వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

డిసైడింగ్ గోస్పాడు: 10వేల మెజారిటీ, తేల్చేసిన టిడిపి, వైసీపీకి షాక్?

By Narsimha
|
Google Oneindia TeluguNews

నంద్యాల: నంద్యాల ఉపఎన్నికపై టిడిపి నేతలు లెక్కలు వేస్తున్నారు. నంద్యాల అసెంబ్లీ నియోజకవర్గంలో పోలైన ఓట్లను శాతం ఆధారంగా టిడిపి నేతలు గెలుపు ఓటములపై లెక్కలు వేస్తున్నారు.పదివేలకు పైగా ఓట్ల మెజారిటీతో విజయం సాధిస్తామని తెలుగుదేశం నేతలు ధీమాను వ్యక్తం చేస్తున్నారు.

రాజీనామాకు కట్టుబడి ఉన్నా: అఖిల సంచలనంరాజీనామాకు కట్టుబడి ఉన్నా: అఖిల సంచలనం

నంద్యాల ఉపఎన్నికల్లో గెలుపు కోసం టిడిపి,వైసీపీ నేతలు చివరి నిమిషం వరకు శ్రమించారు. పోలింగ్ సరళిపై రెండు పార్టీల నేతలు విశ్లేషిస్తున్నారు. సాధారణ ఎన్నికల కంటే అత్యధికంగా ఉపఎన్నికల్లో ఓటింగ్ నమోదైంది.

పెరిగిన పోలింగ్ ఎవరికి కలిసివస్తోందనే చర్చ సర్వత్రా సాగుతోంది. అంతేకాదు గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో కూడ ఓటింగ్ పెరగింది. సాధారణంగా ఉపఎన్నికల్లో ఎక్కువ శాతం పోలింగ్ నమోదు కాదని రాజకీయపార్టీలు అభిప్రాయపడుతున్నాయి.

నంద్యాల బైపోల్: కోట్లలో బెట్టింగ్‌లు, మెజారిటీపైనేనంద్యాల బైపోల్: కోట్లలో బెట్టింగ్‌లు, మెజారిటీపైనే

కానీ, అందరి అంచనాలను తలకిందులు చేస్తే నంద్యాల ఉపఎన్నికల్లో పెద్ద ఎత్తున ఓటింగ్ నమోదు కావడం చర్చనీయాంశంగా మారింది. అయితే పోలింగ్ పెరుగుదల ఎవరికి కలిసివస్తోందో ఈ నెల 28వ, తేది తర్వాత తేలనుంది.

పదివేలకు పైగా మెజారిటీతో భూమా గెలుపు

పదివేలకు పైగా మెజారిటీతో భూమా గెలుపు

నంద్యాల ఉపఎన్నికల్లో టిడిపి అభ్యర్థి పదివేల ఓట్ల మెజారిటీతో విజయం సాధిస్తారని ఆ పార్టీ నేతలు అంచనా వేస్తున్నారు. పోలింగ్‌ సరళిని పరిశీలించాక విజయావకాశాలపై ఆ పార్టీ వర్గాల్లో ధీమా పెరిగింది. మొదటి నుంచీ అనుకుంటున్నట్లుగా నంద్యాల పట్టణంలో తమకు మెజారిటీ మద్దతు లభించిందని, గ్రామీణ ప్రాంతంలో కూడా ప్రత్యర్థి వైసీపీ పట్టును తగ్గించగలిగామని టీడీపీ నేతలు అంటున్నారు. ముఖ్యంగా మహిళలు తమవైపే ఉన్నారని అభిప్రాయపడుతున్నారు. నంద్యాల పట్ణణంలో రోడ్ల వెడల్పు, అభివృద్ధి పనుల వల్ల పట్టణ ఓటర్ల మద్దతు తమకు అధికంగా లభిస్తుందని టిడిపి నేతలు ఆశాభావంతో ఉన్నారు.

గోస్పాడులో వైసీపీ మెజారిటీని తగ్గించాం

గోస్పాడులో వైసీపీ మెజారిటీని తగ్గించాం

గోస్పాడు మండలంలో వైసీపీకి స్వల్ప మెజారిటీ వస్తుందని టీడీపీ నేతలు అంచనా వేస్తున్నారు. గోస్పాడు మండలంలో గతంలో వైసీపీకి ఉన్న పట్టును బాగా తగ్గించగలిగామని టిడిపి నేతలు విశ్వాసాన్ని వ్యక్తం చేస్తున్నారు. 2014 ఎన్నికల సమయంలో భూమా నాగిరెడ్డికి గోస్పాడు మండలంలో టిడిపి అభ్యర్థి శిల్పా మోహన్‌రెడ్డి కంటే మూడువేల ఓట్లు ఆధిక్యం వచ్చింది. ఈ ఓట్లతోనే శిల్పాపై భూమా నాగిరెడ్డి విజయం సాధించారు.దరిమిలా ఈ మండలంపై టిడిపి కేంద్రీకరించింది. అయితే గంగుల ప్రతాప్‌రెడ్డి టిడిపిలో చేరడం కలిసివచ్చే అవకాశం ఉందని టిడిపి నేతలు విశ్వసిస్తున్నారు.

నంద్యాల రూరల్‌లో టిడిపికే మెజారిటీ

నంద్యాల రూరల్‌లో టిడిపికే మెజారిటీ


నంద్యాల రూరల్ మండలంలో టిడిపికే మెజారిటీ వచ్చే అవకాశం ఉందని ఆ పార్టీ నేతలు అభిప్రాయపడుతున్నారు.ఈ మండలంలో వైసీపీ కంటే ఎక్కువ ఓట్లు సాధిస్తామని టిడిపి నేతలు ధీమాను వ్యక్తం చేస్తున్నారు. అయితే గోస్పాడు మండలంలో వైసీపీకి మెజారిటీ పెరిగితే నష్టమనే అభిప్రాయంతో టిడిపి నేతలున్నారు.పట్టణ పోలింగ్ మరింత పెరిగితే తమకు ప్రయోజనమనే అభిప్రాయంతో టిడిపి నేతలున్నారు.

పట్టణంలో ఓటింగ్ పెరిగితే మెజారిటీ పెరిగేది

పట్టణంలో ఓటింగ్ పెరిగితే మెజారిటీ పెరిగేది


నంద్యాల పట్టణంలో పోలింగ్‌ శాతం ఇంకా పెరిగి ఉంటే బాగుండేదని టిడిపి నేతలు అభిప్రాయపడుతున్నారు. పట్టణ ఓటర్లు టిడిపి వైపుకు మొగ్గుచూపారని వారు అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు. పట్టణంలో ఓటింగ్ శాతం పెరిగితే మెజారిటీ మరింత పెరిగేదని విశ్లేషిస్తున్నారు. ‘పట్టణంలో ఎంత పోలింగ్‌ పెరిగితే మాకు అంత లాభం. ఆశించిన స్థాయిలో పోలింగ్‌ పెరగకపోవడం మాకు నిరుత్సాహం కలిగించింది' అని టిడిపి నేత ఒకరు అభిప్రాయపడ్డారు. పట్టణంలో పోలింగ్‌శాతాన్ని పెంచేందుకు పెంచడానికి టీడీపీ శ్రేణులు చివరిదాకా గట్టి ప్రయత్నం చేసిన విషయాన్ని ఆయన గుర్తుచేశారు.

English summary
Tdp candidate Bhuma Brahmandha reddy will win in Nandyal by poll 10 thousand votes majority said Top tdp leader. senior leaders anlasys on Nandyal by polling percentage.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X