విజయవాడ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

కృష్ణమ్మ హారతి: బోయపాటికే బాబు ఓటు, సాయికుమార్ వాయిస్ ఓవర్

By Nageshwara Rao
|
Google Oneindia TeluguNews

అమరావతి: ఆగస్టు 12 నుంచి 23 వరకు జరగనున్న కృష్ణా పుష్కరాలను ఘనంగా నిర్వహించాలని ఏపీ ప్రభుత్వం నిర్ణయింంచింది. ఈ మేరకు కృష్ణా పుష్కరాలకు సంబంధించిన ఏర్పాట్లను త్వరితగతిన పూర్తి చేస్తోంది. అందుకు సంంబధించిన పనులను ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు స్వయంగా పర్యవేక్షిస్తున్నారు.

ఆతిథ్యం అదరాలన్న బాబు: పుష్కరాలకే ప్రత్యేకం బోట్ అంబులెన్స్‌లు

ఇప్పటికే పలుమార్లు ఘాట్ల నిర్మాణాలను పరిశీలించిన ఆయన తాజాగా కృష్ణా పుష్కరాలకు వచ్చే భక్తలకు అక్షయపాత్ర, టిటిడి దేవస్థానంల ద్వారా భోజన ఏర్పాట్లు చేయాలని అధికారులకు సూచించారు. మరోవైపు కృష్ణా పుష్కరాల సమయంలో నదీమతల్లికి హారతినిచ్చే దృశ్యాలను చిత్రీకరించే బాధ్యతలను ప్రముఖ దర్శకుడు బోయపాటి శ్రీనుకు అప్పగించారు.

అదేవిధంగా సినీ రచయిత జొన్నవిత్తులతో పుష్కరపాటలు రాయిస్తుండగా, మాధవపెద్ది సురేష్ సంగీతం సమకూరుస్తున్నారు. ఎస్పీతోపాటు మరో గాయకుడితో రెండు పాటలు పాడించాలని నిర్ణయించినట్లు తెలిసింది. దీనిని మంగళవారం ఖరారు చేయనున్నారు. వీటి ట్రాక్‌లను ప్రభుత్వ సలహాదారు డాక్టర్ పరకాల ప్రభాకర్ పర్యవేక్షిస్తున్నారు.

కృష్ణమ్మ హారతికి బోయపాటి దర్శకత్వం: సాయికుమార్ వాయిస్ ఓవర్

ఈ మేరకు ఆంధ్రప్రదేశ్ దేవాదయ శాఖ ముఖ్య కార్యదర్శి ప్రసాద్ తెలిపారు. సోమవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ హారతిచ్చే వేదిక డిజైన్ల పనులు కూడా ఆయనకే అప్పగించినట్టు వెల్లడించారు. ఇక విజయవాడ పోలీస్‌ బ్రాండ్‌ అంబాసిడర్‌, సినీనటుడు సాయికుమార్‌ ఈ కార్యక్రమానికి వాయిస్ ఓవర్‌ను అందించనున్నారు.

కృష్ణమ్మ హారతికి బోయపాటి దర్శకత్వం: సాయికుమార్ వాయిస్ ఓవర్

కృష్ణమ్మ హారతికి బోయపాటి దర్శకత్వం: సాయికుమార్ వాయిస్ ఓవర్

పుష్కరాల్లో భాగంగా హారతి కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించి, చరిత్రలో నిలిచిపోయేలా చేయాలని ముఖ్యమంత్రి చంద్రబాబు అదేశించారని ఆయన తెలిపారు. పుష్కరాలు జరిగే అన్ని రోజులు కనకదుర్గమ్మ, శ్రీశైల భ్రమరాంబ మల్లిఖార్జున దేవాలయాలను 22 గంటల పాటు తెరిచే ఉంచుతామని ఆయన తెలిపారు.

ఇదిలా ఉంటే గతేడాది జరిగిన గోదావరి పుష్కరాల సమయంలో తొక్కిసలాటకు బోయపాటి దర్శకత్వ ఏర్పాట్లే కారణమంటూ అప్పట్లో పెద్ద ఎత్తున ఆరోపణలు వచ్చిన సంగతి తెలిసిందే. ఒకపక్క ప్రజల ప్రాణాలు పోతుంటే, ఆయన షార్ట్ ఫిల్మ్‌లు షూట్ చేస్తున్నారంటూ విమర్శలు వెల్లువెత్తాయి.

ఆ విమర్శలను పక్కనబెట్టి ముఖ్యమంత్రి చంద్రబాబు వచ్చే నెలలో జరగనున్న కృష్ణా పుష్కరాలకు నదీమతల్లి కృష్ణమ్మ హారతి దృశ్యరూపాన్ని ఇచ్చే బాధ్యతలను కూడా ఆయనకే అప్పగించడం గమనార్హం. గతేడాది రాజమండ్రి వద్ద జరిగిన గోదావరి పుష్కరాల్లో తొక్కిసలాట చోటు చేసుకుని 27 మంది మృత్యువాత పడిన సంగతి తెలిసిందే.

English summary
Boyapati Srinu to direct krishna pushkaralu harathi in vijayawada.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X