వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

బాయ్ కాట్ చైనా క్యాంపెయిన్ ... తిరుపతిలో చైనా వస్తువులు తగలబెట్టిన బీజేపీ నాయకులు

|
Google Oneindia TeluguNews

భారత్ చైనా బోర్డర్ టెన్షన్ తో భారత్ లో చైనాపై ఆగ్రహజ్వాలలు మిన్ను ముడుతున్నాయి. ఇక తెలుగు రాష్ట్రాల్లోనూ డ్రాగన్ కంట్రీ చైనాపై నిరసనలు మిన్ను ముడుతున్నాయి. చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్ ఫోటోలను దగ్దం చేయడంతో పాటు చైనా వస్తువులను నిషేధించాలంటూ ప్రజలు పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమాలు చేపడుతూ బ్యాన్ చైనా ఉద్యమం ఉధృతంగా సాగిస్తున్నారు.

Tik tok ban ..అఖిల పక్ష భేటీలో ప్రధాని మోడీకి కేంద్రమంత్రుల డిమాండ్.!!Tik tok ban ..అఖిల పక్ష భేటీలో ప్రధాని మోడీకి కేంద్రమంత్రుల డిమాండ్.!!

ఈ నేపథ్యంలోనే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనూ నిరసనలు వెల్లువగా మారాయి. తిరుపతిలోనూ చైనాకు వ్యతిరేకంగా నిరసనలు చేశారు బీజేపీ నాయకులు . చైనా వస్తువులను బహిష్కరించాలని డిమాండ్ చేస్తూ తిరుపతిలోని నాలుగు కాళ్ల మండపం వద్ద బీజేపీ నేతలు నిరసన కార్యక్రమం చేపట్టారు. ఈ సందర్భంగా చైనా వస్తువులను బీజేపీ నేతలు తగలబెట్టారు. ప్రజలెవరూ చైనా వస్తువులను వాడొద్దని పిలుపునిచ్చారు.

 Boycott China Campaign ... BJP leaders burnt Chinese goods in Tirupati

ఇక చైనా దేశపు వస్తువులను బహిష్కరించడం ద్వారా జిత్తులమారి చైనాకు ఆర్థికంగా బుద్ధి చెబుదామని అన్నారు. ఇక ఇప్పటికే బీజేపీ నేతలు , బీజేపీ మిత్ర పక్ష పార్టీలు కూడా చైనాకు బుద్ధి చెప్పాలని నినదిస్తున్నాయి. ఇక నిన్న నిర్వహించిన అఖిల పక్ష భేటీలో కూడా చైనాను ఆర్ధికంగా దెబ్బ కొట్టాలని పెద్ద ఎత్తున చర్చ జరిపారు. ఇక ఈ నేపధ్యంలో చైనా యాప్స్ , చైనా వస్తువులే కాదు, చైనా కంపెనీలకు కాంట్రాక్టులు కూడా ఇవ్వకుండా ఆర్ధికంగా దెబ్బ కొడితే చైనాకు బుద్ధి వస్తుందని అంటున్నారు . ఇక ఈ క్రమంలోనే దేశ వ్యాప్తంగా చైనా ప్రొడక్ట్స్ దగ్ధం చేస్తున్నారు.

English summary
Protests in Andhra Pradesh have also turned up. BJP leaders staged protests against China demanding the boycott of Chinese goods. BJP leaders burnt Chinese goods on this occasion.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X