండా మాట్లాడితే ప్రజలు హర్షించరన్నారు.

రాజధాని అడ్రస్ టెంపరరీ..
రాజధానిని బంగారు బాతులా చేశానంటూ చంద్రబాబు తెగ చెప్పుకుంటున్నారని..ఇప్పుడీ బంగారు బాతు ఎక్కడ ఉందని ప్రశ్నించారు. రాజధాని బంగారు బాతు కాదు.. అడ్రస్ లేని బాతులా తయారైందన్నారు.
బీజేపీలో రెండు రకాల వాయిస్ లు వినిపిస్తున్నాయని విమర్శించారు. తాము నియమించిన అధికారుల కమిటీ నివేదిక వచ్చిన తరువాత రాజధాని చిరునామా చెబుతామన్నారు. ప్రస్తుతం రాజధానికి ఉన్నది తాత్కాలిక చిరునామా అని వ్యాఖ్యానించారు. హైదరాబాద్ ఉమ్మడి రాజధానిగా ఉన్నప్పుడు రాత్రికి రాత్రి ఎందుకు వచ్చేసారని ప్రశ్నించారు. నాకూ ఏసీబీ ఉంది.. నాకూ పోలీసులు ఉన్నారు.. సెక్షన్-8 ఉందన్న చంద్రబాబు ఎందుకు వచ్చేశారంటూ నిలదీసారు.

Botsa says Ap capital adress is temporory..as per committee report will take decision

రాజధాని ప్రాంతంలో టీడీపీ నేతలు పర్యటించి ఏం చూస్తారు..కరకట్ట మీద చంద్రబాబు ఇల్లు చూస్తారా..నన్ను రమ్మంటే నేనూ వస్తా.. అన్ని చెబుతా అంటూ టీడీపీ నేతల రాజధాని పర్యటన నిర్ణయాన్ని తప్పుబట్టారు. 25 ఏళ్లు రాజకీయాల్లో ఉండడానికి వచ్చానన్న పవన్.. ఇంకా 15 ఏళ్లు రాజకీయాల్లో ఉండాలంటే జాగ్రత్తగా వ్యవహరించాలని సూచించారు. తాట తీస్తా.. ఊరికొస్తా అంటూ పవన్ కామెంట్లు చేయడం సరికాదని చెప్పుకొచ్చారు.

సీఎస్ బదిలీ రోటీన్...
సీఎస్, సెక్రటేరీల బదిలీలు కామనే అని బొత్సా వ్యాఖ్యానించారు. మంత్రులు వస్తూ ఉంటారు.. మారుతూ ఉంటారు.. అలాగే సీఎస్ బదిలీ అని తేలిగ్గా కొట్టి పారేసారు. పవనుకు భవన నిర్మాణ కార్మికుడి డెఫినెషన్ తెలుసా అని ప్రశ్నించారు. తట్టా.. బుట్టా పట్టుకున్న ప్రతి ఒక్కరూ భవన నిర్మాణ కార్మికుడు కాదని వ్యాఖ్యానించారు.

English summary
Minister Botsa once again key comments on Capital. He says cpaital adress is temporory. After committee report comes then govt will take decision. Botsa also fire on Pawan kalyan.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X